మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా యమదొంగ. 2007 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌కు హీరోయిన్ ప్రియమణి జోడీగా నటించింది.
మరో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ మమతా మోహన్‌దాస్ అలరించింది. అంతేకాకుండా స్పెషల్ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ రంభ అలరించింది. వీరితోపాటు నవ్‌నీత్ కౌర్, అర్చన, ప్రీతి జంగ్యాని వంటి బ్యూటిఫుల్స్ మరో పాటలో నర్తించి ఆకట్టుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యముడు పాత్రలో అదరగొట్టారు. యముడికి భార్యగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సైతం అలరించారు.
ఇలా ఎంతోమంది విశేష నటీనటులతో యమదొంగ సినిమాను చిత్రీకరించారు. 2007 ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ యమదొంగ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా తారక్ పుట్టినరోజు వేడుకలు, సంబురాలను కొన్ని రోజుల ముందు నుంచే ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇవాళ (మే 18) యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ కోసం మూవీ టీమ్ చాలానే కష్టపడింది. యమదొంగ సినిమాను 8Kలో స్కాన్ చేసి 4Kకి కుదించి మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన దృశ్య అనుభవాన్ని కలిగించేలా రెడీ చేశారు.
అభిమానులు ఇప్పుడు ఈ సినిమాటిక్ అద్భుతాన్ని మరింత నాణ్యతతో థియేటర్లలో వీక్షించవచ్చు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ‘యమదొంగ’ రీ రిలీజ్‌ను మరింత స్పెషల్‌గా మార్చారు. దీంతో ప్రస్తుతం ‘యమదొంగ’ రీ రిలీజ్ సందడి సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తూ ఉంది.
యమదొంగ రీ రిలీజ్‌లో భాగంగా ప్రధాన నటీమణులు ప్రియమణి, మమతా మోహన్‌దాస్ ఇటీవల తమ ఆలోచనలను, షూటింగ్ చేసిన రోజుల్ని తలుచుకుంటూ, ఆ జ్ఞాపకాలను పంచుకుంటూ వదిలిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి.
‘యమదొంగ’ రీ రిలీజ్‌తో రాజమౌళి విజన్, ఎంఎం కీరవాణి సంగీతాన్ని మరోసారి తెరపై అందరూ వీక్షించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘యమదొంగ’ మూవీని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం