NNS 15th November Episode: ​​​అల్లుడిపై అలిగిన రామ్మూర్తి.. ఆరుని తీసుకెళ్లడానికి సిద్ధమైన యముడు.. మనోహరిలో టెన్షన్!-zee telugu serial nindu noorella saavasam today 15th november episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 15th November Episode: ​​​అల్లుడిపై అలిగిన రామ్మూర్తి.. ఆరుని తీసుకెళ్లడానికి సిద్ధమైన యముడు.. మనోహరిలో టెన్షన్!

NNS 15th November Episode: ​​​అల్లుడిపై అలిగిన రామ్మూర్తి.. ఆరుని తీసుకెళ్లడానికి సిద్ధమైన యముడు.. మనోహరిలో టెన్షన్!

Hari Prasad S HT Telugu
Nov 15, 2024 03:36 PM IST

NNS 15thNovember Episode: ​​​నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (నవంబర్ 15) ఎపిసోడ్లో ఆరుని తీసుకెళ్లడానికి యముడు సిద్ధపడతాడు. అటు భాగీని తీసుకు వెళ్లడానికి అమర్, పిల్లలు వెళ్లగా.. అల్లుడిపై రామ్మూర్తి అలుగుతాడు.

అల్లుడిపై అలిగిన రామ్మూర్తి.. ఆరుని తీసుకెళ్లడానికి సిద్ధమైన యముడు.. మనోహరిలో టెన్షన్!
అల్లుడిపై అలిగిన రామ్మూర్తి.. ఆరుని తీసుకెళ్లడానికి సిద్ధమైన యముడు.. మనోహరిలో టెన్షన్!

NNS 15th November Episode: ​​​జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు (నవంబర్ 15) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆరు గురించి ఆలోచిస్తూ యుముడు సీరియస్‌ గా చూస్తుంటే.. మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు గుప్త. నువ్వు నీ కర్తవ్యాన్ని సక్రమంగా చేసి ఉంటే నేను వచ్చే వాడినే కాదు అంటాడు యముడు.

అమావాస్యలోపే తీసుకెళ్లాలన్న యముడు

అనుమానంగా ఆ బాలికకు ఏదో ప్రమాదం వస్తుందేమోనని నాకు అనిపిస్తుంది అని గుప్త అనగానే.. అవునని ఘోర రూపంలో ప్రమాదం రానుందని చెప్తాడు యముడు. గుప్త భయపడతాడు. ఏన్నో ప్రాణాలు తీసిన మీరు ఈ ఒక్క ఆత్మ కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని గుప్త యముణ్ని అడగ్గానే అసలు విషయం చెప్తాడు. ఇక ఆలస్యం చేయకుండా ఆ బాలికను అమావాస్య గడియలు మొదలవగానే మన లోకానికి తీసుకువెళ్లాలి అంటాడు.

భాగీ ఇంట్లోకి రాథోడ్, పిల్లలు

భాగీ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అమర్‌ పిల్లలు వస్తారు. అంజు దిగవే దిగు.. అంటుంది అమ్ము. దిగను.. అంటుంది అంజు. ఇంటి ముందుకు వస్తే మిస్సమ్మ రాదు. ఇంట్లోకి వెళ్లి పిలిస్తే వస్తుంది అంటాడు రాథోడ్. అమర్​ కోపంగా చూడటంతో మిమ్మల్ని కాదు సార్‌.. పిల్లల్ని అంటాడు. రాథోడ్‌ వెళ్లి తీసుకుని రా… అంటాడు అమర్.

సార్‌ నేను విన్నదే మీరు అన్నారా..? తిట్టింది మీరు వెళ్లిపోమ్మంది పెద్ద సారు. మధ్యలో నేను వెళితే వస్తుందా..? అంటాడు రాథోడ్. పిల్లలను తీసుకుని వెళ్లు.. పిల్లలు రాథడ్‌ తో వెళ్లి మిస్సమ్మని తీసుకుని రండి అంటాడు అమర్. అందరూ కారు దిగుతారు కానీ అంజు దిగదు.. దాంతో అంజు పాప.. అందరూ అంటే తమరు కూడా అని అంటాడు రాథోడ్​.

నేను డాడీకి తోడుగా ఉంటాను అంటుంది అంజు. డాడీ చెప్పారు కదా..? అందరూ వెళ్లాలని రా వెళ్దాం అంటుంది అమ్ము. నాకు డాడీని వదిలి రావాలని లేదు. నేను డాడీతోనే ఉంటాను. అయినా ఏంటి అందరూ వెళ్తే కానీ ఆ మిస్సమ్మ రాదా..? అంటుంది అంజు. అయినా వాళ్లు అపార్థం చేసుకున్నవాళ్లు రాకపోతే రాదని నీకు అర్థం అయిందా? అంటాడు రాథోడ్​. అంజు నువ్వు కూడా వెళ్లి తీసుకురా వెళ్లు..అని అమర్​ చెప్పగానే పిల్లలు, రాథోడ్‌ రామ్మూర్తి ఇంట్లోకి వెళ్తారు.

రామ్మూర్తి నాటకం

భాగీ పిల్లల కోసమే ఎదురుచూస్తుంది. రామ్మూర్తి బయటకు వెళ్లబోతుంటే.. పిల్లలు, రాథోడ్‌ రావడం చూసి లోపలికి వెళ్లి భాగీకి చెప్తాడు. పిల్లలు రాథోడ్‌ మాత్రమే లోపలికి వస్తున్నారు. కానీ బాబు గారు లోపలికి రావడం లేదని చెప్తాడు. భాగీ బాధపడుతుంది. బాబు లోపలికి వచ్చేలా నేను చేస్తాను. నువ్వు కొంచెం కో ఆపరేట్‌ చేయ్‌ అని చెప్పి గుమ్మం దగ్గరకు వెళ్తాడు రామ్మూర్తి.

ఏమయ్యా రాథోడ్‌ నేను లేనప్పుడే వస్తావనుకున్నాను. నేను ఉన్నప్పుడు కూడా వచ్చావే..? అంటాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు సార్‌ అంటున్న రాథోడ్​తో నేను లేనప్పుడు నా కూతురుని ఇంట్లో వదిలేసి వెళ్లావు కదయ్యా..? సరేలే ఎందుకు వచ్చావో చెప్పు. నా కూతురు ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చావా..? లేక ఆ ఇంట్లో వాళ్లు ఈ ఇంట్లో నా కూతురు ఎలా ఉందో చూడమని పంపించారా..? అంటాడు రామ్మూర్తి. సార్‌ అది మిస్సమ్మ.. అనగానే ఉంది ఇంట్లోనే ఉంది అంటాడు.

అమర్ వస్తేనే పంపిస్తానన్న రామ్మూర్తి

మిస్సమ్మ.. నేను ఒక్కడినే కాదు. పిల్లలు కూడా వచ్చారు అని పిలుస్తాడు రాథోడ్​. భాగీ లోపలి నుంచి బయటకు పరుగెత్తుకొస్తుంది. పిల్లలను హగ్‌ చేసుకోబోతుంటే.. రామ్మూర్తి ఆపుతాడు. ఇంతలో రాథోడ్‌ మీ నాన్న పెద్దరాయుడిలో రజనీకాంత్ లా ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడు ఆపమని చెప్పు అంటాడు. ఇంతలో పిల్లలు ఎమోషనల్ గా మాట్లాడతారు. భాగీ కూడా ఎమోషనల్ అవుతుంది.

మేము వచ్చాము కదా తాతయ్య మిస్సమ్మని మాతో పంపించండి అంటారు పిల్లలు. అవును తాతయ్యా మిస్సమ్మ లేకుండా ఇల్లంతా చాలా బోర్‌ కొడుతుంది అంటాడు ఆనంద్. నా కూతురు మీద మీకున్న ప్రేమకు నేను తృప్తిగా ఉన్నా మనసుకు అయిన గాయం మాననంటుంది అమ్మా అంటాడు రామ్మూర్తి. నాన్నా నేను చెప్పేది వినండి నాన్నా..పిల్లలు అని భాగీ అంటున్నా వినకుండా పిల్లల మీద నీకున్న ప్రేమ నిన్ను ఆ ఇంటికి వెళ్లమంటుందని నాకు తెలుసమ్మా..?

కానీ బాబు గారే వచ్చి స్వయంగా అడిగితే తప్పా నిన్ను ఆ ఇంటికి పంపలేను అమ్మా..? అంటాడు. ఆగండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. మిస్సమ్మ, తాతయ్య ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. పదండి మనం వెళ్దాం అని కోపంగా అంటుంది అంజు. అంజు పాప ఆవేశపడకు. నేను వెళ్లి సార్​కు విషయం చెప్తాను. సార్‌ ఏం అంటారో విందాం అని రాథోడ్‌ అమర్‌ దగ్గరకు వెళ్తాడు.

మంగళకు మనోహరి ఫోన్

మనోహరి కుంటుతూ బాధపడుతుంది. భాగీ మళ్లీ ఈ ఇంటికి వస్తే ఇంతవరకు నేను పడ్డ కష్టం అంతా వృథా అవుతుందని అనుకుని అక్కడ ఏం జరుగుతుందో మంగళకు ఫోన్‌ చేసి తెలుసుకుందామనుకుని ఫోన్‌ చేస్తుంది. మంగళ ఫోన్‌ లిఫ్ట్ చేయదు. మరోవైపు రాథోడ్‌, అమర్‌ దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన విషయం చెప్తాడు.

మీరు ఒక్కసారి లోపలికి రండి మీరు పిలిస్తే కానీ ఆయన మిస్సమ్మను ఇంటికి పంపించను అంటున్నాడు సార్‌ అని రాథోడ్‌ చెప్పగానే అమర్ అయితే వెళ్దాం పద అంటాడు. అమర్​ పిలవగానే భాగీ వస్తుందా? మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్​ 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner