OTT Women's day Web Series to watch: ఓటీటీలో ప్రతి మహిళా కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇవే..-womens day best female lead web series to watch on netflix prime video sony liv jiohotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Women's Day Web Series To Watch: ఓటీటీలో ప్రతి మహిళా కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇవే..

OTT Women's day Web Series to watch: ఓటీటీలో ప్రతి మహిళా కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇవే..

Hari Prasad S HT Telugu

OTT Women's day Web Series to watch: వుమెన్స్ డే 2025 వచ్చేస్తోంది. ఈ వీకెండ్ ఓటీటీలో ప్రతి మహిళా చూడాల్సిన వెబ్ సిరీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి. మహిళా సాధికారతకు అద్దం పట్టే సిరీస్ ఇవి.

ఓటీటీలో ప్రతి మహిళా కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇవే..

OTT Women's day Web Series to watch: ఓటీటీ వచ్చిన తర్వాత ఎన్నో జానర్ల వెబ్ సిరీస్ వచ్చాయి. వాటిలో కొన్ని మహిళలే లీడ్ రోల్స్ గా చేసినవీ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వాటిని చూడొచ్చు. ఈ శనివారం (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీటిని మిస్ కాకుండా చూడండి.

మహారాణి - సోనీలివ్ ఓటీటీ

ఆడది అంటే వంటింటికే పరిమితమయ్యే వ్యక్తి కాదు.. తలుచుకుంటే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఏలుతుందని చాటి చెప్పే వెబ్ సిరీస్ మహారాణి. 1990లనాటి బీహార్ రాజకీయాలను ఆధారంగా చేసుకొని ఈ సిరీస్ తెరకెక్కించారు. సోనీలివ్ ఓటీటీలో ఇప్పటికే మూడు సీజన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. రాణి భారతి అనే శక్తివంతమైన ఓ సీఎం పాత్రలో హుమా ఖురేషీ నటించిన ఈ సిరీస్ మహిళా సాధికారతకు అద్దం పట్టేదే.

ఆర్య - జియోహాట్‌స్టార్ ఓటీటీ

ప్రముఖ నటి సుష్మితా సేన్ నటించిన వెబ్ సిరీస్ ఆర్య. ఓ సాధారణ గృహిణి.. పవర్ పుల్ డ్రగ్స్ మాఫియా నుంచి తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. సుష్మిత సివంగిలా నటించిన ఈ సిరీస్ ప్రతి మహిళలో స్ఫూర్తి నింపుతుందనడంలో సందేహం లేదు.

ఢిల్లీ క్రైమ్ - నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఢిల్లీ క్రైమ్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. క్రూరమైన నేరాలను పరిష్కరించే ఓ శక్తివంతమైన లేడీ పోలీస్ ఆఫీసర్ ను ఈ సిరీస్ లో చూడొచ్చు. షెఫాలీ షా నటించిన వెబ్ సిరీస్ ఇది. రెండు సీజన్లు అందుబాటులో ఉంది. తొలి సీజన్లో ఢిల్లీ నిర్భయ లాంటి కేసు, రెండో సీజన్లో కచ్చా బనియన్ క్రైమ్ కేసు గురించి చూపించారు.

స్కూప్ - నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్కూప్ ఓ మహిళా క్రైమ్ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. సాధారణంగా క్రైమ్ రిపోర్టింగ్ అంటే మగవాళ్ల ఆధిపత్యం ఉండే ఫీల్డ్. అలాంటి దాంట్లో ఓ మహిళా జర్నలిస్ట్ ఎలా తన ఉనికిని చాటుకుందన్నది ఈ స్కూప్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 - ప్రైమ్ వీడియో

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా రాజీ అనే ఓ మహిళా తీవ్రవాది చుట్టూ తిరుగుతుంది. సమంత ఈ శక్తివంతమైన రాజీ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. సమంతే నటించిన మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటడెల్ హనీ బన్నీ కూడా ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కోడ్ ఎం - జీ5 ఓటీటీ

కోడ్ ఎం జీ5 ఓటీటీలో ఉన్న వెబ్ సిరీస్. ఓ యువ మహిళా ఆర్మీ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ ఇది. మగాళ్ల ఆధిపత్యం ఉండే ఆర్మీలో శారీరకంగా, మానసికంగా దృఢంగా మారి తనను తాను నిరూపించుకోవడానికి ఆ మహిళా అధికారి పడే తపనను ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం