Telugu News  /  Entertainment  /  Yashoda Movie Review Samantha Starrer An Edge Of The Seat Thriller
స‌మంత
స‌మంత

Samantha Yashoda Movie Review: య‌శోద మూవీ రివ్యూ - స‌మంత సినిమా ఎలా ఉందంటే

11 November 2022, 12:27 ISTNelki Naresh Kumar
11 November 2022, 12:27 IST

Samantha Yashoda Movie Review: స‌మంత క‌థానాయిక‌గా లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన య‌శోద సినిమా నేడు (నవంబర్ 11) పాన్‌ ఇండియ‌న్ లెవ‌ల్‌లో భారీ ఎత్తున రిలీజైంది. స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు హ‌రీ, హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Samantha Yashoda Movie Review: బాలీవుడ్‌, కోలీవుడ్‌తో పోలిస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ తెలుగులో త‌క్కువే. ఈ జోన‌ర్‌లో స‌మంత (Samantha) చేసిన తాజా చిత్రం య‌శోద‌. దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత తెలుగులో ఆమె చేసిన స్ట్రెయిట్ సినిమా ఇది. య‌శోద‌ సినిమాకు హ‌రీ, హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించారు. స‌మంత కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న మ‌హిళా ప్ర‌ధాన చిత్ర‌మిది కావ‌డంతో ఈసినిమాపై పాన్ ఇండియ‌న్ స్థాయిలో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో నేడు(నవంబర్ 11) ఈ సినిమా రిలీజైంది. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారిన‌ స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో య‌శోద తెర‌కెక్క‌డంతో ఆరంభం నుంచే య‌శోద‌ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. ట్రైల‌ర్‌, టీజ‌ర్‌ల‌లో స‌మంత ప్రెగ్నెంట్ ఉమెన్‌గా క‌నిపించ‌డంతో ఈ సినిమా కోసం ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఉత్సుక‌త‌గా ఎదురుచూశారు. య‌శోద సినిమాతో స‌మంత పాన్ ఇండియ‌న్ స్థాయిలో అన్ని భాష‌ల్లో హిట్ అందుకుందా లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

Yashoda story -య‌శోద క‌థ‌…

య‌శోద (స‌మంత‌) బ‌స్తీలో నివ‌సించే పేదింటి అమ్మాయి. చెల్లి బృంద (ప్రీతి ఆస్రాని) ఆమె స‌ర్వ‌స్తం. చెల్లి ప్రాణాంత‌క వ్యాధి బారిన ప‌డ‌టంతో ట్రీట్‌మెంట్‌కు డ‌బ్బులు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఆ డ‌బ్బు కోసం స‌రోగ‌సీ ద్వారా త‌ల్లి కావ‌డానికి య‌శోద అంగీక‌రిస్తుంది.ఈవా అనే మోడ్ర‌న్‌ స‌రోగ‌సీ సెంట‌ర్‌లో చేరిన య‌శోద‌కు అక్క‌డ ఏదో త‌ప్పు జ‌రుగుతుంద‌ని అనుమానిస్తుంది.

స‌రోగ‌సీ ముసుగులో ఆ సెంట‌ర్ నిర్వ‌హ‌కురాలు మ‌ధు(వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌), డాక్ట‌ర్ గౌత‌మ్ (ఉన్ని ముకుంద‌న్‌) చేస్తోన్న అకృత్యాల‌ను య‌శోద ఎలా బ‌య‌ట‌పెట్టింది? య‌శోద ఎవ‌రు? ఆ స‌రోగ‌సీ సెంట‌ర్‌లోకి య‌శోద అడుగుపెట్ట‌డానికి కార‌ణం ఏమిటి? మ‌ధుకు సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ గిరిధ‌ర్‌తో ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ట్రైనింగ్ ఆఫీస‌ర్ వాసుదేవ్ అండ్ టీమ్ య‌శోద‌ను కాపాడ‌టానికి ఎందుకు ప్ర‌య‌త్నించార‌న్న‌దే ఈ సినిమా ఇతివృత్తం.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన లేడీ ఓరియెంటెండ్ సినిమా ఇది. స‌రోగ‌సీ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో ఎక్కువ‌గా సినిమాలు రాలేదు. ఈ కొత్త పాయింట్‌ను ఎంచుకుంటూ ద‌ర్శ‌క‌ద్వ‌యం హ‌రిహ‌రీష్ య‌శోద కథ‌ను రాసుకున్నారు. బ్యూటీ క్రీమ్స్‌లో బేబీ ఫీట‌స్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారంటూ గ‌తంలో కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ క‌థ‌నాల్ని బేస్‌గా చేసుకుంటూ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా హ‌రీహ‌రీష్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

స‌రోగ‌సీ ముసుగులో కోట్ల‌లో ఎలా వ్యాపారం జ‌రుగుతోంది? మ‌ధ్య, దిగువ త‌ర‌గ‌తి వ‌ర్గాల ఆర్థిక అవ‌స‌రాల్ని క్యాష్ చేసుకుంటూ వారిని మ‌భ్య‌పెట్టి త‌మ అవ‌స‌రాల కోసం కొంద‌రు ఎలా వాడుకుంటున్నారో థ్రిల్లింగ్‌గా య‌శోద సినిమాలో చూపించారు. యాక్ష‌న్ క‌థ‌కు అక్కాచెల్లెళ్ల అనుబంధంతో పాటు ఇన్వెస్టిగేష‌న్ అంశాల‌ను జోడిస్తూ క‌థ‌, కథ‌నాల్ని అల్లుకున్నారు.

