Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!.. కారణం ఏంటంటే..-why manthena satyanarayana fans attacked on drinker sai movie director kiran thirumalasetti ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!.. కారణం ఏంటంటే..

Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!.. కారణం ఏంటంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 29, 2024 09:59 PM IST

Attack on Drinker Sai Director: డ్రింకర్ సాయి సినిమా దర్శకుడిపై డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు అభిమానులమంటూ కొందరు దాడి చేశారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే డైరెక్టర్‌పైకి దూసుకొచ్చారు. వాగ్వాదం చేశారు.

Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!.. కారణం ఏంటంటే..
Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!.. కారణం ఏంటంటే..

డ్రింకర్ సాయి సినిమా ట్రైలర్‌తో బజ్ తెచ్చుకుంది. బోల్డ్ సీన్స్, అభ్యంతరకర పదాలతో ఉన్న ట్రైలర్ వైరల్ అయింది. ధర్మ హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ కోసం టీమ్ ప్రమోషన్లను కూడా గట్టిగానే చేసింది. అయితే, డ్రింకర్ సాయి చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఈ మూవీ ఓ వివాదంలో చిక్కుకుంది.

yearly horoscope entry point

అభ్యంతరం ఇదే

నేచురోపతి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు చాలా ఫేమస్. ఆయన చెప్పే ప్రకృతి వైద్యం విధానాలను చాలా మంది పాటిస్తుంటారు. అయితే, డ్రింకర్ సాయి చిత్రంలో మంతెన సత్యనారాయణను స్టైల్‍లో ఓ స్ఫూఫ్ క్యారెక్టర్ ఉంది. ఈ పాత్రను భద్రం పోషించారు. అయితే, ఇది మంతెనను కించపరిచేలా ఉందని ఆయన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడిపై దాడి

డ్రింకర్ సాయి సినిమా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి నేడు మీడియాలో మాట్లాడుతుండగా.. కొందరు దాడికి దిగారు. గుంటూరులోని శివ థియేటర్ వద్ద నేడు (డిసెంబర్ 29) మంతెన సత్యనారాయణ అభిమానులమంటూ ఆయన మీదకు దూసుకొచ్చారు. కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న వారు అడ్డుకున్నారు. సినిమాను సినిమాలానే చూడాలంటూ కిరణ్ సహా మూవీ టీమ్ సభ్యులు వారితో వారించారు. దీంతో వాగ్వాదం జోరుగా సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

నిజమా.. ప్రమోషనల్ స్టంటా?

ఈ దాడి నిజమేనా.. మూవీ టీమ్ కావాలనే ప్రమోషన్ కోసం ఇలా చేసిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు డౌట్‍ పడుతున్నారు. డ్రింకర్ సాయి టీమ్ ముందు నుంచి ప్రమోషన్లను డిఫరెంట్‍గా చేస్తోంది. దీంతో ఇది కూడా ప్రమోషనల్ స్టంట్ అనే సందేహాలు వస్తున్నాయి.

డ్రింకర్ సాయి చిత్రంలో ధర్మ సరసన ఐశ్వర్య శర్మ హీరోయిన్‍గా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమురళి, సమీర్, భద్రం, కాంచీ, కిర్రాక్ సీత, రితూ చౌదరి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరిధర్ ప్రొడ్యూజ్ చేశారు. శ్రీ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. డ్రింకర్ సాయి మూవీ టీమ్ ప్రస్తుతం సక్సెస్ టూర్ చేస్తోంది. సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. సోమవారం ఓ షో మహిళలకు ఉచితంగా టికెట్లు ఇస్తామంటూ మూవీ టీమ్ ఆఫర్ ఇచ్చింది.

Whats_app_banner