NNS 18th January Episode: అంజులో ఆరు ఉందని తెలుసుకున్న రామ్మూర్తి.. ఆత్మను బంధించడానికి ఘోర, మనోహరి కొత్త ప్లాన్-zee telugu serial nindu noorella saavasam today 18th january episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 18th January Episode: అంజులో ఆరు ఉందని తెలుసుకున్న రామ్మూర్తి.. ఆత్మను బంధించడానికి ఘోర, మనోహరి కొత్త ప్లాన్

NNS 18th January Episode: అంజులో ఆరు ఉందని తెలుసుకున్న రామ్మూర్తి.. ఆత్మను బంధించడానికి ఘోర, మనోహరి కొత్త ప్లాన్

Hari Prasad S HT Telugu
Jan 18, 2025 06:00 AM IST

NNS 18th January Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (జనవరి 18) ఎపిసోడ్లో అంజులో ఆరు ఉందని తెలుసుకొని రామ్మూర్తి ఎమోషనల్ అవుతాడు. ఆరు ఆత్మను బంధించడానికి ఘోర తన మంత్రి శక్తులను కూడా మనోహరికి చూపిస్తాడు.

అంజులో ఆరు ఉందని తెలుసుకున్న రామ్మూర్తి.. ఆత్మను బంధించడానికి ఘోర, మనోహరి కొత్త ప్లాన్
అంజులో ఆరు ఉందని తెలుసుకున్న రామ్మూర్తి.. ఆత్మను బంధించడానికి ఘోర, మనోహరి కొత్త ప్లాన్

NNS 18th January Episode: జీ తెలుేగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 18) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంజు శరీరంలో ఉన్న ఆరు ఆత్మను బంధించేందుకు ప్రయత్నిస్తున్న ఘోరాను కొడతాడు అమర్​. తప్పించుకున్న ఘోర పారిపోతాడు. అంజు నుంచి ఆరు బయటకు వస్తుంది.

అంజు సేఫ్.. ఊపిరి పీల్చుకున్న మిస్సమ్మ

అంజు స్పృహ తప్పి పడిపోతుంది. రాథోడ్‌, రామ్మూర్తి కంగారు పడతారు. అంజును చూసి ఆరు ఏడుస్తుంది. ఐయామ్ సారీ అంజు చిన్నప్పుడు నేను కోల్పోయిన ఆనందాన్ని ఇప్పుడు నాన్నతో ఉండి తీర్చుకుందామనుకుంటూ.. అదంతా నా స్వార్థం అమ్మా కానీ ఇలా జరగుతుందని నాకు తెలియదు అంటూ ఏడుస్తుంది. అంజు మీద నీళ్లు చల్లగానే.. స్పృహలోకి వచ్చిన అంజు డాడ్‌ నేనేంటి ఇక్కడున్నాను.. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు.. అని అడుగుతుంది.

దీంతో షాక్‌ అయిన రామ్మూర్తి అదేంటి అంజు పాప నువ్వే కదా.. అంటూ చెప్పబోతుంటే.. అమర్‌ వద్దని సైగ చేస్తాడు. రాథోడ్ కు అంజును తీసుకుని కారు దగ్గరకు వెళ్లు అని చెప్తాడు. రాథోడ్ అంజును తీసుకుని కారు దగ్గరకు వెళ్లి మిస్సమ్మకు ఫోన్‌ చేసి అంజు దొరికిందని చెప్తాడు. టైంకు మేము వెళ్లడం వల్ల ఆ ఘోరా సార్‌ ను చూసి పారిపోయాడు అని చెప్తాడు. రాథోడ్‌ చెప్పగానే.. మిస్సమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. పొద్దునుంచి కాలు చేయి ఆడలేదు.. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు అంటుంది. అమ్ము మిస్సమ్మను హగ్‌ చేసుకుంటుంది.

అంజులో ఉన్నది ఆరు అని తెలుసుకున్న రామ్మూర్తి

రామ్మూర్తి ఆశ్చర్యంగా బాబు గారు అసలు ఏం జరుగుతుంది.. నేను ఇంట్లో ఉండగా అంజు పాప రావడం ఏంటి..? మేము ఇద్దరం బట్టలు కొనడానికి షాపు వెళ్లడం ఏంటి..? ఆ ఘోర మా వెంట పడటం ఏంటి..? ఇంత జరిగాక అంజలి పాప ఇప్పుడు లేచి నేను ఇంట్లో కదా ఉండాల్సింది.. ఇక్కడ ఉన్నానేంటి అని అడుగుతుంది. అసలు ఏం జరగుతుంది బాబుగారు అని అడగ్గానే.. అర్థం అయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆరు ఆత్మ ఇంకా భూమ్మీద ఉందని మీకు తెలుసు కదా..? తెలుసు బాబు అమ్మాయికి మోక్షం కలగాలనే కదా.. రేపు కాశీకి వెళ్దాం అనుకున్నాం అంటాడు రామ్మూర్తి.

ఇవాళ మీ ఇంటికి వచ్చింది. మీతో మాట్లాడింది. మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది. మీతో చీర కొనిపించింది. మీ కన్నీళ్లు తుడిచింది. మిమ్మల్ని నవ్వించింది. అంజు కాదు అని అమర్‌ చెప్పగానే.. అంజు కాదా..? మరి ఇవన్నీ చేసింది ఎవరు అని రామ్మూర్తి అడుగుతాడు. మీ కూతురు అరుంధతి అని అమర్‌ చెప్పగానే.. రామ్మూర్తి షాక్‌ అవుతాడు. అరుంధతి అంజలి రూపంలో మీతో గడపలేని క్షణాలను చూడలేని సంతోషాలను పొందడానికి వచ్చింది అని అమర్‌ చెప్పగానే.. అంజు తనను మాటి మాటికి నాన్నా అనడం.. మీ కూతుర్ని కదా అనడం గుర్తు చేసుకుంటాడు రామ్మూర్తి.

బాబు గారు మీరు చెప్తుంది నిజమా అని అడుగుతాడు. అవును కానీ ఎలా అంటే మాత్రం నా దగ్గర సాక్ష్యం లేదు. కానీ అంజలిలో ఇంతసేపు ఉన్నది ఆరు ఆత్మనే.. అని అమర్ చెప్పగానే రామ్మూర్తి ఎమోషనల్ అవుతాడు. నా బిడ్డను మళ్లీ నేను దూరం చేసుకున్నాను అని ఏడుస్తుంటాడు రామ్మూర్తి. రామ్మూర్తిని అమర్ ఓదారుస్తాడు. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని అమర్‌ చెప్పి రామ్మూర్తిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఆత్మను పట్టుకుంటానని ఘోర శపథం

మనోహరి ఘోర దగ్గరకు వెళ్లి తిడుతుంది. ఇది నీవల్ల కాదని నాకు తెలుసు. అమర్‌ వచ్చే లోపు నువ్వు పారిపోయావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేది. నువ్వు దొరికితే నా పరిస్థితి ఏంటో నీకు అర్థం అవుతుందా.? నువ్వు ప్రయత్నించింది చాలు. అది ఈ లోకం నుంచి వెళ్లాక అమర్‌ నా సొంతం అయ్యాక నీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను. అని మను చెప్పగానే.. నేను ఓటమిని ఒప్పుకుని నా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు నేను వెనుదిరగలేను మనోహరి అంటాడు ఘోర.

ఏం చేస్తావు అని మనోహరి అడుగుతుంది. ఆ ఆత్మ దొరికే వరకు ప్రయత్నిస్తాను. నాదృష్టిలో ఓటమి అంటే చావే.. అంటాడు ఘోర. రేపు అస్థికలు తీసుకెళ్తున్నారు. ఇవాళ జరిగిన దానికి అమర్‌ అస్తికలు తన దగ్గరే పెట్టుకుంటాడు. ఎలా తీసుకొస్తాం.. అని అడుగుతుంది. దీంతో కోపంగా ఘోర తన శక్తిని మనోహరికి చూపిస్తాడు. భుజబలంతో పాటు మంత్రబలం కూడా ఉన్న శక్తులను తయారు చేసుకున్నాను అని చూపిస్తాడు.

అంజుకు మిస్సమ్మ జ్యూస్‌ తాగిస్తుంది. ఎందుకు ఇంట్లోంచి వెళ్లావు అని అడగ్గానే నాకు గుర్తు లేదని చెప్తుంది అంజు. పాప అలిసిపోయినట్టు ఉంది పాప ఇంటికి తిరిగి వచ్చింది కదా ఇప్పుడు ఇవ్వన్నీ ఎందుకు తల్లీ అంటాడు రామ్మూర్తి. మిస్సమ్మ ఎంత అడిగినా నాకు ఏం గుర్తు రావడం లేదు మిస్సమ్మ అంటుంది. ఇంతలో నిర్మల ఆ మంత్రగాడు ఏదో చేసి ఉంటాడు అని చెప్తుంది. కాశీలో ఏం జరగబోతోంది? ఘోరా ఆరు ఆత్మను బంధిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి​ 18న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner