Youtuber Chandu Sai Arrested: రేప్ కేసులో ప్రముఖ యూట్యూబర్ పక్కింటి కుర్రాడు చందు అరెస్ట్
Yotuber Chandu Arrested: పక్కింటి కుర్రాడిగా పాపులర్ అయిన ప్రముఖ యూట్యూబర్ చందు సాయి అరెస్టయ్యాడు. అతనిపై ఏకంగా రేప్ అభియోగాలు నమోదు కావడం గమనార్హం.
Yotuber Chandu Arrested: యూట్యూబ్‌లో పక్కింటి కుర్రాడిగా తెలుగు వాళ్లకు దగ్గరైన ప్రముఖ యూట్యూబర్ చందు సాయి అరెస్టయ్యాడు. హైదరాబాద్ లోని నార్సింగికి చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
చందు సాయి కొంత కాలం కిందట పక్కింటి కుర్రాడు పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆరేళ్లుగా తన ఛానెల్లో ఫన్నీ, సందేశాత్మక వీడియోలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్ కు ఏకంగా 13 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అలాంటి వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.
మొదట తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని, తర్వాత తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఏప్రిల్ 25, 2021న చందు సాయి తనను రేప్ చేశాడని ఆమె తెలిపింది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ అని చెబుతూ తనను ఏమార్చి ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించింది. చందు సాయి పూర్తి పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్.
ఆ యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు చందు సాయితోపాటు దీనికి సంబంధం ఉన్న అతని పేరెంట్స్, మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు. చందు సాయిపై రేప్, చీటింగ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
టాపిక్