Happy Ending OTT: ఓటీటీలోకి తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌-yash puri apoorva rao happy ending movie will be premiere on aha ott from may 3rd tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Happy Ending Ott: ఓటీటీలోకి తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

Happy Ending OTT: ఓటీటీలోకి తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2024 06:04 AM IST

Happy Ending OTT: య‌శ్ పూరి, అపూర్వ రావ్ జంట‌గా న‌టించిన తెలుగు కామెడీ మూవీ హ్యాపీ ఎండింగ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మే 3 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

హ్యాపీ ఎండింగ్ ఓటీటీ
హ్యాపీ ఎండింగ్ ఓటీటీ

Happy Ending OTT: య‌శ్ పూరి, అపూర్వ రావ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ హ్యాపీ ఎండింగ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతోంది .

ఆహా ఓటీటీలో...

మే 3 నుంచి ఆహా ఓటీటీలో హ్యాపీ ఎండింగ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ కామెడీ మూవీ రిలీజ్ డేట్‌ను ఆహా ఓటీటీ ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. మూవీ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

పురాణాల్లోని శాపాలు...

హ్యాపీ ఎండింగ్ మూవీకికి కౌశిక్ భీమిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్‌కు ల‌వ్ స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు.ఒక‌ప్పుడు ఉన్న శాపాలు ఈ ఆధునిక యుగంలో కొన‌సాగితే ఎలా ఉంటుంద‌నే ఐడియా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ మూవీని రూపొందించారు. టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌లో అడ‌ల్ట్ కామెడీని ఎక్కువ‌గా చూపించ‌డంలో రిలీజ్‌కు ముందు ఈ చిన్న సినిమా యూత్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కాన్సెప్ట్‌ బాగున్నా, కామెడీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం, ల‌వ్‌స్టోరీ రొటీన్ కావ‌డంతో హ్యాపీ ఎండింగ్ మూవీ పెద్ద‌గా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

హ్యాపీ ఎండింగ్ క‌థ ఇదే...

హ‌ర్ష్ ఓ మేక‌ప్ ఆర్టిస్ట్‌. ఓ రోజు బోల్డ్ మూవీ చూడ‌టానికి సీక్రెట్‌గా థియేట‌ర్‌కు వ‌చ్చిన ర‌ధేశ్వ‌ర్ స్వామిజీకి (అజ‌య్ ఘోష్‌) హ‌ర్ష్ (య‌శ్ పూరి) కార‌ణంగా అవ‌మానం జ‌రుగుతుంది. హ‌ర్ష్‌పై కోపంతో అత‌డు ఏ అమ్మాయిని త‌ల‌చుకున్నా ఆమె చ‌నిపోవాల‌ని స్వామిజీ శాపం పెడ‌తాడు. ఆ శాపం కార‌ణంగా హ‌ర్ష్ ఎలాంటి క‌ష్టాలు ఎదుర్కొన్నాడు? అత‌డి జీవితంలోకి అవ‌ని (అపూర్వ రావ్‌) ఎలా వ‌చ్చింది? అవ‌నిని ప్రేమించిన హ‌ర్ష్ ఆమెను ప్రాణాల‌తో ఎలా కాపాడుకున్నాడు అన్న‌దే హ్యాపీ ఎండింగ్ మూవీ క‌థ‌.

న్యూ ఎజ్ ల‌వ్ స్టోరీ...

హ్యాపీ ఎండింగ్ మూవీలో అజ‌య్ ఘోష్‌, ఝాన్సీ, అనితా చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు. అపూర్వ రావ్ హీరోయిన్‌గా ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ ప‌తాకాల‌పై యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల హ్యాపీ ఎండింగ్ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ర‌వి నిడ‌మ‌ర్తి మ్యూజిక్ అందించాడు.

స‌మంత శాకుంత‌లంలో...

హ్యాపీ ఎండింగ్ కంటే ముందు తెలుగులో అలాంటి సిత్రాలు, చెప్పాల‌ని ఉంది సినిమాల్లో హీరోగా క‌నిపించాడు య‌శ్ పూరి. స‌మంత శాకుంత‌లం మూవీలో ఓ కీల‌క పాత్ర చేశాడు. హ్యాపీ ఎండింగ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అపూర్వ రావ్ త‌మిళంలో జీవీ ప్ర‌కాష్ కుమార్‌తో క‌లిసి ఓ మ్యూజిక్ వీడియో చేసింది. తీన్‌కిరాయ్ పేరుతో త‌మిళంలో ఓ థ్రిల్ల‌ర్ సినిమా చేసింది.

IPL_Entry_Point

టాపిక్