Chiranjeevi Upendra: చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌తో సినిమా ఛాన్స్‌ మిస్స‌వ్వ‌డానికి కార‌ణం అదే - ఉపేంద్ర కామెంట్స్ వైర‌ల్‌-why upendra missed an opportunity to direct a movie with chiranjeevi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Upendra: చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌తో సినిమా ఛాన్స్‌ మిస్స‌వ్వ‌డానికి కార‌ణం అదే - ఉపేంద్ర కామెంట్స్ వైర‌ల్‌

Chiranjeevi Upendra: చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌తో సినిమా ఛాన్స్‌ మిస్స‌వ్వ‌డానికి కార‌ణం అదే - ఉపేంద్ర కామెంట్స్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 17, 2024 02:06 PM IST

Chiranjeevi Upendra Movie: ఏ, ఉపేంద్ర సినిమాల స‌క్సెస్‌ త‌ర్వాత తెలుగులో డైరెక్ట‌ర్‌గా చిరంజీవితో ఓ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని ఉపేంద్ర అన్నాడు. అయితే మెగాస్టార్ ఇమేజ్‌ను హ్యాండిల్ చేసే క‌థ దొర‌క్క‌పోవ‌డంతో ఆ సినిమా ఆఫ‌ర్ చేజారింద‌ని ఉపేంద్ర చెప్పాడు.

ఉపేంద్ర
ఉపేంద్ర

Chiranjeevi Upendra Movie: ఏ, ఉపేంద్ర‌, ఓం లాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌తో ట్రెండ్ సెట్ట‌ర్ హీరోగా, డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్నాడు ఉపేంద్ర‌. అత‌డి సినిమాల‌న్నీ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటాయి. ఆ వైవిధ్య‌తే ఉపేంద్ర‌కు పాన్ ఇండియ‌న్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఉపేంద్ర హీరోగా న‌టించిన ఏ మూవీతెలుగులో జూన్ 21న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతోంది. 1998లో కేవ‌లం కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో రివ‌ర్స్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ మూవీ 20 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. రీ రిలీజ్‌లోనూ ఈ మూవీ భారీగా క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతోంది ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్నాయి.

చిరంజీవితో సినిమా...

ఏ తెలుగు రీ రిలీజ్ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు ఉపేంద్ర‌. ఈ సంద‌ర్భంగా చిరంజీవిని డైరెక్ట్ చేసే అవ‌కాశం మిస్స‌వ్వ‌డంపై ఓ ఇంట‌ర్వ్యూలో ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.ఏ, ఉపేంద్ర స‌క్సెస్‌ల త‌ర్వాత తెలుగులో ద‌ర్శ‌కుడిగా చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని ఉపేంద్ర అన్నాడు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో అశ్వినీద‌త్ ప్రొడ్యూస‌ర్‌గా చిరంజీవి సినిమా చేయాల్సింద‌ని ఉపేంద్ర తెలిపాడు.

కొత్త డైరెక్ట‌ర్‌ను అయినా తాను అప్ప‌ట్లో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ అంచ‌నా వేయ‌లేక‌పోయా. మెగాస్టార్‌ను హ్యాండిల్ చేయాలంటే స‌బ్జెక్ట్ చాలా పెద్ద‌గా ఉండాలి. నా ద‌గ్గ‌ర ఉన్న కొత్త ఐడియాల‌ను చిరంజీవితో పాటు ప్రొడ్యూస‌ర్‌కు చెప్పా. అవి వారికి న‌చ్చాయి. కానీ చిరంజీవి ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా నా క‌థ‌లు లేక‌పోవ‌డంతో సినిమా కార్య‌రూపం దాల్చ‌లేదు . అలా చిరంజీవిని డైరెక్ట్ చేసే ఆఫ‌ర్ మిస్స‌యింద‌ని ఉపేంద్ర అన్నాడు.

ర‌జ‌నీకాంత్‌..అమితాబ్ బ‌చ్చ‌న్‌ల‌తో...

ర‌జ‌నీకాంత్ కూడా త‌న‌తో సినిమా చేయ‌మ‌ని అడిగార‌ని, అలాగే అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ నుంచి డైరెక్ట‌ర్‌గా సినిమా ఆఫర్ వ‌చ్చింద‌ని కానీ అవేవీ వ‌ర్క‌వుట్ కాలేద‌ని ఉపేంద్ర అన్నాడు.

ఓంకారంతో టాలీవుడ్ ఎంట్రీ...

క‌న్న‌డంలో స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న ఉపేంద్ర‌...రాజ‌శేఖ‌ర్ ఓంకారంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క‌న్న‌డంలో స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ఆ త‌ర్వాత హీరోగా మారాడు. క‌న్న‌డంతో పాటు తెలుగులో క‌న్యాదానం, రా, ఒకే మాట‌, నీతోనే ఉంటాను సినిమాల్లో హీరోగా న‌టించాడు. అల్లు అర్జున్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, వ‌రుణ్ తేజ్ గ‌ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు.

ఉపేంద్ర న‌టించిన ఏ, ఉపేంద్ర‌, హాలీవుడ్‌తో పాటు ప‌లు క‌న్న‌డ సినిమాలు తె లుగులోకి డ‌బ్ అయి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి.

క‌బ్జా 130 కోట్ల బ‌డ్జెట్‌...30 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

గ‌త కొన్నాళ్లుగా హీరోగా, డైరెక్ట‌ర్‌గా ఉపేంద్ర‌కు స‌రైన విజ‌యాలు లేవు. ఆయ‌న హీరోగా న‌టించిన క‌బ్జాతో పాటు ప‌లు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఉపేంద్ర హీరోగా, శివ‌రాజ్‌కుమార్‌, సుదీప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన క‌బ్జా మూవీ కేవ‌లం 30 కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఉపేంద్ర కెరీర్‌లోనే దారుణ‌మైన ఫ్లాప్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో యూఐ పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ తెర‌కెక్కిస్తోన్నాడు ఉపేంద్ర‌. ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

WhatsApp channel