సెకండాఫ్ ట్విస్ట్ అదుర్స్‌...

య‌శోద క‌ష్టాల‌ను చూపిస్తూ సెంటిమెంట్ సీన్స్‌తో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ స‌మ‌స్య‌ల వ‌ల‌యం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స‌రోగ‌సీ ఒప్పుకొని సెంట‌ర్‌కు రావ‌డం, అక్క‌డ ఒక్కో పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ సాఫీగా సినిమా ముందుకు న‌డిపించారు ద‌ర్శ‌కుడు. ఎదుటివారిని ఆట‌ప‌ట్టిస్తూనే వారి క‌ష్టాల్లో తోడుండే అమ్మాయిగా స‌మంత క్యారెక్ట‌ర్‌ను చూపించ‌డం ఆక‌ట్టుకుంటుంది.

ఆ స‌రోగ‌సీ సెంట‌ర్‌లో అక్ర‌మాలు జ‌రుగుతోన్న‌ట్లుగా చూపిస్తూ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మ‌ధు, గౌత‌మ్ క‌లిసి చేసే అన్యాయాల్ని ఒక్కొక్క‌టిగా య‌శోద రివీల్ చేసుకుంటూ వెళ్ల‌డాన్ని ఉత్కంఠ‌భ‌రితంగా ఆవిష్క‌రించారు. క్లైమాక్స్‌లో య‌శోద క్యారెక్ట‌ర్‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్ ఈసినిమాకు హైలైట్‌గా నిలిచింది. య‌శోద ఎందు కోసం అద్బెగ‌ర్భానికి ఒప్పుకుందో, ఆమె ఎవ‌ర‌న్న‌ది ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కు అంద‌కుండా రాసుకున్నారు.

బోరింగ్ ఇన్విస్టిగేష‌న్‌...

య‌శోద కాన్సెప్ట్ బాగున్నా మెడిక‌ల్ ట‌ర్మ్స్ ఎక్కువ‌గా వాడడం కొంత ఇబ్బంది పెడుతుంది. సినిమాలోని మెయిన్ ట్విస్ట్‌ల‌ను ఓపెన్‌గా రివీల్ చేయ‌డం బాగాలేదు. స‌మంత ఇన్వేస్టిగేష‌న్‌లోనే ఆ అంశాలు రివీల్ అయితే బాగుండేది. ఈ క్రైమ్ వెనుక‌ ఉన్న‌ది తామే అంటూ ఎవ‌రికి వారే విల‌న్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా చూపిండం నిరాశ‌ప‌రుస్తుంది. ఫ‌స్ట్ హాఫ్ నెమ్మ‌దిగా సాగుతుంది. ఇన్వేస్టిగేష‌న్ టీమ్ అంటూ శ‌త్రు, సంప‌త్ సీన్స్‌లో ఆస‌క్తి లోపించింది.

స‌మంత హైలైట్‌...

య‌శోద సినిమాకు స‌మంత సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. వ‌న్ ఉమెన్ షోగా ఈ సినిమాను ముందుకు న‌డిపించింది. యాక్ష‌న్ తో పాటు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో ప‌రిణ‌తితో కూడిన యాక్టింగ్ క‌న‌బ‌రిచింది. స‌మంత కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌గా య‌శోద నిలుస్తుంది.

ప్రెగ్నెన్సీ ఉమెన్‌గా, పోరాట యోధురాలిగా చ‌క్క‌టి ఎమోష‌న్స్ ప‌డించింది. మ‌ధుగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ (Varalaxmi sarath kumar) జీవించింది. త‌న స్వార్థం కోసం ఏ ప‌నైనా చేయ‌డానికి సిద్ధ‌ప‌డే క‌న్నింగ్ క్యారెక్ట‌ర్‌లో ఆమె న‌ట‌న బాగుంది. ఉన్ని ముకుంద‌న్ (Unni Mukundan) క్యారెక్ట‌ర్ నెగెటివ్‌, పాజిటివ్ రెండు షేడ్స్‌లో సాగుతుంది. మినిస్ట‌ర్‌గా రావుర‌మేష్ ప్రాస‌లు న‌వ్విస్తాయి. క‌ల్పిక‌గ‌ణేష్‌, దివ్య‌శ్రీపాద క్యారెక్ట‌ర్స్ నిడివి త‌క్కువే అయినా రియ‌లిస్టిక్ యాక్టింగ్‌తో మెప్పించారు.

య‌శోద కోసం హ‌రీ, హ‌రీష్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ప‌ర్‌ఫెక్ట్ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. మ‌ణిశ‌ర్మ (Manisharma) బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ క‌థ‌కు చాలా హెల్ప్ అయ్యింది. సీన్‌లోని ఇంటెన్సిటీని చాలా వ‌ర‌కు మ్యూజిక్‌తో క్యారీ చేశారు. డైలాగ్స్ బాగున్నాయి.

Yashoda Final verdict డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌-

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని య‌శోద పూర్తిస్థాయిలో సంతృప్తి ప‌రుస్తుంది. స‌మంత కెరీర్ డిఫ‌రెంట్ మూవీగా ఈ సినిమాను చెప్ప‌వ‌చ్చు.

రేటింగ్: 3/ 5