Jagadhatri August 31st Episode: జగద్ధాత్రికి పెళ్లిచూపులు.. వరుడు ఎవరో తెలుసా?-zee telugu serial jagadhatri today august 31st episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jagadhatri August 31st Episode: జగద్ధాత్రికి పెళ్లిచూపులు.. వరుడు ఎవరో తెలుసా?

Jagadhatri August 31st Episode: జగద్ధాత్రికి పెళ్లిచూపులు.. వరుడు ఎవరో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Aug 31, 2023 02:10 PM IST

Jagadhatri August 31st Episode: జగద్ధాత్రి పెళ్లిచూపులకు సిద్ధమైంది. దీంతో గురువారం (ఆగస్ట్ 31) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కానీ ఆ సంబంధాన్ని చెడగొట్టడానికి ధాత్రి ప్లాన్ చేస్తుంది.

జీ తెలుగు సీరియల్ జగద్ధాత్రి
జీ తెలుగు సీరియల్ జగద్ధాత్రి

Jagadhatri August 31st Episode: జీ తెలుగులో వస్తున్న జగద్ధాత్రి సీరియల్ గురువారం (ఆగస్ట్ 31) పదో ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అమాయకురాలైన ఆడపిల్ల అన్యాయాన్ని ఎదుర్కోవడంలో అపరకాళిలా ఎలా మారుతుందనే కథాంశంతో ఆసక్తికరంగా సాగుతున్న సీరియల్​ జగద్ధాత్రి. ఇంట్లో అందరికీ టీచర్​గా పనిచేస్తున్నాని చెప్పి అండర్​కవర్​ పోలీస్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న జగద్ధాత్రి జీవితంలో ఏం జరిగింది. ఆమె తల్లి చావు వెనక గల కారణాలను జగద్ధాత్రి ఎలా ఛేదిస్తుందనేది తెలియాలంటే ఈ సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే.

కేదార్​ ఇచ్చిన చీర తీసుకుని సంబరంగా ఇంట్లోకి వస్తుంది జగద్ధాత్రి. అది చూసిన రేఖ కోపంతో రగిలిపోతుంది. వెంటనే ఆ చీర తీసి మంటల్లో పడేస్తుంది. కానీ జగద్ధాత్రి మంటల్లోంచి ఆ చీరను తీస్తుంది. జగద్దాత్రి, కేదార్​ మధ్య ఏదో జరుగుతుందని అనుమానపడిన రేఖ వెంటనే ధాత్రికి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని అనుకుంటుంది.

ఇంతలో సాధు దగ్గరనుంచి ధాత్రికి ఫోన్​ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడుతుంది. అది చూసిన రేఖ వెంటనే వెళ్లి ఫోన్​ లాక్కుంటుంది. కంగారు పడిన ధాత్రి తను పనిచేస్తున్న స్కూల్ నుంచి ఫోన్​ చేశారని చెప్పి తప్పించుకుంటుంది. కౌశికి ఇంట్లో పెళ్లిపనులు జరుగుతూ ఉంటాయి. అమ్మానాన్నలతో ఉన్న ఓ పాప బొమ్మ గీస్తుంది కీర్తి. అది చూసిన కౌశికి తనకు అమ్మైనా, నాన్నైనా తానేనని కీర్తికి చెబుతుంది.

కీర్తి ఆలోచనలు తండ్రిపైకి మళ్లకుండా చూసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ధాత్రిని చూసుకోడానికి పెళ్లివారు వస్తున్నారని చెబుతుంది రేఖ. సంబరపడిపోయిన సుబ్బు మనవరాలిని అందంగా తయారవమంటుంది. పెళ్లిచూపుల్లో కూర్చున్న తర్వాత ధాత్రి అందరికీ కాఫీలు ఇస్తుంది.

ముందుగా వరుడి తండ్రికి కాఫీ ఇవ్వమని చెబుతుంది సుబ్బు. కానీ అతడు వరుడి తండ్రి కాదని, అతడే వరుడని అంటుంది రేఖ. జగద్దాత్రి రేఖ మాట కాదని ఆ పెళ్లిసంబంధాన్ని ఎలా చెడగొడుతుంది? ధాత్రిపై అనుమానం వచ్చిన రేఖ ఏం చేస్తుంది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈరోజు, ఆగస్టు 31న ప్రసారమయ్యే జగద్ధాత్రి సీరియల్​ చూడాల్సిందే!

WhatsApp channel