NNS 13th March Episode: హంతకుడిని కలవాలంటున్న అంజు.. అరుంధతి ఫొటో చూసి షాకయిన రామ్మూర్తి​​​!-zee telugu serial nindu noorella saavasam today 13th march episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee Telugu Serial Nindu Noorella Saavasam Today 13th March Episode

NNS 13th March Episode: హంతకుడిని కలవాలంటున్న అంజు.. అరుంధతి ఫొటో చూసి షాకయిన రామ్మూర్తి​​​!

Hari Prasad S HT Telugu
Mar 13, 2024 01:43 PM IST

NNS 13th March Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (మార్చి 13) ఎపిసోడ్లో అరుంధతి హంతకుడిని చూడాలని అంజలి పట్టుబడుతుంది. మరోవైపు అరుంధతి ఫొటో చూసి రామ్మూర్తి షాకవుతాడు.

హంతకుడిని కలవాలంటున్న అంజు.. అరుంధతి ఫొటో చూసి షాకయిన రామ్మూర్తి​​​!
హంతకుడిని కలవాలంటున్న అంజు.. అరుంధతి ఫొటో చూసి షాకయిన రామ్మూర్తి​​​!

NNS 13th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (మార్చి 13) 182వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతిని చంపిన హంతకుడిని పోలీసులకి అప్పగించి బాధతో ఇంటికి చేరుకుంటాడు అమర్. ఇంట్లోకి రాగానే ఎదురుగా ఉన్న మిస్సమ్మను చూసి థ్యాంక్స్​ చెబుతాడు. నాకు థాంక్స్ ఎందుకు చెప్తున్నారండి అని అడుగుతుంది భాగమతి. మిస్సమ్మకు ఈయన ఎందుకు థాంక్స్ చెప్తున్నాడు అని అనుకుంటుంది అరుంధతి. నాకేమీ అర్థం కావట్లేదు అండి అంటుంది భాగమతి.

నా భార్య చావు దగ్గర ఆగిపోయిన మా ఆనందం మళ్లీ నీ వల్లే వచ్చింది మిస్సమ్మ నా పిల్లల గెలుపు నీవల్లే వచ్చింది మా అమ్మానాన్నల కళ్ళల్లో ఆనందం కనిపించింది నువ్వు వచ్చాకే నా భార్యది యాక్సిడెంట్ కాదు ప్లాన్ చేసి చంపేశారు అని తెలిసింది. ఇప్పుడు నువ్వు వచ్చాకే మళ్లీ ఆరుని చంపిన వాడు నాకు దొరికాడు అంటాడు అమర్​. ఆ డ్రైవర్ దొరికాడు అనగానే మనోహరి గుండె ముక్కలైపోతుంది. అమర్ కోడల్ని చంపిన ఆ డ్రైవర్ దొరికాడా నువ్వు చెప్పేది నిజమా అంటాడు శివరామ్. అవును నాన్న వాడిని పట్టుకుని నా ఆరుని ఎందుకు చంపావని నిలదీశాను అని అంటాడు అమర్​.

మనోహరికి చెమటలు

అతను నిజం చెప్పాడా అమర్ అని మనోహరి కంగారు పడుతూ అడుగుతుంది. అతని పట్టుకుని ఎందుకిలాంటి పని చేసావ్ ని అడుగుతాను అంటుంది. తనలో కంగారు చూసిన భాగమతి రాథోడ్ కి సైగ చేస్తుంది. పోలీస్ స్టేషన్లో అప్పగించాను మనోహరి.. ఇదంతా ఎవరు జరిపించారో తెలుసుకుంటాను.. తెలుసుకున్న తర్వాత వాళ్ళని చంపేస్తాను అంటాడు అమర్​.

ఆ మాట విన్న మనోహరి భయపడుతూ ఒళ్లంతా చెమటలు పడతాయి. మనోహరి గారు ఎందుకు అంత కంగారు పడుతున్నారు మీ ఒళ్లంతా ఎందుకు చెమటలు పట్టాయి.. ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అంటుంది భాగమతి. నాకెందుకు కంగారు ఏమీ లేదు అంటుంది మనోహరి. పాపం చేసిన వాళ్ళు ఎన్నాళ్ళు తప్పించుకుంటారు మనోహరి గారు.. ఇవ్వాళ కాకపోతే రేపైనా కళ్ళ ముందుకు వస్తారు అప్పుడు వాళ్ళ సంగతి ఉంటుంది అంటుంది భాగమతి.

సారీ అండి మిమ్మల్ని రమ్మని మాట్లాడలేకపోయాను అంటాడు అమర్​. పర్వాలేదులే బాబు ఏంటో చెప్పు అంటాడు రామ్మూర్తి. డిన్నర్ అయ్యాక మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతాడు అమర్​. అమర్ కి నిజం తెలియకూడదు ఒకపక్క అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అనుకునే సమయానికి వాడు దొరికాడు. ఇప్పుడు వాడు కనక నోరు తెరిస్తే నా మెడలో తాళిపడమేమో కానీ ఉరితాడు పడుతుంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది.

సీఐకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన మనోహరి

ఆ డ్రైవర్ ని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో వేస్తారు పోలీసులు. రేయ్ నీ మీ ఊరు ఏంట్రా ఎక్కడ నుంచి వచ్చావ్ మిల్ట్రీ వాడికి నీకు సంబంధం ఏంటి అని సీఐ అడుగుతాడు. మాది కొడైకెనాలండి హైదరాబాదులో లోన్ తీసుకుందామని వచ్చాను అని ఆ డ్రైవర్ చెబుతాడు. వాడి భార్యని ఎందుకురా చంపేశావ్ వాడు చెప్పింది నిజమేనా నీ చేత ఎలా నిజం కక్కించాలో నాకు తెలుసు రా నీ సంగతి తర్వాత చెప్తాను రా అని సీఐ కూర్చుంటాడు. ఇంతలో సీఐ అకౌంట్ లోకి ఐదు లక్షలు మనోహరీ ట్రాన్స్ఫర్ చేస్తుంది.

నాకు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అని సిఐ చూసుకొని మనోహరి కి ఫోన్ చేస్తాడు. సిఐ గారు మీ అకౌంట్ లోకి ఐదు లక్షలు వచ్చాయా అని మనోహరి అడుగుతుంది. ఏదో పొరపాటున వచ్చినట్టు ఉన్నాయండి మీ డబ్బులు మీకు కొట్టేస్తాను అని సిఐ అంటాడు.ఆ ఐదు లక్షలు మీకేనండి మీరు ఇప్పుడు తీసుకువచ్చిన డ్రైవర్ని వదిలేయాలి అని మనోహరి చెబుతుంది. అతన్ని ఎందుకు వదిలేయాలి అని సీఐ అంటాడు.

మీకు డబ్బులు కావాలా ఆన్సర్ కావాలా అని మనోహరి అడుగుతుంది. వాడు చేసిన అవమానానికి ఈ డ్రైవర్ నేనే వదిలేద్దాం అనుకున్నాను కానీ మీరే ఈలోగా ఫోన్ చేశారు వాడు కంప్లైంట్ రాసిచ్చాడు కాబట్టి ప్రాబ్లం అవుతుంది.. ఒక రోజు టైం ఇవ్వండి వాడిని నేనే పంపించేస్తాను అని సీఐ అంటాడు. థాంక్యూ సిఐ గారు అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది.

ఆరు హంతకుడిని చూస్తానన్న అంజలి

అమర్​ అరుంధతి ఫోటో పట్టుకొని సారీ ఆరు పక్కనే ఉండి నేను కాపాడుకోలేకపోయాను దేశాన్ని కాపాడే నేను నిన్ను రక్షించుకోలేకపోయాను నన్ను క్షమించు అని బాధపడతాడు. అయ్యో దీంట్లో మీరు చేసింది ఏముందండి నా తలరాతలో ఇంతవరకే రాసిపెట్టి ఉందేమో మీరు మాత్రం ఏం చేస్తారు మీరు అలా బాధపడకండి అని అరుంధతి బాధపడుతుంది.

అమరేంద్ర అరుంధతి ఫోటో హగ్ చేసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తనని కౌగిలించుకొని ఓదార్చాలనుకున్న అరుంధతి ముట్టుకోలేక పోతుంది. ఇంతలో పిల్లలు వచ్చి డాడీ అని అంటారు. కళ్ళ నీళ్లు తూడ్చుకున్న అమరేంద్ర మీ అమ్మని చంపిన వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాను అని చెబుతాడు. డాడీ అమ్మ ఫోటో ఒకసారి ఇస్తారా అని అంజలి అడుగుతుంది.

అమరేంద్ర అరుంధతి ఫోటోని ఇస్తాడు. ఫోటో తీసుకున్న అంజలి గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది. మిగతా ముగ్గురు కూడా అంజలిని పట్టుకొని బాధపడతారు. అమ్మ నువ్వు ఏమీ బాధపడకు మిస్సమ్మ మమ్మల్ని బాగానే చూసుకుంటుంది నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండమ్మా అంటుంది అంజలి. అమ్మ చుట్టూఎంతమంది ఉన్నా నువ్వు లేని లోటు తెలుస్తుంది అంటుంది అమృత.

డాడీ స్టేషన్ కి వెళ్లి అమ్మని చంపిన డ్రైవర్ని ఒక్కసారి చూడొచ్చా అని అంజలి అడుగుతుంది. ఎందుకు అంజలి అని అమరేంద్ర అంటాడు. ప్లీజ్ డాడీ ఒక్కసారి చూడొచ్చా అని అంజలి అంటుంది. అలాగే అని అమరేంద్ర అంటాడు.

అరుంధతి ఫొటో చూసిన రామ్మూర్తి

కట్ చేస్తే, ఏంటి సార్ ఇక్కడే నిలబడ్డారు సార్ ని కలుస్తానన్నారు.. వెళ్ళండి అని రాథోడ్ అంటాడు. అంటే ఆయన గదిలోకి వెళ్ళొచ్చో లేదో అని నిలబడ్డాను అని రామ్మూర్తి అంటాడు. ఆయన మనసులోనే స్థానం ఇచ్చాడు మీరు రూమ్ లోకి వెళ్ళడానికి మొహమాట పడతారు ఎందుకు సార్ వెళ్ళండి అని రాథోడ్ అంటాడు. రామ్మూర్తి తన గదిలోకి వస్తాడు.

రండి అక్కడే నిలబడిపోయారే అని అమరేంద్ర అంటాడు. అంటే బాబు ఏదో మాట్లాడాలన్నారు కదా అడుగుదామని వచ్చాను అని రామ్మూర్తి అంటాడు. డిన్నర్ చేసాక మాట్లాడుకుందాం అన్నాను కదా అండి మీరు అర్జెంటుగా వెళ్లాలా ఏమైనా పనులు ఉన్నాయా అని అమరేంద్ర అంటాడు. అబ్బే నాకేం పనులు ఉన్నాయి బాబు ఏమీ లేవు అని రామ్మూర్తి అంటాడు.

తాతయ్య మా అమ్మ గురించి చెప్పినప్పుడు మా అమ్మని చూపించమన్నారుగా చూస్తారా అని అంజలి అడుగుతుంది. చూస్తా అమ్మ అని రా మూర్తి అంటాడు. అంజలి తీసుకువెళ్లి అరుంధతి ఫోటో రామ్మూర్తికి ఇస్తుంది. అది చూసిన రామ్మూర్తి అమ్మ అని పిలుస్తాడు. అమర్​ రామ్మూర్తికి ఏం చెప్పబోతున్నాడు? మనోహరి హంతకుడిని తప్పించేందుకు ఏం చేయనుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మార్చి 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel