Debut Directors : 2022-2023లో తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌లు ఇచ్చిన దర్శకులు వీరే-young telugu movie directors who delivered debut blockbusters in 20222023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Young Telugu Movie Directors Who Delivered Debut Blockbusters In 2022-2023

Debut Directors : 2022-2023లో తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌లు ఇచ్చిన దర్శకులు వీరే

Anand Sai HT Telugu
May 07, 2023 10:33 AM IST

Telugu Debut Directors : తెలుగు ఇండస్ట్రీలో కొత్త కొత్త కథలతో సినిమాలు వస్తున్నాయి. గతేడాది, ఈ ఏడాది కొంతమంది కొత్త దర్శకులు.. మంచి హిట్ సినిమాలు తీశారు. మెుదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది విడుదలైన బలగం(Balagam), దసరా(Dasara), విరూపాక్ష సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అస్సలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు ఇండస్ట్రీ అంతా.. చూసేలా చేశాయి. దసరా, విరూపాక్ష సినిమాలు కాస్త బడ్జెట్ ఎక్కువ అయినా.. మంచి హిట్ సాధించాయి. ఈ మూడు సినిమాలకు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ముగ్గురు దర్శకులకు మెుదటి సినిమానే.

తొలి సినిమాలతో హిట్ కొట్టిన వేణు యెల్దండి, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు గురించి చర్చ నడుస్తోంది. ఈ ముగ్గురే కాదు 2022లో కూడా కొందరు కొత్త దర్శకులు చేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. కొత్త కథలతో వచ్చి.. టాలెండ్ ఉంటే.. గుర్తింపు వస్తుందని నిరూపించారు.

శ్రీ కార్తీక్-ఒకే ఒక జీవితం

శర్వానంద్, రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేసిన చిత్రం ఒకే ఒక జీవితం(Oke Oka Jivitham). ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ తెలుగులో దర్శకుడి పరిచయం అయ్యాడు. తమిళంలో ఇప్పటికే 2 సినిమాలు చేసిన శ్రీ కార్తీక్ కి తెలుగులో మొదటి సినిమా. తెలుగులో తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ కి మదర్ సెంటిమెంట్ ను యాడ్ చేసి తీశాడు.

బింబిసార-మల్లిడి వశిష్ఠుడు

ఇది కూడా టైమ్-ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. కానీ సెటప్ వేరు. కళ్యాణ్ రామ్ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన బింబిసార(Bimbisara) సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. వశిష్ఠుడికి మెుదటి సినిమా. అయినా యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చి హిట్ కొట్టాడు.

మసూద-సాయి కిరణ్

రెగ్యులర్ హారర్స్ లా కాకుండా యూనిక్ సెటప్, డిఫరెంట్ హారర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన సినిమా మసూద(Masooda). హర్రర్ సినిమాను మరోలా చూపించారు. మెుదటి సినిమాకే అందరినీ భయపెట్టి.. హిట్ కొట్టాడు సాయికిరణ్.

రైటప్ పద్మభూషణ్‌-షణ్ముఖ ప్రశాంత్

కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్(Writer Padmabhushan) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు షణ్ముఖ ప్రశాంత్. ఫ్యామిలీ డ్రామా, మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ తో మంచి ఎమోషనల్-కామెడీ డ్రామాతో తొలి హిట్ కొట్టాడు.

బలగం-వేణు యెల్దండి

కమెడియన్ టిల్లుగా, జబర్దస్త్ వేణు(Jabardhasth Venu)గా మన అందరికి తెలిసిన వేణు యెల్దండి(Venu Yeldandi) మెగా ఫోన్ పట్టుకుని బలగం సినిమా(Balagam Cinema)తో దర్శకుడు అయ్యాడు. అసలు వేణు దగ్గర నుంచి ఇలాంటి సినిమా ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. చావు చుట్టు కథ రాస్తూ దానిని చాలా ఎమోషనల్ గా, జనాలకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. వేణు యెల్దండికి హిట్ ఇచ్చారు.

దసరా-శ్రీకాంత్ ఓదెల

బద్దల్ బాషింగల్ ఐతాయి అంటూ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తన తొలి చిత్రం దసరా(Dasara)తో ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. తెలంగాణ యాస, కట్టు, బొట్టు ఈ సినిమాలో నేచురల్ గా చూపించే ప్రయత్నం చేశాడు. నాని కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల(Nani 100 Crore Movie) సినిమా ఇచ్చాడు శ్రీకాంత్.

విరూపాక్ష-కార్తీక్ దండు

విరూపాక్ష(virupaksha)తో హిట్ కొట్టాడు కార్తీక్ దండు. దర్శకుడు సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన విరూపాక్ష సినిమా కార్తీక్ కి మొదటిది. తొలి సినిమాతోనే ఒక మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కార్తీక్.

IPL_Entry_Point

సంబంధిత కథనం