NNS 12th November Episode: భాగీని తీసుకురావడానికి ఒప్పుకున్న అమర్.. మనోహరి నాటకం.. కాలు విరగ్గొట్టిన ఆరు!
NNS 12thNovember Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్లో భాగీని తీసుకురావడానికి అమర్ అంగీకరిస్తాడు. ఆ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి మనోహరి కొత్త నాటకం ప్రారంభిస్తుంది. అది చూసి ఆమె కాలు విరగ్గొడుతుంది ఆరు ఆత్మ.
NNS 12th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 12) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ తల్లిదండ్రులను పిలిచి ఎందుకు అలా డల్‌గా ఉన్నారని అడుగుతాడు. మిస్సమ్మ లేని ఇల్లు ఇల్లులా లేదని, వెంటనే తనని తీసుకురమ్మంటారు నిర్మల, శివరామ్. భాగీని మీరే వెళ్లి తీసుకురండి అని నిర్మల, శివరాంలకు అమర్ చెప్పగానే శివరాం మేము వెళ్లకూడదని నువ్వే వెళ్లి తీసుకురావాలని చెప్తుంటారు.
మనోహరి నాటకం
కింద నుంచి అంతా వింటున్న మనోహరి ఎలాగైనా అమర్‌ను డైవర్ట్ చేయాలనుకుని పైకి అమర్ అని పిలుస్తూ వచ్చి కింద పడినట్టు యాక్టింగ్ చేస్తుంది. బాగా దెబ్బ తగిలినట్టు నొప్పి వస్తున్నట్టు నటిస్తుంది. దాంతో అమర్.. మనోహరిని పట్టుకుని రూంలోకి తీసుకెళ్తాడు. ఆరు, గుప్త కూడా రూంలోకి వస్తారు.
నీవలె కన్నులు పెద్దవిగా చేసుకుని ఈ సన్నివేశాన్ని చూసే ధైర్యం నాకు లేదు బాలిక నేను వెళ్లుచున్నాను అని వెళ్లిపోతాడు గుప్త. అయ్యో గుప్త గారు.. ఆగండి.. అంటుంది ఆరు. పెయిన్ ఎక్కువగా ఉంది అమర్.. నొప్పి భరించలేకపోతున్నాను అంటుంది మనోహరి. అయితే డాక్టర్ కు కాల్ చేస్తాను ఉండు మనోహరి అంటాడు అమర్. ఇంత చిన్న దెబ్బకు డాక్టర్ ఎందుకు..? పెయిన్ కిల్లర్ ఆయింట్‌మెంట్ రాసుకుంటే సరిపోతుంది కదా.. అంటుంది మనోహరి. చిన్న దెబ్బ ఏంటి మనోహరి నడవలేకపోతున్నావు కదా.. ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు అంటాడు అమర్.
మనోహరి కాలు విరగ్గొట్టిన ఆరు
అయ్యో అమర్ పర్వాలేదు. ఒకసారి ఆయింట్‌మెంట్ రాసి చూద్దాం.. అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ కు కాల్ చేద్దాం అని మనోహరి చెప్పగానే అమర్ ఆయింట్ మెంట్ తీసుకురావడానికి వెళ్తాడు. అమర్ వెళ్లగానే మనోహరి హ్యాపీగా ఫీలవుతూ ఇదే మంచి చాన్స్ అమర్ తో ఆయింట్ మెంట్ రాయించుకుని అప్పుడు తనను ప్రేమలోకి దించుతాను అనుకుంటుంది.
అక్కడే ఉన్న ఆరు.. మనోహరి కాలు పట్టుకుని విరగ్గొడుతుంది. ఇంతలో అమర్ వచ్చి ఆయింట్‌మెంట్ రాయడానికి వెళ్తుంటే.. ఆరు కాలు విరగ్గొడుతుంది. మనోహరి అరుస్తూ ఆ ఆయింట్‌మెంట్ నాకు ఇవ్వు అమర్ నేను రాసుకుంటాను అని తీసుకుంటుంది.
భాగీకి కనిపించిన ఆరు
భాగీ ఫ్రెండ్ కరుణ అమర్ ఇంటికి వస్తుంది. వీడియో కాల్ చేసి భాగీకి ఇంటిని చూపిస్తుంది. వీడియో కాల్ లో భాగీకి ఆరు కనిపిస్తుంది. అక్కా ఉంది అక్కడ.. అంటుంది భాగీ. అక్కా అక్క ఏది? అంటుంది కరుణ. అదేనే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా.. పక్కింటి అక్కా.. అంటుంది భాగీ. ఎక్కడ ఉందే… అనగానే ఏంటో ఫోన్ అటూ ఇటూ తిప్పుతున్నావు.. సరిగ్గా పెట్టవే.. కెమెరా కదపకుండా సరిగ్గా పెట్టు .. ఆ ఇప్పుడు చూశావుగా అక్కడే పెట్టు అంటుంది.
ఎవరున్నారే పలకరించడానికి.. అక్కడ ఎవ్వరూ లేరు కదా..? అంటుంది కరుణ. కళ్ల ముందు పెట్టుకుని కనిపించడం లేదా..? అంటుంది భాగీ. బాలిక ఇటు రమ్ము.. ఈ బాలిక.. ఆ బాలిక ఆ చరవాణిలో నిన్ను చూస్తున్నారు అని చెబుతాడు గుప్త. ఆరు చాటుకు వెళ్తుంది. కరుణ కూడా కోపంగా భాగీని తిడుతూ.. మీ ఆయన్ని చూపించాలా..? లేక వేరే ఏదో చూపించాలా..? అంటూ లోపలికి వెళ్తుంది. తర్వాత ఆరు కిటికీ దగ్గరకు వెళ్తుంది.
ఇంట్లోకి వెళ్లిన కరుణను శివరాం పలకరిస్తాడు. తర్వాత విషయం తెలుసుకుని నాటకం మొదలుపెడతారు. ఇంకెక్కడి భాగీ.. పుట్టింటికి వెళ్లింది అని శివరాం చెప్తుంటే వెనక నుంచి అమర్ వస్తాడు. కోపంగా శివరాంను పిలిచి అసలు మీరు ఏం చెప్తున్నారో మీకైనా అర్థం అవుతుందా..? అంటూ అరుస్తాడు. ఇంతలో భాగీ ఫోన్ లో అమర్ ను చూసి ఎమోషనల్ అవుతుంది. అమర్ వెళ్లి భాగీని తీసుకొస్తాడా? ఆరుని తీసుకెళ్లేందుకు యముడు భూలోకానికి వస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్ 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్