NNS 18th February Episode: అనామిక శరీరంలోకి అరుంధతి ఆత్మ వెళ్లిందని తెలుసుకున్న మనోహరి.. గుడిలో భాగీకి అనామిక సాయం-zee telugu serial nindu noorella saavasam today 18th february episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 18th February Episode: అనామిక శరీరంలోకి అరుంధతి ఆత్మ వెళ్లిందని తెలుసుకున్న మనోహరి.. గుడిలో భాగీకి అనామిక సాయం

NNS 18th February Episode: అనామిక శరీరంలోకి అరుంధతి ఆత్మ వెళ్లిందని తెలుసుకున్న మనోహరి.. గుడిలో భాగీకి అనామిక సాయం

Hari Prasad S HT Telugu
Published Feb 18, 2025 10:57 AM IST

NNS 18th February Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్లో అరుంధతి ఆత్మ అనామికలోకి వెళ్లిందని తెలుసుకుంటుంది మనోహరి. అటు గుడిలో భాగీకి అనామిక సాయం చేయడం చూసి అమర్ కుటుంబం మరింత మురిసిపోతుంది.

అనామిక శరీరంలోకి అరుంధతి ఆత్మ వెళ్లిందని తెలుసుకున్న మనోహరి.. గుడిలో భాగీకి అనామిక సాయం
అనామిక శరీరంలోకి అరుంధతి ఆత్మ వెళ్లిందని తెలుసుకున్న మనోహరి.. గుడిలో భాగీకి అనామిక సాయం

NNS 18th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 18) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ ఇంట్లో పిల్లల కేర్ టేకర్ ఇంటర్వ్యూ కోసం వస్తూ మధ్యలో గుడికి వెళ్తుంది అనామిక. అక్కడ అమర్ కుటుంబం ఆమెను కలుస్తుంది. ఇటు అరుంధతి కనిపించకపోవడంతో ఆమె ఎక్కడికెళ్లిందో తెలుసుకోవడానికి మనోహరి ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

అరుంధతి ఎక్కడుందో చెప్పిన స్వామీజీ

అరుంధతి ఆత్మ జాడ కనుక్కోవడానికి బాబ్జీ ద్వారా ఓ స్వామీజీని ఇంటికి రప్పిస్తుంది మనోహరి. అమర్, మిగిలిన కుటుంబ సభ్యులు గుడికి వెళ్లిన సమయంలోనే ఓ స్వామీజీని ఇంటికి తీసుకొస్తాడు బాబ్జీ. ఇంట్లోకి రాగానే ఆయన చుట్టూ బాగా పరిశీలిస్తాడు.

మనోహరి వెంటనే అరుంధతి ఫొటోను తీసుకొచ్చి స్వామీజీకి చూపిస్తుంది. ఆయన తన మంత్ర శక్తితో అరుంధతి ఆత్మ అనామికలోకి వెళ్లినట్లు గుర్తిస్తాడు. అదే విషయాన్ని మనోహరికి చెబుతాడు. ఆత్మ మానవ శరీరంలోకి ప్రవేశించింది అంటాడు. అది విని మనోహరి షాక్ తింటుంది.

గుడిలో భాగీకి అనామిక సాయం

అటు శివరాత్రి సందర్భంగా అమర్ కుటుంబం మొత్తం గుడికి వెళ్తుంది. అక్కడ అభిషేకం టికెట్ కోసం శివరాం, నిర్మలతోపాటు అనామిక కూడా ప్రయత్నిస్తుంది. కానీ వీళ్లిద్దరికీ టికెట్ దొరకగా.. అభిషేకం టికెట్లు అయిపోయాయంటూ అనామికకు అక్కడి సిబ్బంది చెబుతారు. అది విని నిరాశకు గురైన అనామికను తమతోపాటే అభిషేకంలో పాల్గొనాలని వాళ్లు అడుగుతారు.

ఆ తర్వాత గుడికి వచ్చిన అమర్, భాగీకి అనామిక గురించి చెబుతారు. అందరూ కలిసి ఆమె కోసం వెతుకుతుంటారు. ఆ తర్వాత అమర్, భాగీ, అనామిక ఎదురు పడతారు. ఆమెను చూసి వాళ్లు షాక్ తింటారు. గుడిలో ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరుగుతుంది. ఈ సందర్భంగా పల్లకి మోస్తున్న వ్యక్తికి ఓ పిల్లాడు అడ్డు రావడంతో పైన ఉన్న విగ్రహం కింద పడబోతోంది.

దీంతో పక్కనే ఉన్న భాగీ ఆ విగ్రహం కింద పడకుండా పట్టుకుంది. ఆ విగ్రహాన్ని సరిగా పట్టుకోలేక ఇబ్బంది పడుతుండగా.. వెంటనే అనామిక వచ్చి భాగీకి సాయం చేస్తుంది. అది చూసి అమర్ కుటుంబం ఎంతో సంతోషిస్తుంది. అప్పటికే అనామిక మంచితనాన్ని శివరాం, నిర్మల చూస్తారు. తనతోపాటు ఓ చిన్న పిల్లాడికి కూడా ఆమె సాయం చేయడాన్ని నిర్మల గుర్తించి ఆనందపడుతుంది.

మరి అరుంధతి ఆత్మ మనిషి శరీరంలోకి వెళ్లిందని తెలుసుకున్న మనోహరి ఏం చేయబోతోంది? అనామికే తమ ఇంటికి కేర్ టేకర్ గా రాబోయే వ్యక్తి అని అమర్ కుటుంబం తెలుసుకుంటుందా అన్నది తెలియాలంటే మంగళవారం (ఫిబ్రవరి 18) ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం