NNS 12th March Episode: అమర్​కి కనిపించిన అరుంధతి.. హంతకుడిని పట్టుకున్న అమర్​.. దొరికిపోయిన మనోహరి​​​!-zee telugu serial nindu noorella saavasam today 12th march episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 12th March Episode: అమర్​కి కనిపించిన అరుంధతి.. హంతకుడిని పట్టుకున్న అమర్​.. దొరికిపోయిన మనోహరి​​​!

NNS 12th March Episode: అమర్​కి కనిపించిన అరుంధతి.. హంతకుడిని పట్టుకున్న అమర్​.. దొరికిపోయిన మనోహరి​​​!

Hari Prasad S HT Telugu

NNS 12th March Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (మార్చి 12) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అరుంధతిని అమర్ చూడటం, ఆ తర్వాత హంతకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించడంలాంటి ఘటనలతో ఈ ఎపిసోడ్ రక్తి కట్టించింది.

అమర్​కి కనిపించిన అరుంధతి.. హంతకుడిని పట్టుకున్న అమర్​.. దొరికిపోయిన మనోహరి​​​!

NNS 12th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (మార్చి 12) 181వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మార్కెట్​కి వెళ్తున్నా అని చెప్పి మనోహరిని కలవడానికి వస్తుంది మంగళ. కానీ మనోహరి పూర్తిగా భాగమతి వలలో పడిపోయి మంగళ మాటలను పట్టించుకోదు. మనోహరి నుంచి డబ్బులు లాగడం అయ్యేపనిలా లేదని తెలుసుకున్న మంగళ అక్కడనుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.

అంతలోనే భాగమతి బయటకి వచ్చి మంగళను చూసి ఇక్కడేం చేస్తున్నావు పిన్నీ అంటుంది. అక్కడ నుంచి బయలుదేరిన మంగళకు రామ్మూర్తి ఎదురుపడి ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక మంగళ తడబడుతుంది. నా కూతురు మనోహరి పెళ్లి చెడగొట్టే పనిలో ఉంది, దాని ప్రయత్నానికి నువ్వు అడ్డుపడకు అని చెబుతాడు. ఆ విషయాన్ని మనోహరితో చెప్పినా ఏం ఫలితం ఉండదని అర్థం చేసుకున్న మంగళ అక్కడనుంచి ఇంటికి వెళ్లిపోతుంది.

మనోహరిని ఏడిపించిన పిల్లలు

రామ్మూర్తి అమర్​ ఇంటికి వెళ్తాడు. తండ్రిని చూసిన భాగమతి లోపలకి తీసుకెళ్తుంది. అమర్​ తల్లిదండ్రులు రామ్మూర్తిని పలకరించి కూర్చోమంటారు. మనోహరి ఆకలితో బాధపడుతూ ఉంటుంది. ఎవరూ చూడకుండా కిచెన్లోకి వెళ్లి పాలు తాగేద్దామనుకుంటుంది. కానీ గ్లాసు పాలకోసం పెళ్లి చెడగొట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తుంది. అప్పుడే నీల అక్కడకు వచ్చి ఎలా ఉన్నారమ్మా అని అడుగుతుంది.

అప్పుడే పిల్లలు అమ్మా.. అని పిలుస్తూ వస్తారు. నేనే ఆకలితో చచ్చిపోతుంటే వీళ్ల గొడవొకటి అని చిరాకుపడుతుంది. పిల్లలు రకరకాల ఫుడ్​ ఐటెమ్స్​ తెచ్చి మనోహరి ముందు పెడతారు . వాటిని తినేందుకు ఆశగా చేయి చాపుతుంది మనోహరి. కానీ ఈరోజు మీరు ఏం తినకూడదమ్మా.. అని గుర్తు చేస్తుంది నీల. పిల్లలు కావాలనే తనని ఏడిపిస్తున్నారని అర్థం చేసుకుని అక్కడ నుంచి పంపించేస్తుంది. మనమీద మనోహరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా మనం అనుకున్న పని చేయాలి. అంజు.. నువ్వు మరీ ఓవర్ యాక్షన్​ చేస్తున్నావు అని హెచ్చరిస్తుంది మిస్సమ్మ.

అమర్‌కు కనిపించిన అరుంధతి

మనోహరితో తన పెళ్లి గురించి ఆలోచిస్తూ వెళ్తుంటాడు అమర్. రోడ్డుపై ఎవరో యాక్సిడెంట్​ అయి పడి ఉండటం చూసి జీప్ ఆపుతాడు. కానీ ఎదురుగా ఉన్నది అరుంధతి అని చూసి షాకవుతాడు. తనెంతగానో ప్రేమించే భార్య దూరమై కుమిలిపోతున్న అమర్​ అరుంధతి కనపడగానే ఆనందంగా తనవెంట పరిగెడతాడు. కానీ అరుంధతి ఆత్మ మాయమైపోవడంతో బాధగా కూర్చుంటాడు.

అప్పుడే మనోహరితో మాట్లాడానికి అటుగా వచ్చిన హంతకుడు అమర్​ కంటపడతాడు. అతణ్ని చూసి గుర్తుపట్టి పట్టుకోడానికి వెంటపడతాడు అమర్​. చాలాదూరం వెంబడించి హంతకుడిని పట్టుకుని చితకబాదుతాడు. అసలు తన భార్యని చంపమని చెప్పింది ఎవరని అడుగుతాడు. అప్పుడే అక్కడకు పోలీసులు రావడంతో హంతకుడు మనోహరి పేరు చెప్పకుండా ఆగిపోతాడు.

పోలీసులకు కంప్లైంట్​ రాసి ఇచ్చి ఆ హంతకుడి వెనకాల ఎవరు ఉన్నారో చెప్పించమని అక్కడ నుంచి వెళ్తాడు అమర్. ఇంటికి వచ్చిన అమర్​ ఏం చేస్తాడు? మనోహరి నిజం స్వరూపం బయటపడనుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మార్చి 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!