Telugu Serial: ఇంగ్లీష్‌లోకి డబ్ అయినా తెలుగు సూపర్ హిట్ సీరియల్ - ఆ ఒక్క దేశంలో మాత్రమే టెలికాస్ట్!
Telugu Serial: తెలుగు సీరియల్ అమ్మాయిగారు ఇంగ్లీష్‌లోకి డబ్ అయ్యింది. ఇంగ్లీష్ వెర్షన్‌కు డ్రైవర్ బై డెకాయిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జీ వరల్డ్ ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతోంది. ఈ తెలుగు సీరియల్ కేవలం సౌతాఫ్రికాలో మాత్రమే టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం.
Telugu Serial: జీ తెలుగు సీరియల్ అమ్మాయిగారు ఇక నుంచి ఇంగ్లీష్‌లోనూ టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీరియల్‌లో ఇంగ్లీష్ భాషలోకి డబ్ చేశారు. ఇంగ్లీష్‌లోకి డబ్ అయినా ఫస్ట్ తెలుగు సీరియల్‌గా అమ్మాయిగారు నిలిచింది. అమ్మాయి గారు ఇంగ్లీష్ వెర్షన్‌కు డ్రైవర్ బై డెకాయిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

జీ వరల్డ్ ఛానెల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీరియల్ కేవలం సౌతాఫ్రికాలో మాత్రమే టెలికాస్ట్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
నిషా రవికృష్ణన్ లీడ్ రోల్...
అమ్మాయిగారు సీరియల్‌లో నిషా రవికృష్ణన్, యశ్వంత్ గౌడ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్నారు. అనిల్ అల్లం, సుస్మిత, నీరజ, చైత్ర, మానస కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఈ సీరియల్ 700 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఈ సీరియల్ రూపొందింది. మినిస్టర్ కూతురు రూపకు డబ్బు, పేరు, గౌరవం అన్ని ఉన్నా తండ్రి ప్రేమాభిమానాలకు దూరంగా బతుకుతుంటుంది. భార్యపై ఉన్న ద్వేషాన్ని కూతురు రూపపై చూపుతుంటాడు ప్రతాప్.
తండ్రి ఎంత ద్వేషించినా రూప మాత్రం ప్రతాప్‌పై అభిమానాన్ని చూపుతూనే ఉంటాడు. అసలు రూపను ప్రతాప్ ద్వేషించడానికి కారణం ఏమిటి? రూప జీవితంలోకి వచ్చి రాజు ఎవరనే అంశాలతో ఈ సీరియల్ రూపొందింది.
పోటాపోటీగా...
అమ్మాయిగారు సీరియల్‌లో రూప పాత్రలో నిషా రవికృష్ణన్ ఎమోషనల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది. నిషా తండ్రి పాత్రలో అనిల్ అల్లం కనిపించాడు. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా సాగుతూ బుల్లితెర ఫ్యాన్స్‌ను అలరిస్తోన్నాయి.
టీఆర్‌పీలో...
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో అమ్మాయిగారు సీరియల్ 4.94 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. టాప్ సిక్స్‌లో ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు టాప్ త్రీలో ఒకటిగా నిలిచింది. అమ్మాయిగారు సీరియల్ జీ తెలుగుతో పాటు యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులో....
కన్నడంలో సర్వ మంగళ మాంగల్యే సీరియల్‌తో ఫేమస్ అయ్యింది నిషా రవికృష్ణన్. ముత్యమంత ముద్దు సీరియల్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ కూడా జీ తెలుగులోనే టెలికాస్ట్ అయ్యింది. ఇందులో గీత పాత్రలో కనిపించింది. కన్నడంలో గట్టిమేళ సీరియల్ నిషా రవికృష్ణన్‌కు ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది.