NNS 13th November Episode: ఆరుని తీసుకెళ్లేందుకు వచ్చిన యముడు.. కాకా పట్టిన ఆరు.. భాగీకోసం వెళ్లిన అమర్!
NNS 13thNovember Episode: నిండు నూరేళ్లే సావాసం బుధవారం (నవంబర్ 13) ఎపిసోడ్లో అరుంధతిని తీసుకెళ్లడానికి వస్తాడు యముడు. అయితే అతని రాకతో అమర్ మనసు మారి భాగీని తీసుకెళ్లడానికి వెళ్తున్నాడని సంబరపడుతుంది ఆరు ఆత్మ. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
NNS 13th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 13) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్‌తో కాళ్లు పట్టించుకోవాలనుకున్న మనోహరి ప్లాన్‌ని తిప్పి కొడుతుంది ఆరు. మనోహరి కావాలనే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుందంటూ కోపంగా గార్డెన్లో అటూ ఇటూ తిరిగుతూ.. మనోహరిని తిడుతుంది.
భాగీని తీసుకురావడానికి అమర్ వెళ్లే సమయంలో ఏదో ఒకటి చేసింది.. అయినా తప్పు మీదో నాదో కాదండి. పైన ఉన్న ఆ రాజు గారిది అంటూ యముణ్ని తిడుతుంది. గుప్త అడ్డుపడతాడు. ఎందుకు ప్రభువును పిలుస్తున్నావు అంటాడు. మీరు ఉండండి గుప్త గారు అంటూ యముణ్ని పిలుస్తుంది. ఇంతలో ఉరుములు మెరుపులతో యమ ధర్మరాజు వస్తాడు. చిత్ర విచిత్ర గుప్త.. అని పిలవగానే ప్రభువులకు ప్రణామములు.. అంటాడు గుప్త.
ఆరుని తీసుకెళ్లడానికి వచ్చిన యుముడు
ఆ ఎస్కేప్.. అయ్యో నోరు ఆగదే నీకు నేను పిలవగానే ఆయన అత్తారింటికి వచ్చినట్టు వచ్చేశాడు. నేను అన్న మాటలకు ఇప్పుడు నన్ను ఆయన పైకి తీసుకెళ్లరు కదా.? ఎక్కడున్నారు ఆయన రాలేదా ఏంటి..? నేనే ఊహించుకున్నానా ఏంటి..? రాజు గారు బాగున్నారా..? చూడనే లేదే ఆరోగ్యం అంతా బాగుందా..? ఇంట్లో అందరూ బాగున్నారా..? విన్నారా..? అంటుంది ఆరు. సాంతమూ.. విన్నారు అంటాడు గుప్త. ఏంటి నన్ను అలా చూస్తున్నారేంటి..? ఎవరైనా ఏదైనా మాట్లాడండి అంటుంది ఆరు. అరచి పిలిచినది నువ్వే కదా..? నువ్వే మాట్లాడు అంటాడు గుప్త. నేనేదో సరదాగా పిలిచాను అలా పిక్నిక్ వచ్చినట్టు వచ్చేస్తే ఎలా..? అంటుంది ఆరు.
ప్రభు ఆ బాలిక ఏదో మాట వరసకు పిలిచింది. ఒకవేళ మీరు అందులకే వచ్చితిరా.. అని గుప్త అడగ్గానే అందుకోసం నేను రాలేదు. నీ కర్తవ్యం నేను పూర్తి చేయడానికి వచ్చాను అని యముడు చెప్తాడు. దీంతో ఆరు జోక్ చేస్తున్నారు కదా..? నాకు సమ్మతం లేకుండా మీరు నన్ను పైకి తీసుకెళ్లలేరు అని నాకు గుప్తగారు చెప్పారు అనగానే అది గుప్తకు.. నాకు లేదు. అంటూ పైకి రమ్మని అడుగుతాడు. ఆరు ఎమోషనల్ అవుతుంది. యమధర్మరాజును పొగడ్తలతో ముంచెత్తగానే ఆరు మాటలకు కరిగిపోయిన యముడు ఆరు చెప్పినట్లే వింటాడు.
