Toxic Yash First Look Teaser: స్వాగ్‍తో అదరగొట్టిన యశ్.. రాకింగ్ లుక్.. కేజీఎఫ్ స్టార్ మూవీ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్
Toxic Yash First Look Teaser: యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వీడియో వచ్చేసింది. స్వాగ్‍తో అదరగొట్టారు రాకింగ్ స్టార్. యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్‍ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ఎలా ఉందో చూడండి.
కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యశ్‍కు కేజీఎఫ్ 1,2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‍లో ఎంతో క్రేజ్ వచ్చింది. విపరీతమైన పాపులారిటీ దక్కింది. కేజీఎఫ్ 2తో ఏకంగా రూ.1,200 కోట్ల మార్క్ కూడా సాధించారు. కాస్త గ్యాప్ తీసుకొని ఆయన ప్రస్తుతం 'టాక్సిక్' చిత్రం చేస్తున్నారు. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు (జనవరి 8) యశ్ పుట్టిన రోజు సందర్భంగా టాక్సిక్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అయింది.
స్వాగ్, స్టైల్ అదిరింది
టాక్సిక్: బర్త్‌డే పీక్ అంటూ యశ్ ఫస్ట్ లుక్ వీడియోను మూవీ టీమ్ నేడు రివీల్ చేసింది. ముందుగా ఓ వింటేజ్ కారులో ఓ పబ్ ముందు వైట్ సూట్ ధరించిన యశ్ దిగుతారు. లైటర్‌తో స్టైలిష్‍గా చుట్ట వెలిగించుకుంటారు. పబ్‍లో గ్లామరస్ డ్యాన్సులు జరుగుతుంటాయి. చుట్టు కాలుస్తూ స్టైలిష్ వాక్, ఇంటెన్స్ లుక్‍తో వస్తారు యశ్. ఓ అమ్మాయిపై బీర్ పోస్తూ రొమాన్స్ చేస్తారు.
టాక్సిక్ బర్త్‌డే పీక్ వీడియోలో వైట్ సూట్, హ్యాట్, నోట్లో చుట్టతో ఫుల్ స్వాగ్‍తో యశ్ అదరగొట్టారు. స్టైలిష్ లుక్‍తో ఆకట్టుకున్నారు. ఈ లుక్ చూస్తుంటే పీరియడ్ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
యశ్ లుక్‍తో అభిమానులు వావ్ అంటున్నారు. మళ్లీ కేజీఎఫ్ రేంజ్ యాక్షన్ మూవీ పక్కా అంటూ సంబరపడుతున్నారు. యశ్ స్వాగ్, స్టైల్ మరోసారి అదిరిపోయేలా ఉందని సంబరపడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో రూ.వెయ్యి కోట్ల మూవీ లోడింగ్ అంటూ అప్పుడే కొందరు పోస్టులు చేస్తున్నారు. కొందరు ఇది కేజీఎఫ్ 3లా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
టాక్సిక్ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‍స్టర్ మైండ్స్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కే నారాయణ, యశ్ కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు నేషనల్ అవార్డ్ విన్నర్ గీతూ మోహన్ దాస్.
రిలీజ్ ఎప్పుడో!
టాక్సిక్ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అయితే, రిలీజ్ వాయిదా పడుతుందనే ఇటీవలే వెల్లడించింది. అయితే, ఇప్పుడు తీసుకొచ్చి ఈ ఫస్ట్ లుక్ టీజర్లో కూడా రిలీజ్ గురించి మూవీ టీమ్ ప్రస్తావించలేదు. నెలను చెప్పలేదు. దీంతో ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడో అనే సందిగ్ధత నెలకొంది.