మంచు విష్ణు నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ మూవీ కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, శివరాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి అగ్ర తారలు నటించారు.
వీరితోపాటు కన్నప్ప సినిమాలో పిలక-గిలక అనే పాత్రల్లో కమెడియన్స్ బ్రహ్మానందం, సప్తగిరి యాక్ట్ చేశారు. అయితే, ఇదే కన్నప్ప మూవీపై బ్రహ్మాణ సంఘాలు ఆగ్రహానికి గురవడానికి కారణం అయింది. బ్రహ్మణులను కించపరచడానికే అలాంటి హాస్య పాత్రలు రూపొందించారని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ వివాదంపై కన్నప్ప మూవీ రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ స్పందించారు. "నేను ఒక బ్రహ్మణుడిని. కన్నప్ప మూవీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కూడా నార్ ఇండియాకు చెందిన బ్రాహ్మణుడే. బ్రహ్మణులును కానీ ఇతర వేరే కమ్యునిటీ వాళ్లను గానీ కన్నప్ప సినిమాలోని ఏ ఒక్క సీన్ కించపరచేవిధంగా లేదు" అని ఆకెళ్ల శివ ప్రసాద్ తెలిపారు.
అయితే, ఇదివరకు కన్నప్ప స్టోరీని ఆలయ పూజారులు నెగెటివ్‌గా తీసుకున్నారుని, కానీ, ఈ సినిమాను వేరే విధంగా మలిచామని రేటర్ శివ ప్రసాద్ పేర్కొన్నారు. "మోహన్ బాబు పోషించిన మహాదేవ శాస్త్రి పాత్రను చాలా గౌరవంగా, భక్తితో చిత్రీకరించారం. దాన్ని 16వ శతాబ్దపు కవి ధూర్జటి రాసిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం నుంచి ప్రేరణ పొంది తీశాం" అని ఆయన వెల్లడించారు.
"ఇంకా చెప్పాలంటే కన్నప్ప సినిమాను శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన పూజారులకు స్పెషల్‌గా ప్రదర్శించాం. కన్నప్ప చూసిన వారు సినిమాను అభినందించారు. అలాగే మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరికి ఆశీర్వాదాలు అందించారు" అని చెప్పుకొచ్చారు రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్.
"కన్నప్ప గీత రచయిత రామజోగయ్య శాస్త్రితో సహా చాలా మంది బ్రాహ్మణులు కన్నప్ప సినిమాలో వివిధ భాగాల్లో పని చేశారు. ఏ ఒక్క కమ్యునిటీని కించపరచడానికి ఎవరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, సంవత్సరాలు కష్టపడరు. ఈ రూమర్స్ అన్ని నిరాధారమైనవి. సినిమా చూశాకే మీకే తెలుస్తుంది" అని డైలాగ్ రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ వెల్లడించారు.
ఇక ఇదిలా ఉంటే, కన్నప్ప మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. కన్నప్ప ట్రైలర్ చూశాక సినిమాపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. దాంతో కన్నప్ప మూవీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా కన్నప్ప మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేసింది.
సంబంధిత కథనం
టాపిక్