RRR Ganesha Show: వినాయక చవితికి స్పెషల్ షో.. ముఖ్య అతిథులుగా రాధ, రాధిక.. బతుకు జట్కా బండి రిపీట్
RRR Ganesha Show In Zee Telugu: అలనాటి స్టార్ హీరోయిన్స్ రాధ, రాధిక ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న సరికొత్త షో ఆర్ఆర్ఆర్ గణేశా. ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు ఈ వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న ఆర్ఆర్ఆర్ గణేశా ఈవెంట్‌ను ఘనంగా జరపనున్నారు. ఆర్ఆర్ఆర్ గణేశా ఈవెంట్ పూర్తి వివరాల్లోకి వెళితే..
Radha Radhika RRR Ganesha Show: ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో నిరంతం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే ఛానల్ జీ తెలుగు. పండుగల వేళ రెట్టింపు వినోదంతో అలరించే జీ తెలుగు ఈ వినాయక చవితికి మరో సరికొత్త కార్యక్రమాన్ని అందించేందుకు సిద్ధమైంది. అలనాటి తారలు రాధ, రాధిక ముఖ్య అతిథులుగా సందడి చేసిన జీ తెలుగు మెగా సంబరం RRR గణేశా షో.
నటీనటులు కలిసి
తెలుగు ప్రేక్షకుల అభిమాన నటీనటులు, ముఖ్య అతిథుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగిన వినాయక చవితి వేడుక RRR గణేశా ఈవెంట్‌ను ఈ ఆదివారం (సెప్టెంబర్ 8) మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు. జీ తెలుగు నటీనటులు అందరూ కలిసి ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు.
మరింత సంబరంగా
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ రాధ, రాధిక ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాధ, రాధిక గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఆద్యంతం మనసును హత్తుకునే ప్రదర్శనలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో సరదాగా సాగింది. డైలాగ్ వార్తో మొదలైన రాధ, రాధికల జట్ల మధ్య పోటీ అంత్యాక్షరీతో మరింత సబంరంగా కొనసాగింది.
బతుకు జట్కా బండి రిపీట్
ఆటపాటలతో పాటు, ఆకట్టుకునే స్కిట్స్‌తో డ్రామా జూనియర్స్ పిల్లల ప్రదర్శన ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు, జీ తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బతుకు జట్కా బండి’ని ఈ వేదికపై మరోసారి ప్రేక్షకులకు అందించారు. ఈ కార్యక్రమంలో రాధ, రాధిక ఒక జంట మధ్య సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు.
ఆత్మరక్షణ పాఠాలు
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అంశాలను ప్రతిబింబిస్తూ, జీ తెలుగు నారి శక్తిగా దీప్తి మన్నె మహిళలకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పిస్తుంది. అంతేకాదు జీ తెలుగు పాపులర్ సీరియల్స్ ‘పడమటి సంధ్యారాగం’, ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ నటుల ప్రత్యేక ప్రదర్శనలు, మ్యూజికల్ ఛైర్స్ ఆట, జుగల్బంది డాన్స్‌తో ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది.
రవి-లాస్య సందడి
ఈ వినోదభరిత కార్యక్రమాన్ని ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తప్పకచూడమంటూ జీ తెలుగు అధికారికంగా ప్రకటించింది. ఇక షోకు యాంకర్‌గా రవి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే హిట్ యాంకర్ జోడీగా పేరు తెచ్చుకున్న యాంకర్ రవి, లాస్య మరోసారి ఈ షో ద్వారా బుల్లితెరపై సందడి చేయనున్నారు.
వినోదాత్మక షోలు
ఆర్ఆర్ఆర్ గణేశా ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో రెండు జట్లుగా ఉన్న రాధిక, రాధ వైపు రవి, లాస్య ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీవీ సీరియల్స్‌తోనే కాకుండా ఇలా పండుగల సమయంలో సరికొత్త వినోదాత్మక షోలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ పంచనుంది జీ తెలుగు.