Comedy OTT: ఓటీటీలోకి కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగిబాబు వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Comedy OTT : కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు చట్నీ సాంబార్ పేరుతో ఓ కామెడీ వెబ్‌సిరీస్ చేస్తోన్నాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
Comedy OTT: కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగిబాబు తమిళంతో చట్నీ సాంబార్ పేరుతో ఓ కామెడీ వెబ్‌సిరీస్ చేస్తోన్నాడు. ఈ కామెడీ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆగస్ట్ నెలలో ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో చట్నీ సాంబార్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
అముద కేఫ్ కథ...
అముద కేఫ్ అనే హోటల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్ సాగనున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌లో మేకర్స్ చూపించారు. అముద కేఫ్‌లో సాంబార్ ఫేమస్ అన్నట్లుగా చూపించారు. రోడ్ సైడ్ యోగిబాబు నడిపే ఇడ్లీ బండీలో చట్నీ ఫేమస్. తన చట్నీ రెసిపీ సీక్రెట్ ఎవరికి తెలియకుండా యోగిబాబు జాగ్రత్తపడతాడు.
అముద కేఫ్ కష్టాల్లో ఉండటంతో యోగిబాబుతో హోటల్ ఓనర్ కొడుకులు డీల్ కుదుర్చుకుంటారు. చట్నీ రెసిపీని తమకు చెబితే...తమ హోటల్‌లోని సాంబార్ రెసిపీ గురించి అతడికి వివరిస్తామని అంటారు. ఈ డీల్ కుదిరే క్రమంలో ఎదురైన సంఘనలతో ఫన్నీగా ఈ సిరీస్ సాగనున్నట్లు టీజర్‌లో చూపించారు. పోస్టర్‌లో అము కేఫ్, దా మెస్ అంటూ యోగిబాబుతో పాటు మరో యాక్టర్ కాయన్ చంద్రమౌళిని చూపించారు.
అవార్డు విన్నింగ్ డైరెక్టర్...
చట్నీ సాంబార్ వెబ్‌సిరీస్‌లో యోగిబాబుతో పాటు వాణి భోజన్, నిళల్‌గళ్ రవి, కాయల్ చంద్రమౌళితో పాటు నితిన్ సత్య, మైనా నందిని వంటి సీనియర్ యాక్టర్లు కనిపించబోతున్నారు.
ఈ చట్నీ సాంబార్‌వెబ్‌సిరీస్‌కు తమిళ అవార్డు విన్నింగ్ ఫిలిం మేకర్ రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కామెడీ వెబ్ సిరీస్‌తోనే రాధామోహన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. రాధా మోహన్ దర్శకత్వం వహించిన మోజీ, అభియుమ్ నాన్నుమ్,పయణం సినిమాలు తమిళనాడు స్టేట్ అవార్డులతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యాయి.
అభియుమ్ నాన్నుమ్ సినిమా తెలుగులో ఆకాశమంత పేరుతో డబ్ అయ్యి ఇక్కడ కూడా సక్సెస్‌గా నిలిచింది.తెలుగులో అల్లు శిరీష్‌తో గౌరవం సినిమాను తెరకెక్కించాడు రాధామోహన్. తమిళంతో ప్రకాష్ రాజ్‌తోనే రాధామోహన్ ఎక్కువగా సినిమాలు చేశాడు.
ప్రభాస్ రాజా సాబ్‌తో...
మరోవైపు కోలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోన్న కమెడియన్‌గా యోగిబాబు కొనసాగుతోన్నాడు. ఏడాదిక పదిహేనుకుపైగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దళపతి విజయ్ గోట్, సూర్య కంగువతో పాటు తమిళంలో ఎనిమిదికిపైగా సినిమాల్లో నటిస్తోన్నాడు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న రాజాసాబ్‌తో యోగిబాబు టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇస్తోన్నాడు. షారుఖ్ ఖాన్ జవాన్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు యోగిబాబు