NNS 14th February Episode: రొమాంటిక్ మూడ్‌లో అమర్, భాగీ.. గతం మరచిపోయిన అరుంధతి.. అమర్ ఇంటికి వెళ్లి అబద్ధం చెప్పిన కాళీ
NNS 14th February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 14) ఎపిసోడ్ కూడా ట్విస్టులతో నిండిపోయింది. అరుంధతి గతం మరచిపోగా.. అమర్ ఇంటికి వెళ్లి మరీ అబద్ధం చెబుతాడు కాళీ. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
NNS 14th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి.. రణ్‌వీర్ నే కలవడానికి వెళ్లినట్లు భాగీ అనుమానం వ్యక్తం చేస్తుంది. నిజం తెలిసినట్లు మాట్లాడటంతో మనోహరి భయపడుతూ తడబడుతూ బుకాయిస్తుంది. ఏదో ఊరికే అలా అన్నానని అలా అనడంతో మనోహరి ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
గతం మరచిపోయిన అరుంధతి
చనిపోబోతున్న అనామిక అనే అమ్మాయి శరీరంలోకి అరుంధతి ఆత్మను ప్రవేశ పెట్టిన చిత్రగుప్తుడు తాను ఎంత పెద్ద తప్పిదం చేశానో తెలుసుకుంటాడు. యమపురికి వెళ్లి అసలు తప్పిదం ఎలా జరిగిందో చూస్తాడు. పరకాయ ప్రవేశ సమయంలో శరీరం పూర్తిగా ఊపిరి పీల్చుకోవడం ఆగకపోతే ఆ ఆత్మ గతం మరిచిపోతుందని తెలుసుకుంటాడు.
తిరిగి భూలోకంలోకి వచ్చి అనామికలో తాను తెచ్చిన ఆత్మ ఉందని, తిరిగి ఇవ్వాలని అంటాడు. కానీ అనామికకు చిత్రగుప్తుడు కనిపించడు, వినిపించడు. కోపంలో గతాన్ని తగలబెట్టేసి తాను హైదరాబాద్ వెళ్తున్నట్లు ఓ వ్యక్తికి ఫోన్ చేసి చెబుతుంది. ఆమె కూడా హైదరాబాద్ కే వెళ్తుండటంతో ఏం జరుగుతుందో అని చిత్రగుప్తుడు ఆందోళన చెందుతాడు.
రొమాంటిక్ మూడ్‌లో అమర్, భాగీ
మరోవైపు అమర్, భాగీ రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ఈరోజు మా ఆయన ఎంత అందంగా ఉన్నాడు అని భాగీ అనుకుంటుంది. అటు అమర్ కూడా ఆమెను చూసి నవ్వుతాడు. తీరా అది కల అని మిస్సమ్మ తెలుసుకుంటుంది. ఉలిక్కి పడి లేచి చూసి సిగ్గుపడుతుంది.
అమర్ ఇంటికి కాళీ
అటు అమర్ ఇంటికి వెళ్లి భాగీ చేతి వంట తినడంతోపాటు మనోహరిని చూసి వస్తానని మంగళతో అంటాడు కాళీ. ఆమెతో పెట్టుకోవద్దని అంటున్నా వినకుండా అమర్ ఇంటికి వెళ్తాడు. అతడు రావడం చూసి రాథోడ్ గేటు దగ్గరే అడ్డుపడతాడు. అయినా వినకుండా లోనికి వస్తాడు. అతన్ని చూసి మనోహరి షాక్ తింటుంది. జైలు నుంచి ఎప్పుడొచ్చావు మామయ్యా అంటూ కాళీని భాగీ పలకరిస్తుంది.
తాను అమర్ ను కలిసి వెళ్లాలని వచ్చినట్లు చెబుతాడు. అప్పుడే అమర్ వస్తాడు. సరస్వతి మేడమ్ ను చంపాలని చూసిన నీతో మాట్లాడను వెళ్లిపో అని అమర్ అంటాడు. అయినా అతడు వినకుండా తాను అలా ఎందుకు చేశానో నిజం చెబుతానని అంటాడు.
అబద్ధం చెప్పిన కాళీ
అది విని మనోహరి వణికిపోతుంది. నువ్వేంటి నిజం చెప్పేంది.. నీతో మాట్లాడరు.. బయటకు వెళ్లు అని మనోహరి అంటుంది. కానీ ఆమెకు అడ్డుపడిన అమర్.. ఆ నిజమేంటో చెప్పు అని అడుగుతాడు. జైల్లో మనోహరే తనతో అలా చేయించిందని భాగీకి చెప్పిన కాళీ.. ఈసారి మాత్రం అబద్ధం చెబుతాడు. లారీ బ్రేక్ కావడం వల్లే అలా జరిగిపోయిందని, కావాలని చేయలేదని అంటాడు.
చేసిన తప్పుకు క్షమాపణ అడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే వచ్చానని అంటాడు. దీంతో అమర్ ఇలాంటి తప్పు మరెప్పుడూ చేయకంటూ వార్నింగ్ ఇస్తాడు. తనకు కాస్త అన్నం పెట్టించాలని కాళీ అడుగుతాడు. సరే అంటూ మిస్సమ్మను అతనికి భోజనం పెట్టించమని చెబుతాడు అమర్.
మనోహరిని ఇంటికి దూరం చేస్తానన్న కాళీ
భోజనం చేస్తున్న సమయంలో అబద్ధం ఎందుకు చెప్పావని కాళీని నిలదీస్తుంది భాగీ. అయితే తాను మరో ప్లాన్ వేశానని, మనోహరిని ఈ ఇంటికి దూరం చేస్తానని అంటాడు. మనోహరి వానపాము కాదు తాచుపాము.. ఆమెతో పెట్టుకోవద్దని రాథోడ్, భాగీ వారిస్తున్నా.. ఆమె సంగతి ఎలా చూడాలో తనకు తెలుసని చెబుతాడు.
భోజనం తర్వాత అమర్ కుటుంబ సభ్యులతో వెళ్లొస్తానని చెప్పడానికి వెళ్తాడు. ఈ సమయంలోనే కాళీకి పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని రాథోడ్ అంటాడు. తాను అప్పటికే అమ్మాయిని కూడా చూసుకున్నానని అనడంతో మనోహరి మరింత భయపడుతుంది. అతడు తననే చూస్తుండటంతో దొరికిపోతానని వణికిపోతుంది.
ఇంతలో సరస్వతి మేడమ్ ఎక్కడుందో చెప్పాలని, తాను క్షమాపణ చెప్పాలనుకుంటున్నట్లు అమర్ ను కాళీ అడుగుతాడు. అదే సమయంలో మనోహరిని మరింత ఇరికిస్తుంది భాగీ. ఇంతకీ మనోహరిని భాగీ ఎలా ఇరికించింది? కాళీ తన పెళ్లి మనోహరితోనే అని చెప్పేస్తాడా అన్నది శుక్రవారం ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో చూడండి.
సంబంధిత కథనం
టాపిక్