పిల్లలతో కలిసి భాగీ ఇంటికి అమర్
అమర్ బయటకు వస్తాడు. అప్పుడే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. తాను బయటకు వెళ్లాలి అంటాడు అమర్. వెళ్లండి డాడ్ దానికి మాకెందుకు చెప్తున్నారు అంటుంది అంజు. మీరు నాతో రావాలి. ఒక ఇంటికి వెళ్తున్నాం అంటాడు అమర్. నో అమర్ ప్లీజ్.. దాన్ని చాలా కష్టపడి ఇంట్లోంచి పంపిచాను అని మనసులో అనుకుంటుంది మనోహరి. అది మిస్సమ్మ వాళ్ల ఇంటికి.. నాన్నమ్మ తాతయ్య బాగా బాధపడుతున్నారు. మిస్సమ్మ తప్పు చేసిందని నేను అరిచాను అంటాడు అమర్.
మిస్సమ్మ మీ భార్య సార్. మిస్సమ్మను తీసుకురావడానికి కారణాలు అవసరం లేదు అంటాడు రాథోడ్. అమ్ము హ్యాపీగా ఫీలవుతుంది. అంజు, ఆనంద్, ఆకాష్ మాత్రం వద్దని మా పనులు మేము చేసుకుంటామని అంటారు. అమ్ము మాత్రం మీరు చెప్పింది కరెక్టు డాడ్.. మిస్సమ్మను తీసుకొద్దాం అంటుంది. పిల్లలను కూడా ఒప్పిస్తుంది. ఫ్రెష్ అయి వద్దామని లోపలికి వెళ్తారు. పైనుంచి అంతా గమనిస్తున్న మనోహరి.. ఇరిటేట్ అవుతుంది.
అమ్ముతో వాదించిన అంజు, ఆకాశ్
ఆరు మాత్రం హ్యాపీగా ఫీలవుతూ డాన్స్ చేస్తుంది. యముడిని చూసి మీరు వచ్చారు.. మా ఆయన మనసు మారిపోయింది. మీ దగ్గర చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని యముణ్ని మళ్లీ పొగడ్తలతో ముంచెత్తుతుంది. రూంలోకి వెళ్లిన పిల్లలు మీటింగ్ పెట్టుకుంటారు. అమ్ము మనమంతా ఒకే మాట మీద ఉందమనుకున్నాం కదా..? అంటుంది అంజు. అవును అక్కా మనం మిస్సమ్మను తీసుకురావడానిక వెళ్లడం ఏంటి..? అంటాడు ఆనంద్. అమ్మ ఫోటోను తొక్కింది. అమ్మ చీరను పాడు చేసింది అలాంటి మనిషితో మనకు పనేంటి..? అంటాడు ఆకాష్.
ఎందుకు తీసుకురాకూడదు. మిస్సమ్మ అమ్మ ఫోటో తొక్కడం మనం చూశామా..? చీరను మిస్సమ్మ పాడు చేసిందని మనకు తెలుసా…? అంటుంది అమ్ము. అమ్మ చీర కర్టెనుగా కుట్టింది అని తనే చెప్పింది కదా.. అమ్ము అని అడుగుతుంది అంజు. అది మిస్టేక్ అయ్యుండొచ్చు కదా అంజు. నువ్వు మిస్టేక్ చేస్తావు. నేను మిస్టేక్ చేస్తాను. కానీ మిస్సమ్మ మిస్టేక్ చేయకూడదా..? అంటూ అమ్మూ మిస్సమ్మ గురించి చెప్తుంది.
పిల్లలను కన్వీన్స్ చేస్తుంది. నేను వెళ్తున్నాను.. మీకు రావాలని ఉంటే రండి లేకుంటే మీ ఇష్టం అని అమ్ము కిందకు వెళ్లిపోతుంది. పిల్లలు భాగీని తీసుకురావడానికి ఒప్పుకుంటారా? అమర్‌ని ఆపడానికి మనోహరి ఏం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్ 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్