అశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. వీక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు నటీనటులు తాజాగా మహబూబ్ నగర్‌లో సందడి చేశారు.
జీ తెలుగు సీరియల్ పడమటి సంధ్యారాగంలో జానకి పుట్టినరోజు వేడుక పేరున మెగా ఈవెంట్‌ను మహబూబ్ నగర్‌లో నిర్వహించారు. విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు సీరియల్స్ పడమటి సంధ్యారాగం, ముక్కుపుడక, చామంతి నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది.
అభిమాన ప్రేక్షకుల మధ్య కోలాహలంగా జరిగిన కార్యక్రమం ‘పడమటి సంధ్యారాగంలో జానకి పుట్టినరోజు వేడుక’ మే 18న (ఆదివారం) రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. జీ తెలుగు ఇటీవల మహబూబ్ నగర్‌లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఈ ఆదివారం ప్రసారం కానుంది. మీ అభిమాన యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది.
జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న పడమటి సంధ్యారాగం, ముక్కుపుడక, చామంతి సీరియల్స్ నటీనటులు ఈ వేదికపై నుంచి తమ అభిమానులతో సంభాషించి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. నటీనటుల అదిరిపోయే ఎంట్రీతో ఆరంభమైన కార్యక్రమం కోలాహలంగా సాగింది.
దాదాపు 50 మంది కుటుంబ సభ్యులు గల ఒక ఉమ్మడి కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొని పడమటి సంధ్యారాగం సీరియల్ కుటుంబంతో కలిసి ముచ్చటించారు. వికలాంగురాలైన ఒక అభిమాని చామంతి (మేఘనా లోకేష్)ని కలిసి ముచ్చటించడం అందరి హృదయాలను హత్తుకుంది. ఆద్య(ప్రీతి శర్మ)-రామలక్ష్మి(సౌందర్య) మధ్య జరిగిన జుగల్భందీ మరింత వినోదాన్ని పంచింది.
జానపద గాయకుడు రాము రాథోడ్- త్రినయని(అషిక) గాన కచేరి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగడం, బహుమతులతో సర్‌ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. ఘనంగా జరిగిన ఈ సరదా సంబరాన్ని జీ తెలుగు వేదికగా మిస్ కావొద్దంటూ మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.
సంబంధిత కథనం