Naga Chaitanya: క్రిమినల్‍లా చూస్తున్నారు.. ఆ బాధ నాకు తెలుసు: నాగచైతన్య ఎమోషనల్ కామెంట్లు-why i am treated like a criminal naga chaitanya comments on divorce with samantha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya: క్రిమినల్‍లా చూస్తున్నారు.. ఆ బాధ నాకు తెలుసు: నాగచైతన్య ఎమోషనల్ కామెంట్లు

Naga Chaitanya: క్రిమినల్‍లా చూస్తున్నారు.. ఆ బాధ నాకు తెలుసు: నాగచైతన్య ఎమోషనల్ కామెంట్లు

Naga Chaitanya on Divorce with Samantha: సమంతతో విడాకుల గురించి నాగచైతన్య తాజాగా మాట్లాడారు. ఎమోషనల్ కామెంట్లు చేశారు. తనను ఎందుకు క్రిమినల్‍గా చూస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. భావోద్వేగంగా మాట్లాడారు.

Naga Chaitanya: క్రిమినల్‍లా చూస్తున్నారు.. ఆ బాధ నాకు తెలుసు: నాగచైతన్య ఎమోషనల్ కామెంట్లు

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకొని సుమారు నాలుగేళ్లు అవుతుంది. శోభితా దూళిపాళ్లను గతేడాది వివాహం చేసుకున్నారు చైతూ. అయితే, నాగచైతన్య, సమంత విడాకుల విషయం అప్పటి నుంచి హాట్‍టాపిక్‍గానే ఉంది. ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ చర్చలు సాగుతూనే ఉంటాయి. ఈ విషయంపై నాగచైతన్య ఎమోషనల్ అయ్యారు. తండేల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతతో విడిపోవడం గురించి చైతన్య మాట్లాడారు.

క్రిమినల్‍లా ఎందుకు చూస్తున్నారో..

జీవిత భాగస్వామితో విడిపోవడం అనేది చాలా మంది జీవితాల్లో జరుగుతుందని, కానీ తనను ఎందుకు క్రిమినల్‍గా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదని నాగచైతన్య అన్నారు. యూట్యూబ్ ఛానెల్ ‘రా టాక్స్ విత్ వీకే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ ఈ విషయంపై స్పందించారు.

తాను కూడా ఓ విడిపోయిన కుటుంబం నుంచే వచ్చానని, తనకు ఆ బాధ తెలుసంటూ ఎమోషనల్ అయ్యారు నాగచైతన్య. “నా లైఫ్‍లో ఏదైతే జరిగిందో.. చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఇది నా జీవితంలో మాత్రమే జరగలేదు. కానీ నన్ను ఎందుకు క్రిమినల్‍లా చూస్తున్నారో. నేను ఏమైనా ఘోరమైన తప్పు చేశానా. రిలేషన్‍షిప్‍ను బ్రేక్ చేయాలంటే నేను వెయ్యిసార్లు ఆలోచిస్తా. ఎందుకంటే దాని పర్యవసానాలు నాకు తెలుసు. నేను కూడా బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లాడిని. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు” అని చైతూ చెప్పారు.

నాగచైతన్య తల్లిదండ్రులు నాగార్జున, లక్ష్మి దగ్గుబాటి కూడా గతంలో విడిపోయారు. ఆ తర్వాత అమలను నాగార్జున పెళ్లి చేసుకున్నారు. తండ్రి దగ్గరే చైతూ ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో విడిపోయిన ఫ్యామిలీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని ఈ ఇంటర్వ్యూలో చైతూ ఎమోషనల్ అయ్యారు.

అలా జరిగినందుకు బాధే.. ఫుల్‍స్టాప్ ఎక్కడో..

తాను, సమంత విడిపోవడం బాధగానే ఉందని, కానీ అది ఇద్దరి అంగీకారంతో కలిసి తీసుకున్న నిర్ణయమని చైతూ స్పష్టం చేశారు. ఎవరి దారుల్లో వారు బాగా వెళుతున్నామని అన్నారు. అయితే, దురదృష్టవశాత్తు అది హెడ్‍లైన్‍లా మారిందని బాధపడ్డారు.

తమ విడాకుల అంశం ఎంటర్‌టైన్‍మెంట్‍లా అయిపోయిందని చైతూ ఆవేదన వ్యక్తం చేశారు. “అది ఒక హైడ్‍లైన్‍లా, టాపిక్‍లా, గాసిప్‍లా అయిపోయింది. అదొక ఎంటర్‌టైన్‍మెంట్‍లా అయిపోయింది. నేను ఆలోచించా. నేను దాని గురించి మాట్లాడితే.. ఆ ఇంటర్వ్యూ నుంచైనా.. ఆ వీడియో నుంచైనా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. పుల్‍స్టాప్ అనేది ఎక్కడ ఉంది. రాసేవాళ్లే ఫుల్‍స్టాప్ పెట్టాలి” అని నాగచైతన్య ఎమోషనల్‍గా అన్నారు.

నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత 2021లో నాగచైతన్య, సమంత పరస్పర అంగీకారంతో విడిపోయారు. అయితే, వీరి విడాకుల అంశంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇది హాట్‍టాపిక్‍గానే ఉంటోంది.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా ఈ శుక్రవారం ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి మంచి ఓపెనింగ్ దక్కింది. తొలి రోజు సుమారు రూ.16కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనాలు వెలువడుతున్నాయి. నాగచైతన్యకు ఇది బెగ్గెస్ట్ ఓపెనింగ్‍గా ఉంది. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత కథనం