Srikanth Bolla: ఆంధ్రాకు చెందిన అంధుడి జీవితంపై బాలీవుడ్ సినిమా.. ఎవరు ఈ శ్రీకాంత్ బొల్లా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు-who is srikanth bolla whose inspired rajkummar rao biopic movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Srikanth Bolla: ఆంధ్రాకు చెందిన అంధుడి జీవితంపై బాలీవుడ్ సినిమా.. ఎవరు ఈ శ్రీకాంత్ బొల్లా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Srikanth Bolla: ఆంధ్రాకు చెందిన అంధుడి జీవితంపై బాలీవుడ్ సినిమా.. ఎవరు ఈ శ్రీకాంత్ బొల్లా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2024 04:26 PM IST

Srikanth Bolla: రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ మూవీ వస్తోంది. అంధుడైన శ్రీకాంత్ బొల్లా జీవితం స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతోంది. ఇంతకీ శ్రీకాంత్ ఎవరంటే..

Srikanth Bolla: ఆంధ్రాకు చెందిన అంధుడి జీవితంపై బాలీవుడ్ సినిమా.. ఎవరు ఈ శ్రీకాంత్ బొల్లా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Srikanth Bolla: ఆంధ్రాకు చెందిన అంధుడి జీవితంపై బాలీవుడ్ సినిమా.. ఎవరు ఈ శ్రీకాంత్ బొల్లా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Srikanth Bolla: బాలీవుడ్ హీరో రాజ్‍కుమార్ రావ్ నటించిన శ్రీకాంత్ చిత్రం నుంచి తాజాగా టీజర్ వచ్చింది. ఈ బయోపిక్ చిత్రానికి తుషార్ హీరానందిని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ స్టార్ నటి జ్యోతిక, అలయా ఎఫ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 10న రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శ్రీకాంత్ బొల్లా.. జీవితం ఆధారంగా ఈ శ్రీకాంత్ చిత్రం రూపొందుతోంది. కంటి చూపు లేక అనేక సవాళ్లు ఎదురైనా.. ఉన్నత చదువులతో పాటు ఎన్నో ఘనతలు సాధించిన శ్రీకాంత్ బొల్లా స్ఫూర్తిగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ బొల్లా గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

వదిలించుకోవాలన్నారట..

శ్రీకాంత్ బొల్లా 1991 సంవత్సరంలో జన్మించారు. కంటి చూపు లేకుండా జన్మించటంతో పుట్టిన వెంటనే అతడిని వదిలించుకోవాలని తల్లిదండ్రులకు కొందరు బంధువులు సలహాలు ఇచ్చారని సమాచారం ఉంది. అయితే, తల్లిదండ్రులు మాత్రం శ్రీకాంత్‍ను పట్టుదలతో చదివించేందుకు నిర్ణయించారు. కళ్లు సరిగా కనిపించని కారణంగా స్కూల్‍లోనూ తోటి విద్యార్థులతో మాటలు పడ్డారు శ్రీకాంత్ బొల్లా.

శ్రీకాంత్ బొల్లా సొంతఊరు ఆంధ్రప్రదేశ్‍లోని మచిలీపట్నం. వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. అయితే, తనకు కంటి చూపు లేని ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని ఆయన కష్టపడ్డారు. చదువులో రాణించారు. అమెరికాలోని MIT నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా శ్రీకాంత్ బొల్లా చరిత్రకు ఎక్కారు.

చదువు కోసం కోర్టుకు వెళ్లి..

పదో తరగతి పూర్తయ్యాక.. 12వ తరగతి (ఇంటర్మీడియట్)లో సైన్స్ సబ్జెక్టులు తీసుకోవాలని శ్రీకాంత్ బొల్లా అనుకున్నారు. అయితే, అంధుడైన కారణంగా నిబంధనలు అందుకు అనుమతించలేదు. అయితే, ఈ విషయంపై కోర్టులో ఆయన కేసు వేశారు. ఆరునెలల విచారణ తర్వాత.. తన సొంత రిస్క్‌పై శ్రీకాంత్.. సైన్స్ సబ్జెక్టు చదివేందుకు కోర్టు అనుమతించింది. ఇంటర్మీడియట్‍లో 98 శాతంతో క్లాస్‍లో టాపర్‌గా ఆయన నిలిచారు. ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా.. అంధుడైన కారణంగా ఆ అడ్మిషన్ దక్కలేదు.

శ్రీకాంత్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

శ్రీకాంత్ బొల్లా ప్రస్తుతం పారిశ్రామికవేత్తగా ఉన్నారు. హైదరాబాద్‍లో ఆయన బొల్లాంట్ ఇండస్ట్రీస్ అనే సంస్థను స్థాపించారు. ఆయనకు అమెరికాలో కార్పొరేట్ ఉద్యోగ అవకాశాలు వచ్చినా.. ఇండియాలోనే తన ఆవిష్కరణలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. 2012లో శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించాక.. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఫండింగ్ చేశారు. చెట్లు, మొక్కల ఆధారంగా ఈ కంపెనీ పర్యావరణహిత ప్రొడక్టులను తయారు చేస్తోంది. ఈ సంస్థ ద్వారా వందలాది మంది దివ్యాంగులకు శ్రీకాంత్ ఉపాధి కల్పిస్తున్నారు. ఆసియాలో 30 ఏళ్లలోపు 30 మంది అంటూ 2017లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన జాబితాలో శ్రీకాంత్ బొల్లాకు చోటు దక్కింది.

వ్యక్తిగత జీవితం

2022లో స్వాతిని ఆయన వివాహం చేసుకున్నారు. ఇటీవలే శ్రీకాంత్, స్వాతి తల్లిదండ్రులయ్యారు. వారికి రాజ్‍‍కుమార్ రావ్.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

సామాజిక సేవ

శ్రీకాంత్ బొల్లా.. సామాజిక సేవ కూడా ముమ్మరంగా చేస్తున్నారు. దివ్యాంగులైన పిల్లల కోసం 2011లో సమన్వయ్ సెంటర్‌ను ఆయన స్థాపించారు. బ్రయిలీ ప్రింట్ ప్రెస్‍ ఏర్పాటు, ఆ పిల్లలకు విద్యను అందించడం, ఆర్థికంగా సహకారం, పునరావాసం కల్పించడం లాంటి సేవలు అందిస్తున్నారు. ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నారు. 2016లో స్థాపించిన సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్‍కు శ్రీకాంత్ డైరెక్టర్‌గా ఉన్నారు.

అబ్దుల్ కలాంతో..

మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అప్పట్లో ప్రారంభించిన లీడ్ ఇండియా 2020లోనూ శ్రీకాంత్ బొల్లా సభ్యుడిగా వ్యవహరించారు. 2020 కల్లా దేశంలో పేదరికం, నిరక్ష్యరాస్యత, నిరుద్యోగాన్ని పారద్రోలి.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‍ను నిలుపాలన్నదే ఈ లీడ్ 2020 లక్ష్యం. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ భాగమయ్యారు.