Yash Next Movie: యశ్ నెక్స్ట్ సినిమాకు అవతార్ స్టంట్‌ కొరియోగ్రాఫర్ - జోన‌ర్ ఇదే-yash next movie update yash 19th movie likely to be announcement on january 8 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Yash Next Movie Update Yash 19th Movie Likely To Be Announcement On January 8

Yash Next Movie: యశ్ నెక్స్ట్ సినిమాకు అవతార్ స్టంట్‌ కొరియోగ్రాఫర్ - జోన‌ర్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Jan 07, 2023 12:35 PM IST

Yash Next Movie: కేజీఎఫ్ -2 త‌ర్వాత య‌శ్ నెక్స్ట్ సినిమా ఏమిట‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. య‌శ్ 19వ సినిమాను అత‌డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

య‌శ్
య‌శ్

Yash Next Movie: కేజీఎఫ్‌-2 త‌ర్వాత య‌శ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ -2 రిలీజై దాదాపు ఎనిమిది నెల‌లు దాటినా త‌దుప‌రి సినిమాపై ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ రాలేదు. య‌శ్ 19వ సినిమాకు ద‌ర్శ‌కుడిగా వివిధ భాష‌ల‌కు చెందిన స్టార్ డైరెక్ట‌ర్ల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. ఈ ప్ర‌శ్న‌ల‌కు య‌శ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న స‌మాధానం దొరికే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

య‌శ్ 19వ సినిమాను జ‌న‌వ‌రి 8న అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ద‌ర్శ‌కుడి పేరును కూడా అదే రోజు రివీల్ చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు సాండ‌ల్‌వుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా య‌శ్ 19వ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో య‌శ్ కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలిసింది. కేజీఎఫ్‌కు భిన్నంగా య‌శ్ క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ 19వ సినిమా కోసం య‌శ్ స్పెష‌ల్‌గా హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ జేజే పెర్రీ సార‌థ్యంలో ఫారిన్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అవతార్‌తో పాటు ప‌లు హాలీవుడ్ సినిమాల‌కు జేజే పెర్రీ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాడు. ఈ సినిమా కూడా హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లోనే ఉంటుంద‌ని అంటున్నారు. మేకింగ్ విష‌యంలో ఎక్క‌డ రాజీ ప‌డ‌కుండా పాన్ ఇండియ‌న్ లెవెల్‌గా భారీగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. య‌శ్ 19వ సిన‌మాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త ఏడాది ఏప్రిల్‌లో విడుద‌లైన కేజీఎఫ్ -2 దాదాపు 1200 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో య‌శ్ యాక్టింగ్‌, హీరోయిజం, ఎలివేష‌న్ సీన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

కేజీఎఫ్ సిరీస్‌లో మూడో భాగాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు య‌శ్‌, ప్ర‌శాంత్ నీల్ అనౌన్స్ చేశారు. య‌శ్ 19వ సినిమా త‌ర్వాత కేజీఎఫ్‌-3ని సెట్స్‌పైకి తీసుకొచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

టాపిక్