NNS 16th November Episode: భాగీని కలిసిన భూమి.. శోభ ఆత్మను రప్పించిన ఆరు.. భూమి, భాగీలను చంపేందుకు మనోహరి ప్లాన్​​​!-zee telugu serial nindu noorella saavasam today 16th november episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 16th November Episode: భాగీని కలిసిన భూమి.. శోభ ఆత్మను రప్పించిన ఆరు.. భూమి, భాగీలను చంపేందుకు మనోహరి ప్లాన్​​​!

NNS 16th November Episode: భాగీని కలిసిన భూమి.. శోభ ఆత్మను రప్పించిన ఆరు.. భూమి, భాగీలను చంపేందుకు మనోహరి ప్లాన్​​​!

Hari Prasad S HT Telugu
Nov 16, 2024 06:00 AM IST

NNS 16thNovember Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (నవంబర్ 16) ఎపిసోడ్లో భూమి.. భాగీని కలుస్తుంది. మరోవైపు ఆమె తల్లి శోభ ఆత్మను రప్పిస్తుంది ఆరు. అయితే భూమి, భాగీలను చంపేందుకు మనోహరి కొత్త ప్లాన్ వేస్తుంది.

భాగీని కలిసిన భూమి.. శోభ ఆత్మను రప్పించిన ఆరు.. భూమి, భాగీలను చంపేందుకు మనోహరి ప్లాన్​​​!
భాగీని కలిసిన భూమి.. శోభ ఆత్మను రప్పించిన ఆరు.. భూమి, భాగీలను చంపేందుకు మనోహరి ప్లాన్​​​!

NNS 16th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 16) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్​ వచ్చి పిలిస్తేనే భాగీని పంపిస్తానని రామ్మూర్తి అనడంతో రాథోడ్ వెళ్లి జరిగింది అమర్​కి చెబుతాడు. సరేనని అమర్​ వచ్చి మిస్సమ్మ.. నిన్ను తీసుకువెళ్లడానికే వచ్చాను. మన ఇంటికి వెళ్దాం పద అనడంతో ముందు బెట్టు చేసినట్లు నటించినా వెంటనే రెడీ అయ్యి వెళ్లిపోతుంది భాగీ.

అమర్‌, పిల్లలతో కలిసి గుడికి భాగీ

అమర్‌, భాగీ, పిల్లలు, మనోహరి అందరూ కలిసి గుడికి వెళ్తారు. కారు దిగిన భాగీ కాలుకు ఏదో గుచ్చుకుందని బాధపడుతుంటే అమర్‌ చూసుకుని నడవొచ్చు కదా అంటాడు. దీంతో మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. వీళ్లిద్దరిని విడగొట్టాలని నేను ప్రయత్నిస్తుంటే.. వీళ్లేమో బంధం గట్టి పడాలని గుడికి వచ్చారు. వీళ్లతో పాటు రావడం నా దరిద్రం అని మనసులో అనుకుంటుంది.

కళ్లు నెత్తిన పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది అంటుంది. ఇప్పుడు ఓకేనా..? పర్వాలేదా..? నడవగలవా..? అంటాడు అమర్. గుచ్చుకుంది చిన్న పెంకే.. గునపం కాదు అమర్​ అంటుంది మనోహరి. నడవగలను వెళ్దాం పదండి అంటుంది భాగీ. ఛీ.. ఈరోజు ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందో…? అని మనసులో అనుకుంటుంది మనోహరి.

అమర్, భూమి పరిచయం

గుడి దగ్గర ఆడవాళ్లను ఆట పట్టిస్తున్న పోకిరీలను చూసి అమర్‌ మీరు వెళ్లండి నేను వస్తాను అంటాడు. భాగీ వాళ్లు లోపలికి వెళ్తారు. ఇంతలో గగన్‌, భూమి కూడా అదే గుడికి వస్తారు. గగన్‌ కూడా వాళ్లను చూసి కొట్టడానికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి పోకిరీలను కొడతారు. తర్వాత ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటారు. గుడిలోకి వెళ్లిన అంజు మనోహరిని కామెడీగా చూస్తుంది. మిస్సమ్మ ముందు నువ్వు తుస్సు అయ్యావంటూ వెక్కిరిస్తుంది. మనోహరి ఇరిటేటింగ్‌ ఫీలవుతుంది.

నేను ఎంత చేసినా అమర్‌కు దూరం అవుతున్నాను అనుకుంటూ కొబ్బరికాయ కింద పడేస్తుంది. ఇంతలో భూమి వచ్చి హలో కొబ్బరికాయ కొట్టాలి. అలా కింద పడేయకూడదు అంటుంది. ఈ అమ్మాయి శోభా, శరత్ చంద్ర వాళ్ల అమ్మాయిలా ఉంది. అపూర్వకు ఈ పిల్లకు అసలు పడదు కదా..? అని మనసులో అనుకుని వెళ్లిపోతుంది మనోహరి.

అసలు నీకు సెన్స్‌ ఉందా..? తెలియని వాళ్లతో గొడవ పడతావేంటి..? అంటాడు గగన్​. మీరేంటి నన్ను అంటారు. తప్పు చేసింది ఆవిడ అంటుంది భూమి. అయినా గుడిలో ఇంత మంది ఉన్నారు కదా..? నీకెందుకు కోపం వచ్చింది అంటాడు గగన్​. అందరూ సైలెంట్‌ గా ఉంటారేమో నేను ఉండను అంటుంది భూమి. నీకు చెప్తున్నాను కదా.. నాకు బుద్ది లేదు అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఇంతలో శారద, పూరి అక్కడకు వచ్చి వాళ్ల గొడవ ఆపి గుడిలోకి తీసుకెళ్తారు.

భూమిని చంపేయమన్న అపూర్వ

ఆరు కూడా గుడికి వస్తుంది. ఆరు వెనకాలే చెప్పకుండా గుప్త వస్తాడు. మరోవైపు గుడిలోపల భాగీని చూసిన భూమి వెళ్లి హగ్‌ చేసుకుంటుంది. నీ పెళ్లికి పిలవలేదని అలుగుతుంది భూమి. తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. భాగీ పిల్లలను నా పిల్లలు అని పరిచయం చేయగానే అది విన్న ఆరు ఎమోషనల్‌ అవుతుంది.

అందరూ హ్యాపీగా ఉంటే మనోహరి పక్కకు వెళ్లి అపూర్వకు ఫోన్ చేస్తుంది. ఏంటి నేస్తమా చాలా రోజులకు గుర్తొచ్చినట్టు ఉన్నాను. ఎక్కడున్నావు. ఎలా ఉన్నావు అంటుంది అపూర్వ. అమర్‌ ను పెళ్లి చేసుకోలేదు కదా అస్సలు బాగాలేను. నువ్వు కూడా బాగా లేవని ఇప్పుడే తెలిసింది. ఇందాక గుడికి వచ్చిన నీ శత్రువును చూస్తుంటే అర్థం అవుతుంది అంటుంది మనోహరి.

ఆ భూమి గుడికి వచ్చిందా? మనిద్దరం ఓడిపోతున్నాం మనోహరి అంటున్న అపూర్వతో నీ శత్రువు నా శత్రువు కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నారు అనగానే.. భూమిని చంపేయమని మనోహరికి చెప్తుంది అపూర్వ. నీకు అడ్డుగా ఉన్న ఆ భాగీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్తుంది. ఆ తల్లీకూతుళ్లు నా చేతిలోనే చావడానికి పుట్టినట్టున్నారు అని అంటుంది అపూర్వ.

శోభ ఆత్మను రప్పించిన ఆరు

ఆరును చూసిన భాగీ దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. తమ దగ్గరకు రమ్మని పిలుస్తుంది. దీపాలు వెలిగించాక వస్తానని చెప్తుంది ఆరు. సరేనని వెళ్లిపోతుంది ఆరు. తర్వాత ఆరు గుప్త దగ్గరకు వెళ్తుంది. నేను ఈరోజు ఎవరి శరీరంలోకి వెళ్లనని మాటిచ్చాక.. మీరు నాకొక మాట ఇచ్చారు కదా.. ఇప్పుడు అడగొచ్చా నేను అంటుంది ఆరు. ఆ మాట ఏంటో అడుగుము.. అది సాద్యమో అసాధ్యమో కాదో నేను చెప్పెదను అంటాడు గుప్త.

అసలు నా గురించి నేను ఏమీ కోరుకోను అనగానే ఏవో చిన్న చిన్న కోరికలు కోరుతుందమో.. అని మనసులో అనుకుని అడుగుము.. అంటాడు. భూమి వాళ్ల అమ్మను ఈరోజు భూలోకానికి రప్పించండి అంటుంది ఆరు. ఏమిటి స్వర్గంలో ఉన్న ఆ బాలిక తల్లిని భూలోకానికి తీసుకురావాలా..? వలదు బాలిక ఇది అసంభవం. సృష్టికి విరుద్దం. విధికి ఎదురు వెళ్లకూడదు అంటాడు గుప్త.

మాటిచ్చారు గుప్తగారు. దేవుని సన్నిధిలో ఉండి మీరిచ్చిన మాట తప్పుతారా..? అని ఆరు అడగ్గానే గుప్త సరేనని మంత్రం చదివి శోభాచంద్ర ఆత్మను కిందకు రప్పిస్తాడు. శోభాచంద్రను చూసిన ఆరు హ్యాపీగా చూస్తుంది. దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటుంది. దీంతో శోభాచంద్ర షాక్‌ అవుతుంది. ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించారు అని అడుగుతుంది.

నీ తీరని కోరిక నెరవేర్చేందుకు అని గుప్త చెప్పగానే అయితే నా కూతురిని చూపిస్తారా..? అని అడుగుతుంది. అవునని అక్కడ నీ కూతురు ఉందని ఎవరో కనుక్కోమని ఆరు చెప్తుంది. భూమిని చూసిన శోభాచంద్ర తనే నా కూతురు అంటూ ఎమోషనల్ అవుతుంది. మనోహరి భూమిని, భాగీని చంపడానికి బాబ్జీతో పెట్రోల్‌ తెప్పిస్తుంది. వాళ్లిద్దరిని ఇక్కడే చంపేస్తానని అంటుంది. మనోహరి ప్లాన్ ప్రకారం భూమి, భాగీ మంటల్లో చిక్కుకుంటారా? అమర్​, గగన్​ మనోహరి ప్లాన్​ని ఎలా తిప్పికొడతారు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్​ 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner