Telugu Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న జగద్ధాత్రి సీరియల్ ఐదు వందల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌తో ఈ మైలురాయిని చేరుకున్నది. లేటేస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో జగద్ధాత్రి అదరగొట్టింది. జీ తెలుగు సీరియల్స్‌లో అర్బన్ ఏరియాలో 7.14 రేటింగ్‌తో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది.
అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో కలిపి ఈ సీరియల్‌కు 6.77 రేటింగ్ వచ్చింది. అర్బన్ ప్లస్ రూరల్ టీఆర్‌పీ రేటింగ్‌లో చామంతి, మేఘసందేశం, పడమటి సంధ్యారాగం తర్వాత నాలుగో ప్లేస్‌లో జగద్ధాత్రి సీరియల్ నిలిచింది.
జగద్ధాత్రి సీరియల్ 2023 ఆగస్ట్ 21వ ప్రారంభమైంది. తొలుత సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ సీరియల్‌ను టెలికాస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఈ సీరియల్ టైమ్ ఛేంజ్ చేశారు. ప్రస్తుతం రాత్రి తొమ్మిది గంటలకు జగద్ధాత్రి ప్రసారమవుతోంది. ఈ తెలుగు సీరియల్‌లో రాధమ్మ కూతురు ఫేమ్ దీప్తి మన్నే, దర్శ్ చంద్రప్ప లీడ్ రోల్స్ చేస్తోన్నారు. లిరీషా, నీలిమ, బాలాజీ వేణుగోపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లో జగద్ధాత్రి అనే సీక్రెట్ ఏజెంట్ పాత్రలో దీప్తి మన్నే నటించింది.
జగద్ధాత్రి ఓ అండర్ కవర్ ఆఫీసర్. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో జగద్దాత్రి ఎలాంటి ఇబ్బందులు పడింది. కేదార్ (దర్శ్ చంద్రప్ప) కు జగద్దాత్రికి ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరి మధ్య మొదలైన ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందిఝ జగద్ధాత్రి జీవితంలోకి వచ్చిన యువరాజ్, వైజయంతి, దివ్యాంక ఎవరు అన్నదే ఈ సీరియల్ కథ. జగద్ధాత్రి సీరియల్‌కు టాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పనిచేయడం గమనార్హం.
రాధమ్మ కూతురు సీరియల్‌తోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దీప్తి మన్నే. సీరియల్స్ మాత్రమే కాకుండా ఇక సె...లవ్‌తో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో మెరిసింది. అంతుకుముందు కన్నడంలో పద్మావతితో పాటు మరికొన్ని సీరియల్స్‌లో నటించింది. కన్నడంలో దేవదాస్ బ్రదర్స్, కర్త, ఏవన్‌తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది..సీరియల్స్‌లో ట్రేడిషనల్ రోల్స్‌లో ఎక్కువగా కనిపించే దీప్తి మన్నే సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది.
సంబంధిత కథనం