OTT Horror Thriller: తెలుగులో మరో ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ హారర్ థ్రిల్లర్ చిత్రం.. అదిరిపోయే ట్విస్టులతో సాగే సినిమా
OTT Horror Thriller: స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రం మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, బోల్డ్ సీన్లతో ఈ సినిమా ఉంటుంది.
హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం స్ట్రేంజ్ డార్లింగ్ గతేడాది 2024 ఆగస్టు 23వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ హాలీవుడ్ మూవీకి మంచి రివ్యూలు, రెస్పాన్స్ వచ్చాయి. ఈ చిత్రంలో విల్లా ఫిజ్‍గెరాల్డ్, కైల్ గాల్నెర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి జేటీ మొల్నెర్ దర్శకత్వం వహించారు. స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రం ఇప్పుడు ఇండియాలో మరో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

స్ట్రీమింగ్ ఎక్కడ..
స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రం జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హాలీవుడ్ మూవీ ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. జియోసినిమా ప్రీమియమ్ సబ్‍స్క్రైబర్లు ఈ మూవీని చూసేయవచ్చు. స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.
థ్రిల్లింగ్ ట్విస్టులు.. బోల్డ్ సీన్లు
స్ట్రేంజ్ డార్లింగ్ సినిమాను ఎరోటిక్ హారర్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించారు డైరెక్టర్ మొల్నెర్. థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో పాటు బోల్డ్ రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇద్దరి మధ్య వన్ నైట్ స్టాండ్‍తో మొదలయ్యే ఈ చిత్రం చాలా మలుపులు తిరుగుతుంది. కొన్ని ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. సీరియల్ కిల్లర్ ఎవరని రివీల్ అయ్యే సీన్ కూడా థ్రిల్లింగ్‍గా అనిపిస్తుంది. 96 నిమిషాలే ఈ మూవీ రన్‍టైమ్ ఉంటుంది
స్ట్రేంజ్ డార్లింగ్ మూవీలో ది లేడీ పాత్రలో విల్లా ఫిట్‍గెరాల్డ్ నటించారు. డెమోన్ క్యారెక్టర్‌ను గాల్నెర్ పోషించారు. ఈ చిత్రంలో మడిసెన్ బియాటీ, బర్బారా హెర్షి, బెగ్లే, బియాన్సా శాంతోస్, స్టీవెన్ మైకేల్ క్వెజాడా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మిరా మ్యాక్స్, స్పూకీ పిక్చర్స్ పతాకాలపై బిల్ బ్లాక్, స్టీవ్ షిండ్లెర్, రాయ్ లీ, రిబిసి ప్రొడ్యూజ్ చేశారు.
కాగా, హాలీవుడ్ బ్లాక్‍బస్టర్ మూవీ వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్.. ఇటీవలే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సూపర్ హీరో చిత్రంలో టామ్ హార్డ్లీ లీడ్ రోల్ చేశారు. గతేడాది అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బంపర్ హిట్ కొట్టింది. గత వారంలోనే ఇండియాలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
సంబంధిత కథనం