OTT Comedy Thriller: ఓటీటీలో తెలుగులోనూ డైరెక్ట్ స్ట్రీమింగ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Comedy Thriller: ధూమ్ ధామ్ చిత్రం ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా నాలుగు భాషల్లో ఉంది.

బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ, హీరోయిన్ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన ధూమ్ ధామ్ చిత్రంపై ముందు నుంచి క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో రూపొందిన ధూమ్ ధామ్ చిత్రం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ వీకెండ్ చూసేందుకు మంచి ఆప్షన్‍గా ఉంది. ఆ వివరాలు ఇవే..
నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
ధూమ్ ధామ్ చిత్రం తాజాగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో కాకుండా ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
ధూమ్ ధామ్ టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు తెలుగు వెర్షన్ గురించి మేకర్స్ చెప్పలేదు. ప్రమోషన్ కంటెంట్ అంతా హిందీలోనే వచ్చింది. అయితే, ఈ మూవీని మాత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళం, ఇంగ్లిష్ డబ్బింగ్ వెర్షన్‍లలోనూ అందుబాటులోకి తెచ్చారు.
రెస్పాన్స్ ఇలా..
ధూమ్ ధామ్ మూవీని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసిన కొందరు నెటిజన్లు.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అక్కడక్కడా కామెడీ ఆకట్టుకున్నా.. అనుకున్నంత రేంజ్‍లో ఫన్ లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. యామీ గౌతమ్, ప్రతీక్ గాంధీ యాక్టింగ్‍కు ప్రశంసలు దక్కుతున్నాయి. కొన్ని సీన్లు ఆకట్టుకున్నాయంటూ కొందరు నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఓసారి ధూమ్ ధామ్ చిత్రాన్ని చూసేయవచ్చు అంటూ మరికొందరు పోస్టులు చేశారు.
ధూమ్ ధామ్ చిత్రంలో ప్రతీక్, యామీ గౌతమ్‍తో పాటు ఇజాజ్ ఖాన్, పవిత్రా సర్కార్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రిషబ్ సేథ్ దర్శకత్వం వహించారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. పెళ్లి రోజు రాత్రి జరిగే అనుకోని అనూహ్య ఘటనల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. రౌడీలు, పోలీసులు.. కొత్త జంటను కొత్త జంటను చేజ్ చేస్తారు. దీనివెనుక ఓ మిస్టరీ ఉంటుంది. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ఈ చిత్రం నడుస్తుంది.
కాదలిక్క నేరమిళ్లై స్ట్రీమింగ్
రవి మోహన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఈ వారమే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. జనవరిలో థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పుడు నెలలోగానే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీకి కృతుంగ ఉదయనిధి దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం