OTT Action Comedy: డైరెక్ట్‌గా ఓటీటీలోకే నయా కామెడీ యాక్షన్ మూవీ.. విభిన్నంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్-yami gautham dhoom dhaam film will be streaming on netflix ott soon announcement out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Comedy: డైరెక్ట్‌గా ఓటీటీలోకే నయా కామెడీ యాక్షన్ మూవీ.. విభిన్నంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్

OTT Action Comedy: డైరెక్ట్‌గా ఓటీటీలోకే నయా కామెడీ యాక్షన్ మూవీ.. విభిన్నంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్

OTT Action Comedy: ఓ నయా బాలీవుడ్ చిత్రంపై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. విభిన్నంగా ఈ పోస్టర్ ఉంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

OTT Action Comedy: డైరెక్ట్‌గా ఓటీటీలోకే నయా కామెడీ యాక్షన్ మూవీ.. విభిన్నంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్

బాలీవుడ్ స్టార్ నటి యామీ గౌతమ్, యంగ్ యాక్టర్ ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో ‘ధూమ్ ధామ్’ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. రిషబ్ సేత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. యామీ భర్త ఆదిత్య ధార్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ ధూమ్ ధామ్ చిత్రం నేరుగా ఓటీటీలోకే రానుంది. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ నేడు (జనవరి 19) వచ్చేసింది.

వెరైటీగా అనౌన్స్‌మెంట్ పోస్టర్

ధూమ్ ధామ్ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ రివీల్ అయింది. న్యూస్‍ పేపర్లో పెళ్లి ప్రకటనలా ఈ పోస్టర్ ఉంది.ఈ చిత్రంలో ప్రతీక్, యామీ వధూవరుల్లా ఉన్నారు. ఈ మూవీలో ముంబైకు చెందిన కోయల్ చద్దా పాత్ర చేస్తున్నారు యామీ గౌతమ్. పశువుల డాక్టర్ వీర్ క్యారెక్టర్ చేస్తున్నారు ప్రతీక్. వీరిద్దరూ జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్టుగా యాడ్‍తో ధూమ్ ధామ్ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ ఉంది. సాధారణంగా కాకుండా ఇలా విభిన్నంగా ఉన్న ఈ అనౌన్స్‌మెంట్ ఆకట్టుకుంటోంది.

ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే

ధూమ్ ధామ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో కాకుండా ఈ మూవీ నేరుగా ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఇంకా స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించలేదు. ఇప్పటికి ఈ మూవీని అధికారికంగా అనౌన్స్ చేసింది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్‍కు తేవొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ధూమ్ ధామ్ చిత్రాన్ని కామెడీ, యాక్షన్, రొమాన్స్ అంశాలతో డైరెక్టర్ రిషబ్ సేత్ తెరకెక్కిస్తున్నారు. కోయల్ (యామీ గౌతమ్), వీర్ (ప్రతీక్) పాత్రల చూట్టూ ఈ మూవీ సాగనుంది. ఈ చిత్రాన్ని ఆదిత్య ధార్‌తో పాటు లోకేశ్ ధార్, జ్యోతి దేశ్‍పాండే, పుణీత్ వాదన్ నిర్మిస్తున్నారు. కేశవ్ ధార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

గతేడాది సూపర్ హిట్

యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో గతేడాది వచ్చిన ఆర్టికల్ 370 సినిమా బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రం సుమారు రూ.110కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ మంచి కలెక్షన్లతో దుమ్మురేపింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం రిలీజైంది. జుమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తేసిన సమయంలో పరిణామాలు, జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీకి ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించారు. గతేడాది మేలో పండంటి బాబుకు జన్మనిచ్చారు యామీ.

సంబంధిత కథనం