NNS 15th February Episode: అమర్‌ను ఆటపట్టించి కౌగిలించుకున్న భాగీ.. అమర్ ఇంటికే అనామిక వస్తుందా?
NNS 15th February Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (ఫిబ్రవరి 15) ఎపిసోడ్లో అమర్ ను ఆటపట్టించి కౌగిలించుకుంటుంది భాగీ. మరోవైపు హైదరాబాద్ వచ్చిన అనామిక.. అమర్ ఇంటికే వస్తుందా అనేలా ఈ ఎపిసోడ్ సాగింది.

NNS 15th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం శనివారం (ఫిబ్రవరి 15) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి పెళ్లి విషయం ఎత్తిన భాగీ ఆమెను అమర్ ముందు అడ్డంగా బుక్ చేస్తుంది. మనోహరి పెళ్లి మాట ఎత్తగానే కాళీ సిగ్గుపడటం చూసి భాగీ, పిల్లలు ఆశ్చర్యపోతారు.
అందరూ కలిసి తనను ఇలా బుక్ చేసారేంటని మనోహరి మనసులో అనుకుంటుంది. అదే సమయంలో పక్కనే ఉన్న రాథోడ్.. కాళీ, మనోహరి గారి పెళ్లి ఒకేసారి జరుగుతుందేమో అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అటు ఇంటి నుంచి వెళ్లిపోయిన కాళీని వెంబడించి అతనికి మనోహరి వార్నింగ్ ఇస్తుంది.
రణ్‌వీర్ ను చంపమంటే నా పెళ్లి గురించి తీస్తావేంటని నిలదీస్తుంది. రణ్‌వీర్ ను చంపడానికి ఈ రోజు రాత్రే ముహూర్తం పెట్టానని కాళీ ఆమెతో చెబుతాడు. అతన్ని చంపడం అంత సులువు కాదని, పని ముగించుకొని రా అని అతన్ని పంపిస్తుంది.
అన్నయ్య ఇంటికి అనామిక
అటు అనామిక హైదరాబాద్ లోని తన అన్నయ్య ఇంటికి వస్తుంది. ఆమెను చూసిన ఆమె వదిన ముందుగా బాగున్నట్లుగా నటించి.. లోనికి వెళ్లి కస్సుబుస్సులాడుతుంది. అనామిక తమ ఇంట్లో ఉండటానికి వీల్లేదని తన భర్తతో కచ్చితంగా చెబుతుంది. తన వదినకు తానంటే నచ్చనని తెలియడంతో రెండు రోజుల్లో ఉద్యోగం చూసుకొని హాస్టల్ కు వెళ్లిపోతానని చెబుతుంది. అప్పటి నుంచి ఆమె ఉద్యోగం వేటలో పడుతుంది.
పిల్లల కోసం కేర్ టేకర్‌ను తీసుకొస్తానన్న అమర్
అటు పిల్లలు, ఇంటి కోసం భాగీ ఎంతగా కష్టపడుతుందో తలచుకుంటూ అమర్ బాధపడుతుంటాడు. అప్పుడే తన దగ్గరికి వచ్చి వెళ్తున్న భాగీని చేయి పట్టుకొని ఆపి కూర్చోబెడతాడు. ఇంటికోసం ఎంతో శ్రమిస్తున్నావని, అందుకే పిల్లల కోసం కేర్ టేకర్ ను తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. కానీ తాను ఉండగా అంత ప్రేమగా చూసుకునే కేర్ టేకర్ ఎక్కడ దొరుకుతుందని భాగీ అంటుంది.
దీనికోసమే పేపర్ యాడ్ ఇస్తానని అమర్ అంటాడు. ఈ కాలంలో పేపర్ ఎవరు చూస్తారని అనడంతో మరోవైపు ఉద్యోగం కోసం పేపర్లో ప్రకటనలు చూస్తున్న అనామికను చూపిస్తారు. దీంతో అమర్ ఇంటికి కేర్ టేకర్ గా అనామికే వస్తుందా అన్న అనుమానం కలుగుతుంది.
అమర్‌ను కౌగిలించుకున్న భాగీ
ఇదే సమయంలో అమర్ ను ఆటపట్టిస్తుంది భాగీ. తనను భార్య అని అనకుండా ఎందుకు ఆగిపోయారు.. అనండి అంటూ చిలిపిగా అడుగుతుంది. ఏవండీ అంటూ ఏదో చెప్పబోయి సిగ్గుపడుతూ ఆగిపోతుంది. తన మనసులో ఉన్నది చెప్పకుండా అమర్ లో సరసాలాడుతుంది.
అమర్ కోపగించుకుంటున్నా వినకుండా చిలిపిగా మాట్లాడుతూనే ఉంటుంది. తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నా బయటపడని అమర్ ను ప్రేమగా కౌగిలించుకుంటుంది. మరి అమర్ ఇంటికి అనామికే కేర్ టేకర్ గా వస్తుందా? తర్వాత ఏం జరగబోతోంది? శనివారం (ఫిబ్రవరి 15) ఎపిసోడ్లో చూడండి.
సంబంధిత కథనం
టాపిక్