పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో బిజీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను పవన్ కల్యాణ్ చేపట్టడంతో సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కింది. పెండింగ్ షూటింగ్ తాజాగా మొదలైంది. పవన్ కల్యాణ్ లేని కొన్ని సీన్ల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. పవన్ కూడా త్వరలోనే జాయిన్ అవుతారు. ఈ తరుణంలో ఓజీ సినిమా గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది.
ఓజీ మూవీ సినిమాటోగ్రాఫర్ మారారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ముందుగా రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. అయితే, ఇప్పుడు ఆయన తప్పుకున్నారని సమాచారం. ఆయన స్థానంలో సినిమాటోగ్రాఫర్‌గా మనోజ్ పరమహంస ఓజీ యూనిట్‍లోకి వచ్చేశారు.
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న పారాశక్తి చిత్రంలో ప్రస్తుతం రవి కే చంద్రన్ బిజీగా ఉన్నారు. సడెన్‍గా ఓజీ షూట్ మళ్లీ మొదలవడంతో ఆయన డేట్స్ అడ్జస్ట్ కాలేదని తెలుసోంది. ఈ కారణంగానే మనోజ్ పరమహంసను సినిమాటోగ్రాఫర్‌గా ఓజీ మేకర్స్ తీసుకున్నారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో పెండింగ్‍లో ఉన్న కాస్త షూటింగ్‍ను పవర్ స్టార్ ఇటీవలే ఫినిష్ చేశారు. అయితే, హరి హర వీరమల్లు చిత్రానికి కూడా మనోజ్ పరమహంసనే సినిమాటోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఓజీకి కూడా ఆయనే వచ్చారు. యాక్షన్ సీన్లను చాలా స్టైలిష్ విజువళ్లతో చూపించగలరు పరమహంస. దీంతో ఓజీకి ఆయన బాగా సెట్ అవుతారనే అంచనాలు ఉన్నాయి.
పవన్ స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍కు మనోజ్ పరమహంసతో మంచి రిలేషన్ ఉంది. గుంటూరు కారం చిత్రానికి పరమహంసనే సినిమాటోగ్రఫీ చేశారు. వేగంగా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్న ఓజీకి ఆయన సూటవుతారు.
ఓజీ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ అయినట్టు మూవీ టీమ్ నిన్న (మే 12) అప్‍డేట్ ఇచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లేని సీన్ల షూటింగ్ జరుగుతోంది. ఈనెలలో ఓజీ షూటింగ్‍కు పవన్ వస్తారు. తాడేపల్లిలో చిత్రీకరణ జరగనుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా సుజీత్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఓజీ రిలీజ్ చేసేందుకు కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయారెడ్డి, హరీశ్ ఉత్తమన్ కీరోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా సుజీత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఒక్క గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కోసం వేయికళ్లుతో ఎదురుచూసేలా చేసింది.
ఓజీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రొడ్యూజ్ చేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారు.
సంబంధిత కథనం