NNS 13th February Episode: రణ్‌వీర్‌ను చంపడానికి మనోహరి ప్లాన్.. అనామికగా మారిపోయిన అరుంధతి..
NNS 13th February Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (ఫిబ్రవరి 13) ఎపిసోడ్లో అనామికా మారిపోతుంది అరుంధతి. అటు కాళీ తన మెడలో బలవంతంగా తాళి కట్టేందుకు ప్రయత్నించడంతో ముందు రణ్‌వీర్ ను చంపమంటూ అతనికి మనోహరి చెబుతుంది.

NNS 13th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 13) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి రాగానే బలవంతంగా తాళి కడతానని కాళీ అనగానే మంగళ షాక్ అవుతుంది. ఆ మనోహరి నమ్మిన స్నేహితురాలినే చంపింది. నిన్ను నన్ను వదిలిపెడుతుందా..? అంటూ భయపడుతుంది.
మనోహరి మెడలో తాళి కడతానన్న కాళీ
అరుంధతిని చంపింది. ఆ ఇంట్లో చేరింది. అందర్ని మోసం చేస్తుంది. అమరేంద్రను పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఏదో ఒక రోజు చేసుకుంటుంది అన్న ఆశతో ఏదో ఒక రోజు చేసుకుంటుందన్న నమ్మకంతోనే కదనే అంటాడు కాళీ అవునని అంటుంది మంగళ.
అదే నేను మనోహరి మెడలో తాళి కట్టినట్టు.. నా పెళ్లాం అయినట్టు.. అమరేంద్రకు ఆ కుటుంబానికి తెలిస్తే.. ఇంకెట్టా పెళ్లి చేసుకుంటదే.. నాతో కలిసి ఉండటం తప్పా ఆ మనోహరికి మరో దారే లేదు అని కాళీ చెప్పడంతో మంగళ కూడా ఇంకాసేపట్టో మనోహరి కలలు కన్నీళ్లుగా మారబోతున్నాయి అని తెలియక ఆగమేఘాల మీద ఇక్కడకు వస్తుందా..? పాపం అంటుంది మంగళ.
అనామిక శరీరంలోకి ఆరు
చిత్రగుప్తుడు ఆరును తీసుకుని మేఘాలలో వెళ్తుంటాడు. ఆరు అనుమానంగా మిస్టర్ చిత్రగుప్తా.. మీరు నాకు హ్యాండిచ్చి.. నన్ను యమలోకం తీసుకుపోవడం లేదు కదా అని అడుగుతుంది. దీంతో గుప్త చిరాకుగా అనుమానం ముందు పుట్టి.. తర్వాత మానవులు పుట్టారని నా పితృదేవులు చెప్తుంటే నేను నమ్మలేదు. కానీ నిన్ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అంటాడు.
బాలిక తమరి కోసం నేను ఇంతటి సాహసానికి ఒడిగడితే మీరు నన్నే అనుమానించుచుంటిరే అంటాడు. ఇది ఎవరైనా వింటే మీరు నిజంగా గొప్ప వ్యక్తి అనుకుంటారు అంటుంది. ఇందులో నా స్వార్థం కూడా ఉన్నది బాలిక అంటాడు. అవును నాకు తెలుసులే మీరు ఇదంతా నాగమణి కోసం చేస్తున్నారని నాకు తెలుసు అని ఆరు చెప్తుండగానే.. చిత్రగుప్తుడు బాలిక మనం చేరవలసిన ప్రదేశం అదే అని అనామిక దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ అనామిక నిద్రమాత్రలు మింగి చనిపోతుంది. వెంటనే ఆమె బాడీలోకి ఆరు ఆత్మను ప్రవేశపెడతాడు చిత్రగుప్తుడు.
అంతా మంచికేనన్న నిర్మల
మరోవైపు పెద్దగా గాలి వీయడంతో ఇంట్లో ఉన్న ఆరు ఫోటో దగ్గర దీపం ఆరిపోతుంది. పూజగదిలో మిస్సమ్మ పూజ చేస్తుంటే.. దీపం ఆరిపోతుంది. కానీ మిస్సమ్మ చేతులు అడ్డుపెడుతుంది. గాలి తగ్గాక మిస్సమ్మ హాల్లోకి రాగానే శివరాం కంగారుగా ఏంటమ్మా ఇది ఉన్నట్టుండి గాలి వీచింది అని అడుగుతాడు. అదే అర్థం కావడం లేదు మామయ్య దీపం కూడా కొండెక్కబోయింది.
ఇందాకటి నుంచి మనసంతా అలజడిగా ఉంది. ఏదో జరుగుతున్నట్టు ఏవేవో పిచ్చి ఆలోచనలు అంటూ కంగారు పడుతుంది మిస్సమ్మ. నిర్మల భయపడాల్సిన అవసరం లేదు మిస్సమ్మ.. జరగబోయేదంతా మంచిదేనని ఆ పరమేశ్వరుడు సంకేతాన్ని పంపాడు అని చెప్పగానే.. శివరాం ఆశ్చర్యంగా ఏంటి నిర్మల నువ్వు చెప్పేది అని అడుగుతాడు. నిర్మల అవునండి రేపుటి శివరాత్రి శివతాండవానికి శివయ్య సన్నాహాలు మొదలుపెట్టాడు అనిపిస్తుందండి అని చెప్తుంది.
ఆరు పోయి అనామిక వచ్చె
అనామిక శరీరంలోకి వెళ్లిన ఆరు మత్తుగా లేస్తుంది. చిత్రగుప్తుడు దగ్గరకు వెళ్లి హమ్మయ్యా లేచితివా బాలిక త్వరగా నీ గృహమునకు వెళ్లెదము.. నాగమణిని తీసుకుని వచ్చెదము అంటూ మాట్లాడుతుంటే.. అనామికకు వినిపించదు. చిత్రగుప్తుడు కనిపించడు. గుప్త షాక్ అవుతాడు.
అనామిక మాత్రం ఆరులా కాకుండా అనామికలాగే మాట్లాడుతుంది. ఎక్కడో ఏదో తప్పిదం జరిగింది. వెంటనే యమపురికి వెళ్లి తప్పిదం తెలుసుకోవాలి అని చిత్రగుప్తుడు వెళ్లిపోతాడు.
తాళి కట్టేందుకు ప్రయత్నించి కాళీ
మనోహరి కోసం కాళీ, మంగళ ఎదురుచూస్తుంటారు. ఇంతలో మనోహరి వస్తుంది. కోపంగా తిడుతూ ఎంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తావురా నువ్వు అంటూ కొట్టబోతుంటే.. మంగళ అడ్డుపడి.. మనోహరి ఆగు ఏంటి ఈ కోపం నా తమ్ముణ్ని చంపేస్తావా ఏంటి.. అంటుంది. ఏయ్ నాకొచ్చే కోపానికి నీ తమ్ముణ్నే కాదు నిన్ను కూడా చంపేస్తాను అంటూ చెప్పు ఎంత కావాలి నీకు అని అడుగుతుంది.
దీంతో కాళీ ఎంత కావాలని కాదు మనోహరి.. ఏం కావాలని అడుగు మనోహరి అంటాడు. సరే చెప్పు ఏం కావాలి అని అడుగుతుంది మనోహరి. కాళీ పెళ్లి కావాలి. నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. చిన్నప్పటి నుంచి భాగీని ఎంతో ప్రేమించాను. కానీ నీవల్లే భాగీతో నా పెళ్లి ఆగిపోయింది అంటాడు కాళీ.
రణ్‌వీర్‌ను చంపేయాలన్న మనోహరి
మనోహరి వెటకారంగా అయితే ఏం చేయాలి ఇప్పుడు ఒక అమ్మాయిని వెతికి నీ పెళ్లి చేయాలా..? అంటుంది. దీంతో కాళీ లేదు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు అంటాడు. మనోహరి కోపంగా ఏమన్నావు అంటుంది. కాళీ తన చేతిలో ఉన్న తాళి చూపిస్తాడు. కోపంగా మనోహరి ఎంత ధైర్యం ఉంటే నన్నే పెళ్లి చేసుకుంటాను అంటావురా..? అంటూ తిడుతుంటే.. కాళీ బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నిస్తాడు.
మనోహరి అడ్డుకుని తోసేస్తుంది. నాకు ఆల్ రెడీ పెళ్లి అయింది. నువ్వు నా మెడలో తాళి కడితే నా మాజీ మొగుడు నిన్ను జైలుకు పంపిస్తాడు. అలా కాకుండా రణవీర్‌ను నువ్వు చంపేసిరా అప్పుడు పెళ్లి చేసుకుందాం. కోట్ల ఆస్తి వస్తుంది అని నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి వెళ్లిపోతుంది మనోహరి. నిజంగానే మనోహరి కాళీని పెళ్లి చేసుకుంటుందా? కాళీ మనోహరి మాటలు నమ్ముతాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఫిబ్రవరి 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
సంబంధిత కథనం
టాపిక్