NNS 18th November Episode: భూమి, భాగీలను కాపాడిన శోభ.. తల్లిని చూసిన భూమి.. భాగీకి కనపడే శక్తి కోల్పోయిన ఆరు​​​​!-zee telugu serial nindu noorella saavasam today 18th november episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 18th November Episode: భూమి, భాగీలను కాపాడిన శోభ.. తల్లిని చూసిన భూమి.. భాగీకి కనపడే శక్తి కోల్పోయిన ఆరు​​​​!

NNS 18th November Episode: భూమి, భాగీలను కాపాడిన శోభ.. తల్లిని చూసిన భూమి.. భాగీకి కనపడే శక్తి కోల్పోయిన ఆరు​​​​!

Hari Prasad S HT Telugu
Nov 18, 2024 07:28 AM IST

NNS 18thNovember Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (నవంబర్ 18) ఎపిసోడ్లో భూమి, భాగీలను మనోహరి నుంచి కాపాడుతుంది శోభ ఆత్మ. అటు తన తల్లిని భూమి చూస్తుంది. మరోవైపు భాగీని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి మనోహరి ఏం చేస్తుందన్నది ఈరోజు ఎపిసోడ్లో చూడొచ్చు.

భూమి, భాగీలను కాపాడిన శోభ.. తల్లిని చూసిన భూమి.. భాగీకి కనపడే శక్తి కోల్పోయిన ఆరు​​​​!
భూమి, భాగీలను కాపాడిన శోభ.. తల్లిని చూసిన భూమి.. భాగీకి కనపడే శక్తి కోల్పోయిన ఆరు​​​​!

NNS 18th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 18) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజ చేసి గుళ్లో దీపాలు వెలిగిస్తున్న భాగీకి మనోహరి తాను తీసుకొచ్చిన నూనెతో దీపాలు వెలిగించమని చెప్తుంది.

ఈ నూనెతో వెలిగిస్తున్నాను కదా..? మరి ఆ నూనెతో ఎందుకు వెలిగించమంటున్నావు అని అడుగుతుంది భాగీ. అసలు ఆ నూనెతో దీపం వెలిగిస్తే అంత పుణ్యం వస్తుందా..? అయితే నువ్వే వెలిగించొచ్చు కదా..? అని చెప్తుంది. దీంతో ఇంకా ఎక్కువ చెప్తే.. దీనికి అనుమానం వస్తుంది అని మనసులో అనుకుని కామ్‌గా ఉంటుంది.

ఎమోషనల్ అయిన శోభ

ఇంతలో పంతులు గారు కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడిలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాము ఎవరైనా పాల్గొనవచ్చు అని చెప్పగానే భూమి, అమ్ము వెళ్లి డాన్స్‌ చేస్తారు. భూమి డాన్స్‌ చూసిన శోభాచంద్ర హ్యాపీగా ఫీలవుతుంది. బాలిక నువ్వు తిరిగి వెళ్లు సమయం ఆసన్నమైంది అంటాడు గుప్త. నీకు ఎలా థాంక్స్‌ చెప్పాలో కూడా తెలియడం లేదు. నీ పుణ్యాన్ని నా కడుపు కోత తీర్చడానికి వాడావు. కన్న కూతురుని కళ్లారా చూడలేకపోయాననే బాధను నువ్వు తీర్చావు.

నువ్వు ఎవరో నాకే ఎందుకు ఈ సాయం చేశావో నాకు తెలియదు. నా వరకు నేను చూడని దైవం నువ్వు. నేను నమ్మిన ధర్మం నువ్వు. ఈ రుణ బంధం తీర్చుకోవాలని లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే నీయంత మంచి బుద్ది ఇవ్వమని ఆ దేవుడిని అడుగుతాను. మళ్లీ చచ్చేవరకు నీలాగే బతుకుతాను అంటుంది శోభ. బాలిక ఆఖరి సారి నీ కూమార్తెను చూసుకోవాలని ఉంటే చూసుకొనుము అంటాడు గుప్త.

అవసరం లేదు గుప్త గారు నా కూతురు చుట్టు ఇంత మంచి వాళ్లు ఉండగా నా కూతురుకు ఏమీ కాదు. సంతోషంగా ఉంటుంది. నేను వెళ్లి వస్తాను అరుంధతి అంటుంది శోభ. అలాగేనండి అంటుంది ఆరు. గుప్త గారు పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ దేవ దేవుడిని దర్శించుకుని వెళ్తాను అని చెప్పి శోభాచంద్ర వెళ్లిపోతుంది.

భాగీ, భూమిలను కాపాడిన శోభ

మిస్సమ్మ వాళ్ల దగ్గరకు వెళ్దాం పదండి అని ఆరు.. గుప్తను తీసుకుని కొలను దగ్గరకు వెళ్తుంది. తర్వాత అపూర్వ.. మనోహరికి ఫోన్‌ చేస్తుంది. ఏమైందని అడుగుతుంది. ఇంకొద్దిసేపట్లో నీ శత్రువు. నా శత్రువు చనిపోబోతున్నారని వీడియో కాల్ చేస్తాను. లైవ్‌ లో దాని చావును చూసి ఎంజాయ్‌ చేయు అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తుంది మనోహరి. గుప్త గారు మనోహరి ఏంటి ఇందాకటి నుంచి ఆ ఫోన్‌ పట్టుకుని ఏదో చేస్తుంది. దాని వరుస చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. మౌనంగా ఉన్నారేంటి గుప్త గారు.. మను ఏమైనా ప్లాన్‌ చేసిందా..? అంటుంది ఆరు.

అవును బాలిక అచట ఉన్న ఆ బాలికలు ఇరువురికి ప్రమాదం జరగబోవుతున్నది అంటాడు గుప్త. నో ఇలా జరగకూడదు.. మిస్సమ్మ.. అంటూ పిలుస్తుంది ఆరు. బాలిక ఆగుము. నువ్వు ఎంత ప్రయత్నించినను. నీ మాటలు ఆ బాలికకు వినిపించవు.. నువ్వు ఆ బాలికకు కనిపించవు.. అంటాడు గుప్త. మిస్సమ్మ.. వద్దు… అని చెప్తుంది ఆరు. అయినా మిస్సమ్మ దీపం పట్టుకుని ఉంటే భూమి అగ్గిపుల్ల వెలిగిస్తుంది. ఇంతలో దీపం మాయం అయిపోతుంది. అందరూ షాక్‌ అవుతారు. శోభాచంద్ర ఆత్మ ఆ దీపాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. గుడి గోపురం మీద శోభ చంద్రను చూస్తుంది భూమి. తర్వాత ఇంకో దీపం వెలిగించబోతుంటే.. గుడిలోని శివలింగం నుంచి ఒక శక్తి వచ్చి ఆ దీపం సజావుగా వెలిగేటట్టు చేస్తుంది. అందరూ హ్యాపీగా దీపాలు వెలిగిస్తారు.

భాగీని మనోహరి అడ్డుకుంటుందా?

భాగీని తీసుకెళ్లడానికి వచ్చిన అమర్‌ బయట నిలబడి ఉండటం.. అమర్‌ను ఇంట్లోకి తీసుకెళ్లడానికి అమ్ము బయటకు బయటకు వస్తుంది. డాడ్‌ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. రండి డాడ్‌ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మిస్సమ్మ ఉండాల్సింది ఇక్కడ కాదు డాడ్‌. అమ్మ ఎలాగూ లేదు. ఎంత అనుకున్న మీరు తీసుకురాలేరు. కానీ మీరనుకుంటే మిస్సమ్మను తీసుకురాగలరు. డాడ్‌ ప్లీజ్‌ రండి డాడ్ అని అమ్ము లోపలికి తీసుకెళ్తుంది.

అమర్‌ ను చూసి భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ లోపలికి వెళ్లి సైలెంట్‌ గా ఉంటారు. ఇంతలో అమర్‌, రామ్మూర్తితో మిస్సమ్మను తీసుకెళ్లడానికే వచ్చాను. అని చెప్పగానే రామ్మూర్తి తీసుకెళ్లండి బాబు మీ భార్య, వాళ్ల అమ్మ.. తీసుకెళ్లండి అని చెప్తాడు రామ్మూర్తి. భాగీని ఇంట్లోకి రానీయకుండా మనోహరి ఏం చేస్తుంది? ఘోరాతో ఆరుకి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్​ 18న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner