Siddharth Aditi Wedding: హీరో సిద్ధార్థతో డెస్టినేషన్ వెడ్డింగ్‌పై అదితి రావు క్లారిటీ, 400 ఏళ్ల పురాతన ఆలయంలో పెళ్లి?
Aditi Rao Hydari Wedding: మహా సముద్రం సినిమా సెట్‌లో తొలిసారి కలుసుకున్నహీరో సిద్ధార్థ, హీరోయిన్ అదితి రావు హైదరి రెండేళ్ల పాటు ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సడన్‌గా తమకి నిశ్చితార్థం అయినట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.
Hero Siddharth Wedding: హీరో సిద్ధార్థతో తన వివాహం ఎక్కడ జరుగుతుందో హీరోయిన్ అదితి రావు హైదరి మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం చేసుకున్న అదితి రావు త్వరలోనే తాము వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలిపింది.
వోగ్ ఇండియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి రావును ‘‘మీరు రాజస్థాన్‌లో పెళ్లి చేసుకుంటారా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా?’’ అని ప్రశ్నించగా నవ్వుతూ ఆమె బదులిచ్చింది. ‘‘తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో ఉన్న 400 ఏళ్ల పురాతన ఆలయం మా కుటుంబానికి సెంటిమెంట్. సిద్ధార్థతో నా వివాహం అక్కడే జరిగే అవకాశం ఉంది’’ అని అదితి రావు హింట్ ఇచ్చింది.
సిద్ధార్థ్‌ను కలిసిన తర్వాత
‘‘నాకు ఎక్కువగా రిలేషన్‌షిప్స్ లేవు. ఎందుకంటే నేను ఎవరినైనా చూసినప్పుడు అతను నా వ్యక్తి అవునా కాదా అని నాకు వెంటనే తెలిసిపోతుంది. సిద్ధుని కలిసినప్పుడు నా వ్యక్తి అని నాకు అనిపించింది. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని అదితి రావు చెప్పుకొచ్చింది.
సిద్ధార్థ్, అదితి లవ్ స్టోరీ
అజయ్ భూపతి 2021 తీసిన మహా సముద్రం సెట్స్‌లో అదితి, సిద్ధార్థ్ మొదటిసారి కలుసుకున్నారు. శర్వానంద్ కూడా నటించిన ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. అదితి, సిద్ధార్థ్ మధ్య రొమాన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ జంట మాత్రం చాలా కాలం తమ ప్రేమ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచింది. కాని తరచుగా వెకేషన్స్‌లో కలిసి కనిపిస్తూ వచ్చారు. 2023లో ఒక హిట్ సాంగ్‌కి కలిసి డ్యాన్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ను పోస్ట్ చేయడంతో ఇద్దరి ప్రేమ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది.
ఇద్దరి పెళ్లి గురించి మీడియా, సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నప్పటికీ స్పందించకుండా ఈ ఏడాది సడన్‌గా తమకి నిశ్చితార్థం జరిగిందని ఈ జంట ప్రకటించింది. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంపై సిద్ధార్థ ఒక సందర్భంలో క్లారిటీ కూడా ఇచ్చాడు.
‘‘చాలా మంది మేమిద్దరం రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని కామెంట్ చేశారు. కానీ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడానికి, రహస్యంగా చేసుకోవడానికి చాలా తేడా ఉంది. మేము ఆహ్వానించని వారు ఇది రహస్యం అనుకున్నారు. కానీ వచ్చిన వారికి అది మా పర్సనల్ విషయమని తెలుసు’’ అని సిద్ధార్థ చెప్పుకొచ్చాడు.
హీరో సిద్ధార్థ ఇటీవల నటించిన భారతీయుడు-2 సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ సిద్ధార్థకి ఆశించిన స్థాయిలో గత కొంతకాలంగా హిట్ పడటం లేదు.