Social Thriller OTT: ఓటీటీలోకి వచ్చిన రామ్‌గోపాల్ వర్మ హీరోయిన్ థ్రిల్లర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది
Social Thriller OTT: లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ యజ్ఞ శెట్టి హీరోయిన్‌గా నటించిన యాక్ట్ 1978 మూవీ ఓటీటీలోకి వచ్చింది. సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Social Thriller OTT: రామ్‌గోపాల్ వర్మ రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో లక్ష్మి పార్వతి పాత్రలో నటించింది కన్నడ హీరోయిన్ యజ్ఞ శెట్టి. ఈ మూవీలో తన నాచురల్ యాక్టింగ్‌తో లక్ష్మి పార్వతి పాత్రకు ప్రాణం పోసింది. యజ్ఞ శెట్టి హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ యాక్ట్ 1978 ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిలింఫేర్‌తో పాటు పలు అవార్డులను అందుకున్నది.
యాక్ట్ 1978 మూవీ...
యాక్ట్ 1978 మూవీకి మంజునాథ సోమకేశవ రెడ్డి దర్శకత్వం దర్శకత్వం వహించారు. ఇందులో సంచారీ విజయ్, శృతి, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. 2020లో థియేటర్లలో రిలీజైన యాక్ట్ 1978 మూవీ నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం. కొవిడ్ పాండమిక్ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో థియేటర్లలో విడుదలైన తొలి సినిమాగా యాక్ట్ 1978 నిలిచింది.
ప్రభుత్వం అధికారుల్లోని లంచగొండితనం, అవినీతిని ప్రశ్నిస్తూ సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో యజ్ఞ శెట్టి అసమాన న టనను కనబరిచింది. ఆ ఏడాది కన్నడంలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నది. కథ, కథనాలతో పాటు దర్శకుడు క్లైమాక్స్‌ను ముగించిన తీరుకు ప్రశంసలు దక్నాయి.
యాక్ట్ 1978 కథ ఇదే...
గీత (యజ్ఞ శెట్టి) భర్త చనిపోతాడు. వితంతువు అయిన ఆమెకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుంది. సాయం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతుంది. తన కష్టాలను వినిపించేందుకు ప్రయత్నించిన ఎవరూ పట్టించుకోరు. లంచం ఇస్తేనే నష్టపరిహారం రిలీజ్ చేస్తామని ఆఫీసర్లు డిమాండ్ చేస్తారు.
దాంతో ఆ ప్రభుత్వ అధికారులకు బుద్ది చెప్పాలని భావించిన గీత బాంబు ధరించి గవర్నమెంట్ ఆఫీస్‌ను హైజాక్ చేస్తుంది. అధికారులను బందీలుగా చేస్తుంది. ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ విధిస్తుంది? అవేమిటి? ఆమెను పట్టుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? తన లక్ష్యాన్ని గీత సాధించిందా లేదా అన్నదే ఈ మూవీ కథ.
కిల్లింగ్ వీరప్పన్...
యజ్ఞ శెట్టి కన్నడంలో పదిహేడేళ్ల కెరీర్‌లో కేవలం 20 సినిమాలు మాత్రమే చేసింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కిల్లింగ్ వీరప్పన్‌లో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో కనిపించింది. గ్లామర్‌కు దూరంగా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో మాత్రమే కనిపించింది. తెలుగులోనూ లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో పాటు ఆపరేషన్ 2019 సినిమాలు చేసింది. యాక్ట్ 1978 తర్వాత సినిమాలకు దూరమైంది యజ్ఞ శెట్టి.