NNS 16th April Episode: ముహుర్తం మార్చేసిన మనోహరి.. పెళ్లికి రాలేమంటున్న పిల్లలు.. అరుంధతిని తీసుకెళ్లే ప్రయత్నంలో గుప్త
NNS 16th April Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 16) ఎపిసోడ్లో పెళ్లి త్వరగా కావాలనుకొని మనోహరి ముహుర్తం మార్చేస్తుంది. మరోవైపు అరుంధతిని తీసుకెళ్లడానికి చిత్రగుప్తుడు రెడీ అవుతాడు.
NNS 16th April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఏప్రిల్ 16) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి ఫొటో చూస్తూ బాధపడుతున్న అమర్‌తో మాట్లాడుతూ ఉంటాడు రాథోడ్. ఈ పెళ్లి తనకి ఇష్టంలేదని, అమ్మానాన్నకి చెప్పేస్తానంటాడు అమర్. అది విన్న నీల.. మనోహరి దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లి చెబుతుంది. మనోహరి వెంటనే అమర్ దగ్గరకి వచ్చి పెళ్లి ఆపేద్దామంటూ మొసలి కన్నీరు కారుస్తుంది.
దాంతో అమర్ పెళ్లికి రెడీ అయి బయలుదేరతాడు. చాలా ఆనందంగా మనోహరి, బాధలో అమరేంద్ర ఇద్దరూ వేర్వేరు కార్లలో పెళ్లికి వెళ్తుంటారు. అప్పుడు వెనుక నుండి ఫాలో అవుతున్న రౌడీ.. నిన్ను వెతుక్కుంటూ వస్తున్న అని చెప్పి తన చేతిలో ఉన్న మనోహరి ఫోటోని నలిపేసి రోడ్డు మీద పడేస్తాడు.
మంగళకు వార్నింగ్
ఇంట్లో భాగ్య , వాళ్ళ నాన్న కలిసి బాధపడుతూ ఉంటే అక్కడికి వచ్చిన మంగళ నానా మాటలు అంటుంది. కోపంతో భాగ్య వాళ్ళ నాన్న లేచి భార్యకి ఎదురు తిరుగుతాడు. అవును ఇవన్నీ తప్పే.. పని కోసం వెళ్తే పని చేసుకుని రావాలి గాని ఈ లొల్లంతా ఏందయ్యా అని అడుగుతుంది. మంగళ నీకేమీ తెలియదు అని భాగ్య వాళ్ళ తండ్రి అంటాడు. ఇప్పుడు కూతురికి ఉద్యోగం లేదు నెల రోజుల్లో మన బతుకులు రోడ్డు మీద పడిపోతాయని చెబుతుంది. దీంతో తానే ఉద్యోగానికి వెళతానంటాడు భాగీ తండ్రి.
పిన్ని మాటలకు భాగ్య ఆవేశంతో బాధతో నోరు విప్పుతుంది. కష్టాల్లో సాయం చేసిన వాళ్లు ఎటు పోతే నాకేంటిలే అని అనుకోవటం చాలా పెద్ద తప్పు అంటుంది. మన అనుకున్న వ్యక్తి సమస్యల్లో మనకి అండగా నిలబడ్డ వ్యక్తి కి జీవితమే సమస్య కాబోతోంది అని తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయులై ఉన్నాం కదా... అందుకు నాకు బాధగా ఉంది నాన్న అని ఏడుస్తూ అంటుంది.
నావల్లే ఏడ్చింది అని అనుకున్న మంగళ మెల్లిగా జారిపోబోతుంటే.. భాగీ వాళ్ళ నాన్న గట్టిగా కొట్టి పెళ్ళికి వెళ్లాలనుకుంటే అటు నుండి అటే వెళ్ళిపో మళ్లీ ఇటు రావద్దు.. గడప దాటి బయటికి అడుగు పెట్టావంటే చంపుతా అని గట్టిగా బెదిరిస్తాడు.
