Happy Ending: 3000 ఏళ్ల నాటి కాన్సెప్టుతో హ్యాపీ ఎండింగ్.. దాని చుట్టూ తిరిగే కథ.. క్లైమాక్స్ 15 నిమిషాలు అలా!-yash puri comments on happy ending movie story and its 3000 years back concept happy ending released on february 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Happy Ending: 3000 ఏళ్ల నాటి కాన్సెప్టుతో హ్యాపీ ఎండింగ్.. దాని చుట్టూ తిరిగే కథ.. క్లైమాక్స్ 15 నిమిషాలు అలా!

Happy Ending: 3000 ఏళ్ల నాటి కాన్సెప్టుతో హ్యాపీ ఎండింగ్.. దాని చుట్టూ తిరిగే కథ.. క్లైమాక్స్ 15 నిమిషాలు అలా!

Sanjiv Kumar HT Telugu
Feb 01, 2024 08:20 AM IST

Yash Puri About Happy Ending Movie: రొమాంటిక్ కామెడీ జోనర్‌లో వస్తోన్న సరికొత్త మూవీ హ్యాపీ ఎండింగ్. ఈ మూవీలో యష్ పూరి హీరోగా నటిస్తున్నాడు. అయితే హ్యాపీ ఎండింగ్ మూవీ రిలీజ్ నేపథ్యంలో తాజాగా యష్ పూరి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో హ్యాపీ ఎండింగ్ స్టోరీ, కాన్సెప్ట్ చెప్పాడు.

3000 ఏళ్ల నాటి కాన్సెప్టుతో హ్యాపీ ఎండింగ్.. దాని చుట్టూ తిరిగే కథ.. క్లైమాక్స్ 15 నిమిషాలు అలా!
3000 ఏళ్ల నాటి కాన్సెప్టుతో హ్యాపీ ఎండింగ్.. దాని చుట్టూ తిరిగే కథ.. క్లైమాక్స్ 15 నిమిషాలు అలా!

Yash Puri Happy Ending Movie Story: "చెప్పాలని ఉంది", "అలాంటి సిత్రాలు", "శాకుంతలం" వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో యష్ పూరి. తాజాగా యష్ పూరి హీరోగా నటించిన మూవీ "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్‌గా నటించింది. హ్యాపీ ఎండింగ్ సినిమాను హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. దీనికి కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోన్న సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యష్ పూరి ఆసక్తిర విషయాలు చెప్పాడు.

yearly horoscope entry point

"మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ "హ్యాపీ ఎండింగ్" కథను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం. సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్టర్ శాపంతో ఇబ్బందులు పడినా.. ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు" అని యష్ పూరి తెలిపాడు.

"ఈ సినిమాలో ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కొత్త వేలో కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్, మ్యూజిక్, డీవోపీ వర్క్.. ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ ప్రతిభ హ్యాపీ ఎండింగ్ సినిమాలో చూస్తారు. సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు. చాలా మంది తమ ప్రమోషన్స్‌లో బిగినింగ్ మిస్ అవ్వొద్దు, క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు అంటారు. కానీ, ఈ సినిమాలో నిజంగానే బిగినింగ్, ఇంటర్వెల్ ఎంత ముఖ్యమో క్లైమాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్‌గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు మా డైరెక్టర్. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. నేను ట్రైలర్ రిలీజ్ రోజే చెప్పాను మా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని. టీమ్ అంతా అదే నమ్మకంతో ఉన్నాం" అని యష్ అన్నాడు.

"మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్‌కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా హ్యాపీ ఎండింగ్. శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్‌లో చూపించాం. కానీ మా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. ఉంటే యూఏ సర్టిఫికెట్ రాదు. నేను యు సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నా. యుఏ ఇచ్చారు. సో పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. నాలాంటి న్యూ హీరోకు యంగ్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయాలంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని చెప్పగలను" అని యష్ పూరి పేర్కొన్నాడు.

"వాలెంటైన్స్ డే జరిగే వారంలో మా సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నాం. లవ్‌ను మేము కొత్తగా సెలబ్రేట్ చేస్తున్నాం. పొయెటిక్, అండర్ స్టాండింగ్, స్పిరిచువల్ లవ్ ఉంటుంది. అది థియేటర్స్‌లో చూడండి. మనం ఏదైనా విషయాన్ని ఓపెన్‌గా చెబితే దాన్ని బోల్డ్ అనొచ్చు. అంతే గానీ అది ఫిజికల్‌గా చూపించడం కాదు. శాపం అనేది లేకుంటే ఈ సినిమా కథ ప్రారంభం కాదు. ఒక యువకుడి ఫీలింగ్స్ బయటకు రాకుండా మనసులోనే ఉండిపోతే అతను ఎలా ఉంటాడు అనేది మా సినిమాలో హీరో హర్ష్ క్యారెక్టర్" అని యష్ చెప్పుకొచ్చాడు.

Whats_app_banner