Bheemaa Movie: పాటలు హిట్టు -పదహారేళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ - అయినా తెలుగులో రిలీజ్ కాని త్రిష భీమా మూవీ
Bheemaa Movie: విక్రమ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన భీమా మూవీ పాటలు తెలుగులో సూపర్ హిట్టయ్యాయి. అయినా సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. కారణం ఏమిటంటే?
Bheemaa Movie: గోపీచంద్ హీరోగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కథాంశంతో రూపొందిన భీమా మూవీ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోపీచంద్ మూవీ కంటే ముందు భీమా టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. స్ట్రెయిట్ మూవీ కాదు. డబ్బింగ్ మూవీ. చియాన్ విక్రమ్, త్రిష హీరోహీరోయిన్లుగా 2008లో రూపొందిన ఈ మూవీకి లింగుస్వామి దర్శకత్వం వహించాడు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను అగ్ర నిర్మాత ఏఎమ్ రత్నం తెలుగులోకి డబ్ చేయాలని అనుకున్నారు. భీమా టైటిల్‌తోనే తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు
పరువపు వాన కురిసేనే
విక్రమ్ భీమా సినిమాకు హరీస్ జైరాజ్ సంగీతాన్ని అందించాడు. తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. భీమా సినిమాలోని తెలుగు పాటలు పెద్ద హిట్టయ్యాయి. ముఖ్యంగా పరువపు వాన కురిసేనే అనే సాంగ్ యూత్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నది. దాంతో భీమా తెలుగు వెర్షన్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ప్రొడక్షన్ డిలే...
కానీ ప్రొడక్షన్ డిలే వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది. షూటింగ్ కంప్లీట్ అయిన రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు తమిళ వెర్షన్ 2008లో రిలీజైంది. రొటీన్ స్టోరీ కారణంగా బాక్సాఫీస్ వద్ద భీమా డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి వారంలోనే థియేటర్ల నుంచి సినిమాను ఎత్తేశారు.కోలీవుడ్ రిజల్ట్ కారణంగా తెలుగు వెర్షన్‌ను కొనడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు.
దాంతో భీమా తెలుగు వెర్షన్ రిలీజ్‌కు నోచుకోలేదు. తెలుగు డబ్బింగ్, సాంగ్స్ వర్క్ అంత పూర్తయినా రిలీజ్ కాకుండా మిగిలిపోయిన మూవీగా భీమా నిలిచింది. అప్పటికే వరుస ఫ్లాపులతో నష్టాల్లో కూరుకుపోయిన ఏఎమ్ రత్నానికి భీమా రిజల్ట్ దారుణంగా షాకిచ్చింది. ఈ మూవీ దెబ్బతో సినిమా ప్రొడక్షన్‌కు చాలా ఏళ్ల పాటు దూరమయ్యాడు.
యూట్యూబ్‌లో పాటలు...
తెలుగులో సినిమా రిలీజ్ కాకపోయినా ఇందులోని పాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి. విక్రమ్, త్రిష భీమా మూవీలో రఘువరన్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు. భీమా తర్వాత దాదాపు పదహారేళ్ల గ్యాప్ అనంతరం పొన్నియన్ సెల్వన్‌లో విక్రమ్, త్రిష కలసి నటించారు.
త్రిష బిజీ...
పొన్నియన్ సెల్వన్, లియో సక్సెస్‌లతో దక్షిణాదిలో హీరోయిన్‌గా త్రిష మళ్లీ బిజీగా మారింది. ప్రస్తుతం కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న థగ్ లైఫ్‌లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతో పాటు అజిత్‌తో విదా మయూర్చి సినిమాకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మలయాళంలో రామ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూడు సినిమాలు 2024లోనే రిలీజ్ కాబోతున్నాయి
విశ్వంభరతో రీఎంట్రీ...
చిరంజీవి విశ్వంభరతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది త్రిష..2016లో రిలీజైన నాయకి తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది త్రిష. చిరంజీవి ఆచార్యలో అవకాశం వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ మూవీని రిజెక్ట్ చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ చిరంజీవి మూవీతోనే టాలీవుడ్‌లోకి తిరిగి అడుగుపెట్టబోతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిరంజీవి, త్రిషలపై ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. విశ్వంభర మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.