Bigg Boss Telugu Next Host : బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ ఎవరో తెలుసా?
Bigg Boss Telugu Host : రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగిసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7పై చర్చ మెుదలైంది. నాగార్జున హోస్ట్ నుంచి తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. నెక్ట్స్ సీజన్ హోస్ట్ ఎవరు అనేదానిపై ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 6(bigg boss season 6 telugu) ఆసక్తికరంగా సాగింది. డిసెంబర్ 18న ముగిసింది. మెదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న సింగర్ రేవంత్(Singer Revanth)ను విన్నర్ గా ప్రకటించారు. టాప్ 2గా శ్రీహన్ రూ.40 లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో విన్నర్ నుంచి తప్పుకొన్నాడు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో అంటే మెుదటగా గుర్తొచ్చేది ఎవరు హోస్ట్ చేస్తున్నారనే. సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. సీజన్ 7 నుంచి కింగ్ నాగార్జున తప్పుకొనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో నెక్ట్స్ ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ట్రెండింగ్ వార్తలు
బిగ్ బాస్ మెుదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హోస్ట్ చేశారు. యాంకరింగ్ తో బిగ్ బాస్ షోలో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి బిగ్ బాస్ షో తెలుగు ప్రజల్లోకి వెళ్లింది. రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హోస్ట్ చేశారు. ఈ సీజన్ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక మూడో సీజన్ నుంచి ఆరో సీజన్ వరకూ కింగ్ నాగార్జున(Nagarjuna) హోస్ట్ చేశారు. ఈ సీజన్లు కూడా ప్రేక్షకుల మెప్పు పొందాయి. సీజన్ 7 నుంచి హోస్ట్ చేయకూడదని నాగార్జున అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు(Bigg Boss Telugu) సీజన్ 6.. 14వ వారంలో ఇనయా ఎలిమినేషన్, హౌజ్ లో కొందరి కోసం పాలిటిక్స్ జరగడంలాంటి విషయాలు నాగార్జునకు నచ్చలేదట. వచ్చే సీజన్ హోస్ట్ చేయలేనని చెప్పేసినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అయితే తర్వాత ఎవరు అనే ప్రశ్నకు యంగ్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) అనే సమాధానం చెబుతున్నారు. ఆయనే రానున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. నాగార్జున కూడా రానాను రికమాండ్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు హోస్ట్ చేయబోతున్నారని బాలకృష్ణ(Balakrishna) పేరు కూడా వినిపిస్తోంది. నాగార్జున స్థానంలో బాలకృష్ణ వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్‌బీకేతో అన్‌స్టాపబుల్ అనే సెలబ్రిటీ టాక్ షోతో బాలకృష్ణ విజయవంతమైన హోస్ట్‌గా మారారు. బాలకృష్ణ హోస్టింగ్ స్కిల్స్‌ని ప్రజలు ఇష్టపడుతున్నారు. స్టార్ మా ఆయనను షో హోస్ట్‌గా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రియాలిటీ షోలో చేసేందుకు బాలకృష్ణ అంగీకరిస్తారా అని ప్రశ్నలు వస్తున్నాయి.
సంబంధిత కథనం