Telugu Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్ ప్రేమ ఎంత మధురం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సీరియల్‌కు శుభం కార్డు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ ఎంత మధురం సీరియల్‌కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇందులో శంకర్, గౌరితో పాటు వారి తమ్ముళ్లు, చెల్లెళ్లకు పెళ్లి జరిగినట్లుగా కనిపిస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో ఇదని సీరియల్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. ఈ పెళ్లిళ్లతోనే ప్రేమ ఎంత మధురం సీరియల్‌ను ఎండ్ చేస్తారని అంటున్నారు. ఈ సీరియల్ ఎండింగ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే ప్రేమ ఎంత మధురం సీరియల్ 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. ప్రస్తుతం జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సెకండ్ లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా ప్రేమ ఎంత మధురం రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రేమ ఎంత మధురం సీరియల్ ఐదేళ్లుగా జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. 2020 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సీరియల్‌లో శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్‌కే లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. హీరోగా నటిస్తున్న శ్రీరామ్ వెంకట్ ఈ సీరియల్‌కు ప్రొడ్యూసర్ కావడం గమనార్హం.
ఈ తెలుగు సీరియల్‌లో రాంజగన్, జబర్ధస్థ్ వర్ష, దివ్య, కళ్యాణ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.ప్రేమ ఎంత మధురం ఆరంభంలో రాత్రి తొమ్మిది గంటలకు టెలికాస్ట్ అయ్యింది. గత ఏడాది జూన్‌లో సీరియల్ టైమింగ్ తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటలకు మార్చారు. టైమ్ ఛేంజ్ చేసినా టీఆర్‌పీలో మాత్రం ఈ సీరియల్ అదరగొడుతోంది.
నలభై ఏళ్ల వ్యాపారవేత్తకు ఇరవై ఏళ్ల డిగ్రీ స్టూడెంట్‌కు మధ్య మొదలైన ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందనే కాన్సెప్ట్‌కు పునర్జన్మలు అనే అంశాన్ని జోడించి డైరెక్టర్ సాయి వెంకట్ ఈ సీరియల్‌ను నడిపిస్తోన్నారు. ప్రేమ ఎంత మధురం సీరియల్‌కు సంబంధించి ఫస్ట్ జనరేషన్ పూర్తయింది.ప్రస్తుతం సెకండ్ జనరేషన్‌ను కథ నడుస్తోంది. మరాఠీలో విజయవంతమైన తులా పహతేరే సీరియల్‌కు రీమేక్‌గా ప్రేమ ఎంత మధురం రూపొందింది.
ప్రేమ ఎంత మధురంతో పాటు తెలుగులో రాధా కళ్యాణం, కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో పాటు మరికొన్ని సీరియల్స్ చేశాడు శ్రీరామ్ వెంకట్. సీరియల్స్‌లోనే కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. శతమానం భవతి, డేంజర్, బొమ్మరిల్లు, రామదండుతో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు. రెక్కీ అనే వెబ్‌సిరీస్‌ను ప్రొడ్యూస్ చేశాడు.
సంబంధిత కథనం