OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..-zara hatke zara bachke ott release date vicky kaushal and sara ali khan romantic movie to stream on jio cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
May 12, 2024 05:26 PM IST

Zara Hatke Zara Bachke OTT Release Date: బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘జర హట్కే జర బచ్కే’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెలల నిరీక్షణ తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

OTT: నిరీక్షణ ముగిసింది.. సూపర్ హిట్ మూవీ ‘జర హట్కే జర బచ్కే’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT: నిరీక్షణ ముగిసింది.. సూపర్ హిట్ మూవీ ‘జర హట్కే జర బచ్కే’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Zara Hatke Zara Bachke OTT: ‘జర హట్కే జర బచ్కే’ (ZHZB) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా గతేడాది జూన్ 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ‘జర హట్కే జర బచ్కే’ హిందీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ అయింది. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం 11 నెలలుగా చాలా మంది నిరీక్షిస్తున్నారు. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.

స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఇదే

‘జర హట్కే జర బచ్కే’ మూవీ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ మే 17న జియో సినిమాలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.

11 నెలల నిరీక్షణ

‘జర హట్కే జర బచ్కే’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకుంది. అయితే, నెలలు గడుస్తున్నా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు. దీంతో ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని చాలా ప్రేక్షకులు వేచిచూశారు. హిట్ అయిన ఈ మూవీని అసలు ఎందుకు జియోసినిమా స్ట్రీమింగ్‍కు తీసుకురావడం లేదనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన 11 నెలల తర్వాత ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. మే 17వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలుకానుంది.

సూపర్ హిట్‍గా..

జర హట్కే జర బచ్కే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‍గా నిలిచింది. ఈ మూవీకి సుమారు రూ.115 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తో ఈ రూపొందింది. అయితే, మిక్స్డ్ టాక్ వచ్చినా రూ.100కోట్ల మార్క్ దాటి అందరినీ ఈ మూవీ ఆశ్చర్యపరిచింది.

జర హట్కే జర బచ్కే చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. మైత్రే బాజ్‍పేయి, రమీజ్ ఇలాం ఖాన్ కథ అందించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్‍ హీరోహీరోయిన్లుగా చేయగా.. సుష్మిత ముఖర్జీ, ఇనాముల్‍ హక్, రాకేశ్ బేడీ, నీరజ్ సూద్, షారిబ్ హష్మి, ఆకాశ్ ఖురానా కీరోల్స్‌లో నటించారు. ఈ చిత్రంలో విక్కీ, సారా యాక్టింగ్, కెమిస్ట్రీకి ప్రశంసలు వచ్చాయి.

జర హట్కే జర బచ్కే చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేశ్ విజన్, జ్యోతీ దేశ్‍పాండే నిర్మించారు. సచిన్ - జిగార్ పాటలకు స్వరాలు అందించగా.. సందీప్ శిరోద్కర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. రాఘవ్ రామదాస్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మనీశ్ ప్రధాన ఎడిటింగ్ చేశారు.

సంతోషంగా జీవితం గడుపుతున్న కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య (సారా అలీఖాన్) ఓ దశలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే, ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. వారిద్దరూ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. నిజంగానే విడిపోయారా.. కుటుంబ సభ్యులు ఏం చేశారాన్నదే ఈ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. జర హట్కే జర బచ్కే మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అయింది.

Whats_app_banner