OTT Family Thriller: డైరెక్ట్ ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ థ్రిల్లర్.. 80 నిమిషాల రన్‌టైమ్.. ఇక్కడ చూసేయండి!
Wife Off OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్ రిలీజ్ అయిన తెలుగు ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ వైఫ్ ఆఫ్. నిఖిల్ గాజుల, దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ ప్రధాన పాత్రల్లో నటించిన వైఫ్ ఆఫ్ సినిమాను భాను యేరుబండి దర్శకత్వం వహించారు. నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న వైఫ్ ఆఫ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై లుక్కేద్దాం.
Wife Off OTT Release Today: ఇటీవల తెలుగు ఓటీటీ కంటెంట్ ఎక్కువగా వస్తోంది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనే కాకుండా ఇతర వాటిల్లో కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తెలుగు సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో హారర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్స్‌తోపాటు ఎమోషనల్, ఫ్యామిలీ థ్రిల్లర్ జోనర్స్‌లో కూడా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

ఓటీటీ కంటెంట్‌తో
అలా, తాజాగా ఇవాళ (జనవరి 23) డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ వైఫ్ ఆఫ్. ఈ సినిమాలో నిఖిల్ గాజుల, దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదివరకు మై డియర్ దొంగ మూవీ, డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ వంటి ఓటీటీ కంటెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ గాజుల.
అలాగే, అభినవ్ మణికంఠ జై సేన, మహానటులు, సీతామహాలక్ష్మీ వంటి సినిమాలు చేశాడు. ఇక దివ్య శ్రీ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు భాను యేరుబండి దర్శకత్వం వహించగా.. రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. అలాగే, ప్రణీత్ సంగీతం అందించిన ఈ సినిమాకు అక్సర్ అలీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
రెండేళ్ల క్రితమే షూటింగ్
వైఫ్ ఆఫ్ మూవీలో నిఖిల్, దివ్య శ్రీ, అభినవ్‌తోపాటు సాయి శ్వేత, వీర్ మనోహర్ కావలి, కిరణ్ పుతకల ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే, రెండేళ్ల క్రిత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. వారం రోజులకు ముందు ఇవాళ వైఫ్ ఆఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రకటనకు తగినట్లుగానే నేటి నుంచి వైఫ్ ఆఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో వైఫ్ ఆఫ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా రన్ టైమ్ కేవలం గంట 20 నిమిషాలు అంటే, 80 నిమిషాలు మాత్రమే ఉంది. దీంతో సినిమాను ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.
గృహ హింస
కాగా, వైఫ్ ఆఫ్ ట్రైలర్, టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా గృహ హింస, రివేంజ్, లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌తో ఆద్యంతం థ్రిల్లింగ్ ఫీల్ ఇచ్చింది మూవీ. "ఇప్పటివరకు బరితెగించిన భర్తను చూశాను. ఇకనుంచి భయపెట్టే భార్యను చూస్తాడు" అని అవని పాత్ర చెప్పే డైలాగ్ హైలెట్‌గా ఉంది.
వైఫ్ ఆఫ్ మూవీ కథలోకి వెళితే.. అవని (దివ్య శ్రీ) అనే అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సినిమాల్లో నటించాలని కలలు కంటూ ఉంటుంది. అలాగే, తనకు తన బావ రామ్ (నిఖిల్ గాజుల) అంటే చాలా ఇష్టం. మరైవైపు డైరెక్టర్ కావాలని అభి (అభినవ్ మణికంఠ) ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతో అవని, అభి ఒక్కటై ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తారు. ఈ క్రమంలో అవనిని అభి లవ్ చేస్తాడు.
ట్విస్టులు
ఓరోజు తన లవ్ విషయం చెప్పేందుకు వెళ్లిన అభికి తన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి షాక్ ఇస్తుంది అవని. ఆ తర్వాత ఏమైంది? ఇష్టపడిన బావను పెళ్లి చేసుకున్న అవని ఎందుకు కన్నీళ్లు పెట్టాల్సి వచ్చింది? రాత్రి రోడ్లపై కాల్ గర్ల్‌గా ఎందుకు మారింది? గంజాయికి ఎందుకు బానిస అయింది? అనే ఇంట్రెస్టింగ్ అంశాలతో వైఫ్ ఆఫ్ సాగుతుంది.
సంబంధిత కథనం
టాపిక్