అరుంధతిని తీసుకెళ్లడానికి గుప్త రెడీ
ఒక మూర్ఖుని కోపం కంటే ఒక మంచి వాని మౌనం ప్రమాదకరమైన అని మా పితృ దేవుడు చెప్పితిరి అని.. ఈ బాలిక మౌనము అంత మంచిది కాదు.. ఆ మౌనం నుండి వచ్చే ఆలోచన కచ్చితంగా ప్రమాదమునకు దారి తీయని గ్రహించి చిత్రగుప్తుడు ఆ తప్పు జరగక ముందే బాలికను తీసుకొని వెళ్ళవలెనని నిశ్చయించుకుంటాడు. బాలిక బాలిక.. అని పిలుస్తున్న గుప్తాతో చెప్పండి గుప్త గారు అంటుంది అరుంధతి.
మనమిక బయలుదేరుదము అంటాడు చిత్రగుప్తుడు. పెళ్లయ్యే వరకు ఇక్కడే ఉందామన్నారు కదా గుప్తా గారు అంటుంది అరుంధతి. అంటిని కానీ చూస్తుంటే నాకు భయంగా ఉన్నది బాలిక.. అంటాడు గుప్త. మీలాంటి దేవుళ్ళు నాలాంటి మామూలు వాళ్ళని చూసి భయపడుతున్నారంటే నవ్వొస్తుంది గుప్తా గారు అంటుంది అరుంధతి.
తన పతి దేవుని ప్రాణము కొరకు సాక్షాత్తు యమధర్మరాజులు వారితో పోరాడిపోట్లాడి తన పతి ప్రాణములను సాధించుకున్న సావిత్రి కూడా మామూలు మనిషియే బాలిక.. మనిషి మనస్ఫూర్తిగా ఏదైనా చేయదలచినచో ఆపుట ఏ శక్తి తరము కాదని చాలా సందర్భములలో రుజువైనది.. అందున నీవు కన్నతల్లివి.. నీ బిడ్డల క్షేమం కోసం ఏమి చేయుటకైనను నీవు వెనకాడవు అంటాడు గుప్త.
ముహూర్తం మార్చేసిన మనోహరి
కల్యాణ మండపం దగ్గర మనోహరి చాలా సంతోషంగా కారు దిగితే.. అమరేంద్ర మాత్రం కారులోనే ఆలోచిస్తూ కూర్చుంటాడు. దీంతో మనోహరి వెళ్లి అమరేంద్రని దిగమని చెబుతుంది. అమరేంద్ర కిందకి దిగిన తర్వాత ఎదురుగా ఒక పెద్ద ఫ్లెక్సీ చూసి చాలా కోప్పడతాడు. ఆ ఫ్లెక్సీ లో చాలా పెద్ద తప్పు ఉంది. కానీ అది తప్పని తెలుసుకునేలోగా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది అని బాధపడుతూ ఉంటాడు.
పెళ్ళికొడుకు ఒక్కడే లోపలికి వెళుతుంటే పూజారి వచ్చి హారతి ఇచ్చి లోపలికి పంపిస్తాడు. మంగళ వాయిద్యాలతో పెళ్ళికొడుకుని పెళ్లికూతురుని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. పంతులు గారితో ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా ముహూర్తం ఫిక్స్ చేయమని చెబుతుంది. అరుంధతి ఇంట్లో చిన్న పిల్లలందరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు.
అక్కడికి అరుంధతి వస్తుంది. మనకి భజంత్రీలు వినిపించట్లేదంటే నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు కదా.. నాకు చాలా బాధగా ఉంది. అని మాట్లాడుకుంటుంటారు. పిల్లల మాటలకి చిత్రగుప్తుడు, అరుంధతి అందరూ బాధపడి ఏడుస్తూ ఉంటారు. తమని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు కదా అని దిగులుగా ఉంటారు పిల్లలు. తన పిల్లలకోసం అరుంధతి ఏం చేయబోతోంది? మనోహరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్