రణవీర్ సింగ్ తో 20 ఏళ్ల అమ్మాయి రొమాన్స్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 యాడ్లు.. అత్యధిక రెమ్యునరేషన్.. ఎవరీ సారా అర్జున్?-who is sara arjun acting with ranveer singh in dhurandhar movie hundred ads highest paid child artist ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రణవీర్ సింగ్ తో 20 ఏళ్ల అమ్మాయి రొమాన్స్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 యాడ్లు.. అత్యధిక రెమ్యునరేషన్.. ఎవరీ సారా అర్జున్?

రణవీర్ సింగ్ తో 20 ఏళ్ల అమ్మాయి రొమాన్స్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 యాడ్లు.. అత్యధిక రెమ్యునరేషన్.. ఎవరీ సారా అర్జున్?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు (జూలై 6) అతని అప్ కమింగ్ మూవీ ధురంధర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న సారా అర్జున్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

ధురంధర్ సినిమాలో రణవీర్ సింగ్ తో యాక్ట్ చేస్తున్న సారా అర్జున్

రణవీర్ సింగ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ధురంధర్ నుంచి ఫస్ట్ లుక్ ఇవాళ (జూలై 6) రిలీజైంది. ఈ రోజు రణవీర్ బర్త్ డే. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ధురంధర్ ఫస్ట్ లుక్ లో రణవీర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఓ అమ్మాయి వీడియోలో తెగ క్యూట్ గా కనిపించింది. ఆమె పేరు సారా అర్జున్. 40 ఏళ్ల రణవీర్ తో 20 ఏళ్ల సారా రొమాన్స్ చేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె 100 యాడ్లు చేసింది. సారా అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ చూద్దాం.

  • సారా అర్జున్ కు ఇప్పుడు 20 ఏళ్లు. ఫీమేల్ లీడ్ రోల్ లో ధురంధర్ ఆమెకు తొలి సినిమా. 40 ఏళ్ల రణవీర్ సింగ్ తో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
  • 40 ఏళ్ల రణవీర్ 20 ఏళ్ల సారాతో సినిమాలో రొమాన్స్ చేయడం ఏంటీ అనే విమర్శలు వస్తున్నాయి. ఏజ్ గ్యాప్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రణవీర్ ఫస్ట్ సినిమా బ్యాండ్ బజా బరాత్ రిలీజైనప్పుడు సారాకు అయిదేళ్లే అంటూ ట్రోల్ చేస్తున్నారు.
  • హిందీలో వచ్చిన 404 సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా సారా అర్జున్ కు ఫస్ట్ మూవీ. ఆ తర్వాత తమిళం, హిందీ, మలయాళంలో సారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది.
  • తెలుగులోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా సారా ఓ మూవీలో యాక్ట్ చేసింది. తమిళ్ లో ఆమె చేసిన శైవమ్ మూవీని తెలుగులో దాగుడుమూతల దండాకోర్ అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో సారా యాక్ట్ చేసింది. 2015లో ఈ సినిమా వచ్చింది.
  • షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ల్లోనూ సారా నటించింది. ఉత్తమ బాల నటిగా పురష్కారాలు కూడా అందుకుంది.
  • సారా చిన్నతనంలోనే 100 వ్యాపార ప్రకటనల్లో నటించడం విశేషం. ఆమె ఒకటిన్నర ఏడాది వయసులోనే ఫస్ట్ యాడ్ లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మెక్ డొనాల్డ్స్ తో పాటు ఎన్నో ప్రముఖ బ్యాండ్ ల ప్రకటనల్లో కనిపించింది.
  • ఓ సమయంలో అత్యధిక పారితోషికం అందుకున్న బాలనటిగా సారా అర్జున్ రికార్డు నెలకొల్పింది.
  • ఆదిత్య ధార్ డైరెక్షన్ లో వస్తున్న ధురంధర్ మూవీలో రణవీర్ సింగ్ తో సారా అర్జున్ రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ తదితరులు కూడా నటిస్తున్నారు.
  • ధురంధర్ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
  • పొన్నియిన్ సెల్వన్ (2022-23)లో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి వెర్షన్‌ను పోషించినందుకు సారా అర్జున్ కు గొప్ప గుర్తింపు దక్కింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం