NNS 17th April Episode: పూర్తిగా మిస్సమ్మగా మారిపోయిన అరుంధతి.. మనోహరి బండారం బట్టబయలు!-zee telugu serial nindu noorella saavasam today 17th april episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 17th April Episode: పూర్తిగా మిస్సమ్మగా మారిపోయిన అరుంధతి.. మనోహరి బండారం బట్టబయలు!

NNS 17th April Episode: పూర్తిగా మిస్సమ్మగా మారిపోయిన అరుంధతి.. మనోహరి బండారం బట్టబయలు!

Hari Prasad S HT Telugu
Apr 17, 2024 12:36 PM IST

NNS 17th April Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (ఏప్రిల్ 17) ఎపిసోడ్ లో మిస్సమ్మలో ఐక్యమవుతుంది అరుంధతి ఆత్మ. ఆ తర్వాత మనోహరి బండారం బయటపెట్టే పని మొదలుపెడుతుంది.

పూర్తిగా మిస్సమ్మగా మారిపోయిన అరుంధతి.. మనోహరి బండారం బట్టబయలు!
పూర్తిగా మిస్సమ్మగా మారిపోయిన అరుంధతి.. మనోహరి బండారం బట్టబయలు!

NNS 17th April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఏప్రిల్ 17) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పిల్లలందరూ పెళ్లికి వెళ్లకుండా ఏడుస్తూ ఉంటారు. అరుంధతి కిటికీలోంచి అంతా చూస్తూ ఉంటుంది. అన్నీ తెలిసినా ఏం చేయలేక రాథోడ్ బాధను దాచుకుంటూ పిల్లల కోసం నవ్వుతూ మాట్లాటానికి ప్రయత్నిస్తాడు. కానీ నటించలేక, సహాయం చేయలేకపోతున్నాను అంటూ ఏడుస్తాడు.

వీళ్లను చూస్తూ ఉన్న అరుంధతి, చిత్రగుప్త కూడా చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు అందరూ కలిసి అమ్మను చాలా మిస్ అవుతున్నాము కాబట్టి మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేసేయమని తండ్రికి చెప్పమని చెబుతారు. అమ్మ లేకపోతే ఇంత బాధగా ఉందని తెలిస్తే మేము కూడా అమ్మతోపాటు దేవుడి దగ్గరికి వెళ్లిపోయే వాళ్ళము అని అంటారు.. ఆ మాటలకి దూరం నుండి చూస్తున్న అరుంధతి, చిత్రగుప్త పక్కనే ఉన్న రాథోడ్ పిల్లలు అందరూ చాలా వెక్కివెక్కి ఏడుస్తారు. అమ్మలా మనల్ని చూసుకోవడానికి మిస్సమ్మ కూడా లేదని బాధపడతారు.

ఆనందంగా మనోహరి

గుండెలను మెలిపెట్టే పిల్లల బాధ చూసి దేవుడికి మనసే లేదని, అందుకే ఆడుకోవాల్సిన వయసులో బాధపెడుతున్నాడని రాథోడ్ దేవుణ్ణి నిందిస్తాడు. పిల్లల్ని ఎలా అయినా హాస్టల్లో జాయిన్ చేసేయమని అడుగుతానని చెబుతాడు. వీళ్లందరిని చూసి చిత్రగుప్తుడు కూడా కన్నీరు మున్నీరు అవుతాడు. తీరా పక్కకి తిరిగి చూసేసరికి అరుంధతి ఉండదు.

మళ్లీ చిత్రగుప్తుడు తన వెతుకులాటను మొదలుపెడతాడు. యమహో యమ అని అనుకుంటూ అరుంధతి ఎక్కడికి వెళ్లిందో, ఎందుకు వెళ్లిందో అని ఆలోచిస్తూ కళ్యాణమండపం దగ్గరకే వెళ్ళింది అనుకోని అక్కడికి బయలుదేరుతాడు. సంభావన ఎక్కువ ఇస్తానన్న మనోహరి మాటతో పెళ్లి అనుకున్న సమయం కన్నా ముందుగానే చేయించడానికి పంతులు అన్నిఏర్పాట్లు చేస్తుంటారు.

కళ్యాణ మండపంలో అమరేందర్ చాలా బాధపడుతూ ఉంటాడు, అమరేంద్రని పెళ్లి చేసుకోబోయే మనోహరి ఆనందంగా ఫోటోలు దిగుతూ ఉంటుంది. మరోవైపు బిహారి గ్యాంగ్ వాళ్ళు ఒక కారు నెంబరు పట్టుకొని, ఆ కారు అమరేంద్ర పేరు మీద ఉందని తెలుసుకుంటారు.

భాగీ ఇంట్లో అరుంధతి

అరుంధతి భాగీ వాళ్ళింట్లో ప్రత్యక్షమవుతుంది. భాగ్య తన ఇంట్లో తన ఎదురుగుండా ఉన్న వినాయకుడికి చూసి దండం పెడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మనోహరి లాంటి తప్పుడు వ్యక్తిని ఆ కుటుంబంలోకి ఎందుకు పంపావు అని ప్రశ్నిస్తుంది. సమస్యను నువ్వు తీర్చలేకపోతే తీర్చే శక్తి నాకివ్వు అని వేడుకుంటుంది. ఏదన్నా అద్భుతం చేయమని, మనోహరి, అమరేంద్ర పెళ్లిని ఆపటానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని కోరుకుంటుంది.

మనోహరి పెళ్లిని ఆపడానికి అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను అని చెబుతుంది. పిల్లలని కాపాడే మార్గం చూపమని ఏడుస్తుంది. భాగీ బాధని, పిల్లలపై ఆమెకున్న ప్రేమని చూసి అరుంధతి చలించిపోతుంది. మనసులోనే భాగికి దండం పెడుతుంది. స్వార్ధంగా ఆలోచించి నీ జీవితాన్ని పణంగా పెడుతున్నానేమోనని చాలా భయంగా ఉంది అని, నీ మనసులోని మాటలు విన్నాక నా మనసులో కలత పోయింది మిస్సమ్మకి థాంక్యూ అని చెబుతుంది.

ఎన్ని జన్మలెత్తినా నీ త్యాగం మాత్రం మరిచిపోను అని అంటుంది. మిస్సమ్మ గురించి పిల్లలు అమ్మలా ఉంటుంది, మిస్సమ్మ మా అమ్మ లాగా బాగా చూసుకుంటుంది అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మిస్సమ్మలోకి ఏకమవుతుంది.. అరుంధతి.. మిస్సమ్మగా మారిపోతుంది. మిస్సమ్మగా మారిన అరుంధతి ఏం చేయబోతోంది? మనోహరి బండారం ఎలా బయటపడుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 17న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point