Dhanashree Video Viral: చాహల్ తో విడాకులు.. భర్త చేతిలో మోసపోయిన భార్యగా ధనశ్రీ.. వైరల్ గా యూట్యూబ్ వీడియో-yuzvendra chahal divorced wife dhanashree verma youtube video goes viral dekha ji dekha maine domestic violence ishwak ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanashree Video Viral: చాహల్ తో విడాకులు.. భర్త చేతిలో మోసపోయిన భార్యగా ధనశ్రీ.. వైరల్ గా యూట్యూబ్ వీడియో

Dhanashree Video Viral: చాహల్ తో విడాకులు.. భర్త చేతిలో మోసపోయిన భార్యగా ధనశ్రీ.. వైరల్ గా యూట్యూబ్ వీడియో

Dhanashree Video Viral: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుంచి విడాకులు తీసుకున్న ధనశ్రీ వర్మ కొత్త వీడియో వైరల్ అవుతోంది. భర్త చేతిలో మోసపోయిన భార్యగా ఆమె నటించిన యూట్యూబ్ వీడియో వ్యూస్ తో దూసుకెళ్తోంది.

వీడియో సాంగ్ లో ధనశ్రీ వర్మ (Instagram-dhanashree9)

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నుంచి విడాకులు తీసుకున్న ధనశ్రీ భార్య నటించిన తాజా ప్రైవేట్ ఆల్బమ్ వైరల్ గా మారింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్ లో ధనశ్రీ గృహ హింస‌ బాధితురాలిగా కనిపించడం గమనార్హం. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్న రోజే (మార్చి 20) యూట్యూబ్ లో ఈ సాంగ్ రిలీజ్ చేశారు.

గృహ హింస‌ బాధితురాలిగా

టీ-సిరీస్ యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్ వైరల్ గా మారింది. ‘దేకా జి దేకా మైనే’ అనే ఈ ప్రైవేట్ ఆల్బమ్ లో ధనశ్రీ భర్త చేతిలో మోసపోయిన భార్యగా నటించారు. ఇష్వాక్ మరో లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ సాంగ్ ను జ్యోతి సూరన్ పాడారు. ఈ వీడియోలో ఇష్వాక్, ధనశ్రీ భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. ఈ పాటను జాని రాయడంతో పాటు కంపోజ్ చేశారు. ఈ పాటకు రాహుల్ శెట్టి కొరియోగ్రాఫర్.

ఎంతో ప్రేమించినా

ఈ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ లో ఇష్వాక్, ధనశ్రీ భార్యాభర్తలుగా కనిపించారు. భర్తను ఎంతగానో ప్రేమించే భార్యగా ధనశ్రీ యాక్ట్ చేసింది. కానీ అతను మాత్రం వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. అది భరించలేక ధనశ్రీ ప్రశ్నిస్తే భర్త ఆమెపైనే దాడి చేస్తాడు. చివరకు ఈ కపుల్ విడిపోతారు. వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతారు. ఈ సీన్స్ తో వీడియో సాంగ్ రూపొందించారు. ఈ వీడియో సాంగ్ కు ఇప్పటికే 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

నిజ జీవితంలోనూ

చాహల్, ధనశ్రీ 2020 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మ యూట్యూబ్ లో డ్యాన్స్ వీడియోలతో మరింత పాపులర్ అయింది. టిక్ టాక్ వీడియోలతో అలరించింది. శ్రేయస్ అయ్యర్, ధావన్ తదితర టీమిండియా క్రికెటర్లతో ఆమె చేసిన డ్యాన్స్ రీల్స్ వైరల్ అయ్యాయి. అలాగే హిందీలో ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పార్టిసిపేట్ చేసింది.

చాహల్-ధనశ్రీ జూన్ 2022 నుంచే సెపరేట్ గా ఉంటున్నారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ బ్రేక్ అయింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఒకరి అకౌంట్ ను మరొకరు అన్ ఫాలో కావడంతో విడాకుల రూమర్స్ మరింత పెరిగాయి. ధనశ్రీ ఫొటోలను చాహల్ డిలీట్ చేశాడు. ఇప్పుడు ఈ జోడీ అధికారికంగా విడిపోయింది.

నిజ జీవితంలో జరిగిన దాన్నే వీడియోగా రూపొందించారా అనే సందేహం వస్తుంది. యూట్యూబ్ వీడియో సాంగ్ లో ఉన్నట్లు చాహల్ వేరే అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నారేమోనని నెటిజన్లు డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చాహల్.. ఆర్జే మహ్వాశ్ తో క్లోజ్ గా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం