Tv Serial: 2000ల‌కుపైగా ఎపిసోడ్స్‌తో కంటిన్యూ - ఏడేళ్లుగా టెలికాస్ట్ - ప్ర‌జెంట్ లాంగెస్ట్ ర‌న్నింగ్ తెలుగు సీరియ‌ల్ ఇదే-zee telugu serial gundamma katha completes 2000 episodes longest running telugu tv serials ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tv Serial: 2000ల‌కుపైగా ఎపిసోడ్స్‌తో కంటిన్యూ - ఏడేళ్లుగా టెలికాస్ట్ - ప్ర‌జెంట్ లాంగెస్ట్ ర‌న్నింగ్ తెలుగు సీరియ‌ల్ ఇదే

Tv Serial: 2000ల‌కుపైగా ఎపిసోడ్స్‌తో కంటిన్యూ - ఏడేళ్లుగా టెలికాస్ట్ - ప్ర‌జెంట్ లాంగెస్ట్ ర‌న్నింగ్ తెలుగు సీరియ‌ల్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Jan 22, 2025 02:10 PM IST

Tv Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్ ఇటీవ‌లే 2000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న‌ది. ప్ర‌జెంట్ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్‌గా రికార్డ్ నెల‌కొల్పింది. 2000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఆర‌వ తెలుగు సీరియ‌ల్‌గా నిలిచింది.

టీవీ సీరియ‌ల్‌
టీవీ సీరియ‌ల్‌

Tv Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్ కొత‌ రికార్డును క్రియేట్ చేసింది. జీ తెలుగు ఛానెల్‌లోనే కాకుండా ప్ర‌స్తుతం తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సీరియ‌ల్స్‌లో లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్‌గా గుండ‌మ్మ క‌థ‌ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్ 2000 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది. జీ తెలుగులో రెండు వేల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న ఫ‌స్ట్ టీవీ సీరియ‌ల్‌గా గుండ‌మ్మ క‌థ నిలిచింది.

ఐదు సీరియ‌ల్స్ మాత్ర‌మే...

గుండ‌మ్మ క‌థ కంటే ముందు తెలుగులో కేవ‌లం ఐదు సీరియ‌ల్స్ మాత్ర‌మే 2000 ఎపిసోడ్స్‌పైగా టెలికాస్ట్ అయ్యాయి. అందులో నాలుగు సీరియ‌ల్స్ ఈటీవీకి చెందిన‌వి కాగా...ఓ సీరియ‌ల్ స్టార్ మా ఛానెల్‌లో ప్ర‌సార‌మైంది. ఈటీవీలో టెలికాస్ట్ అయిన అభిషేకం 4000 ఎపిసోడ్స్‌లో తెలుగులోనే లాంగెస్ట్ సీరియ‌ల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆడ‌దే ఆధారం (3329 ఎపిసోడ్స్‌), మ‌న‌సు మ‌మ‌త (3305 ఎపిసోడ్స్‌), అత్తారింటికి దారేది (2344 ఎపిసోడ్స్‌) త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన కుంకుమ పువ్వు సీరియ‌ల్ 2501 ఎపిసోడ్స్‌తో టాప్ ఫైవ్‌లో నిలిచింది. ఈ ఐదు సీరియ‌ల్స్ త‌ర్వాత స్థానంలో గుండ‌మ్మ క‌థ ఉంది.

2018లో మొద‌లు...

2018 ఏప్రిల్‌లో గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్ ప్రారంభ‌మైంది. ఏడేళ్ల‌ను పూర్తిచేసుకొని ఎనిమిదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్‌లో పూజా మూర్తి, సుష్మా కిర‌ణ్, హ‌నీ హ‌ర్ష‌లా, శ్రీదేవి, దేవిశ్రీ, మున్నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

మూడో జ‌న‌రేష‌న్‌...

ప్ర‌స్తుతం ఈ సీరియ‌ల్ మ‌ధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల‌కు టెలికాస్ట్ అవుతోంది. జ‌న‌రేష‌న్స్ మారుస్తూ ఈ సీరియ‌ల్‌ను మేక‌ర్స్ సాగ‌దీస్తున్నారు. ఇటీవ‌లే గుండ‌మ్మ క‌థ థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మొద‌లైంది.థ‌ర్డ్ జ‌న‌రేష‌న్‌లో పూజా మూర్తి, వేలు క్ష‌త్రియ, వైష్ణ‌వి, హేమ‌ల‌త క‌నిపించ‌బోతున్నారు.

క‌ల‌ల‌కు భిన్నంగా...

రామ్ అంద‌మైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని ఎన్నో క‌ల‌లు కంటాడు. రామ్‌ క‌ల‌ల‌కు పూర్తి భిన్నంగా గీత అత‌డి జీవితంలోకి అడుగుపెట్టింది. భిన్న మ‌న‌స్త‌త్వాలు, ఆలోచ‌న‌లు క‌లిగిన ఆ జంట ప్ర‌యాణం ఎలా సాగింద‌నే పాయింట్‌తో గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్‌ను మేక‌ర్స్ తెర‌కెక్కించారు.

Whats_app_banner