Balakrishna: బాలకృష్ణ డైరెక్షన్‌లో రావాల్సిన మైథలాజికల్ మూవీ - హీరోయిన్ మరణంతో ఆగిపోయింది!
Balakrishna: బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ర్తనశాల అనే టైటిల్‌తో 2004లో మైథలాజికల్ మూవీని మొదలుపెట్టారు. కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత సౌందర్య మరణంతో ఈ మూవీ ఆగిపోయింది.
Balakrishna: యాభై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో పౌరాణికం, జానపదం, యాక్షన్, ఫాంటసీ ఇలా అన్ని జానర్స్ టచ్ చేశారు బాలకృష్ణ. సమకాలీన హీరోలకు సాధ్యంకానీ కథాంశాలతో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడిగా 2004లో బాలకృష్ణ ఓసినిమా మొదలుపెట్టారు. అది కూడా మైథలాజికల్ కథాంశంతో భారీ బడ్జెట్ మల్టీస్టారర్‌గా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ మూవీ హీరోయిన్ మరణంతో అర్థాంతరంగా ఆగిపోయింది. అదే నర్తన శాల మూవీ.
స్వీయ దర్శకత్వంలో...
తండ్రి సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నర్తనశాల మూవీ స్ఫూర్తితో మైథలాజికల్ మూవీ చేయాలని బాలకృష్ణ అనుకున్నారు. 2004లో ఆ సినిమాకు శ్రీకారం చుట్టారు బాలకృష్ణ. తండ్రి సినిమా టైటిల్‌ను తీసుకొని హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమాను బాలకృష్ణ మొదలుపెట్టాడు. . ఈ సినిమాలో అర్జునుడు, బృహన్నలతో పాటు మరో పాత్రను చేయాలని బాలకృష్ణ అనుకున్నారు. ద్రౌపది పాత్ర కోసం సౌందర్యను తీసుకున్నారు. భీముడిగా శ్రీహరి, నకులుడిగా ఉదయ్‌కిరణ్, ధర్మరాజుగా శరత్‌బాబులను ఎంచుకొని ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు బాలకృష్ణ. ఉత్తర పాత్ర కోసం అసిన్‌ను ఫిక్స్ చేశారు.
సౌందర్య మరణంతో...
కొంత పార్ట్ ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూయడంతో నర్తనశాల మూవీకి బ్రేక్ పడింది. ద్రౌపది పాత్రలో మరో హీరోయిన్‌ను తీసుకొని ఈ సినిమా చేయాలని బాలకృష్ణ అనుకున్నారు. సౌందర్యకు తగ్గట్లుగా ఆ పాత్రకు సరిపోయే నటి దొరక్కపోవడంతో నర్తనశాల మూవీని బాలకృష్ణ పూర్తిగా పక్కనపెట్టారు. అలా బాలకృష్ణ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ షూటింగ్ పూర్తికాకుండానే ఆగిపోయింది.
గత ఏడాది రిలీజ్...
షూటింగ్ పూర్తికాకుండానే ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించి పదిహేడు నిమిషాల వీడియోను గత ఏడాది శ్రేయాస్ ఈటీ ఓటీటీలో బాలకృష్ణ రిలీజ్ చేశారు. నర్తనశాల మూవీ వీడియో నందమూరి అభిమానులతో సినీ లవర్స్‌ను ఆకట్టుకుంది.
రెండు సినిమాలు...
ప్రస్తుతం హీరోగా బాలకృష్ణ రెండు సినిమాలు చేస్తోన్నాడు. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో యానిమల్ ఫేమ్ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తోన్నాడు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది దసరాకు బాలకృష్ణ బాబీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాలుగో మూవీ...
సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో నాలుగో మూవీ రాబోతోంది. బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా సోమవారం ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అఖండ సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది భగవంత్ కేసరితో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కుపైగా కలెక్షన్స్ రాబట్టింది.