Rama Rajamouli: రాజమౌళి వైఫ్ నటించిన ఒకే ఒక తెలుగు సీరియల్ ఏదో తెలుసా?
Rama Rajamouli: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వైఫ్ రమ రాజమౌళి అమృతం సీరియల్‌లో నటిగా కనిపించింది. ఆమె సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన మొదటి, చివరి సీరియల్ ఇదే కావడం గమనార్హం.
Rama Rajamouli: రాజమౌళి సాధించిన విజయాల్లో ఆయన భార్య రమ రాజమౌళి పాత్ర చాలానే ఉంది. స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిష్ట్‌గా రమ రాజమౌళి పనిచేసింది. బాహుబలితో పాటు మగధీర, యమదొంగ సినిమాలకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా మూడు నంది అవార్డులను అందుకున్నది రమ రాజమౌళి.
నటిగా...
కాస్ట్యూమ్ డిజైనర్‌గా పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన రమ రాజమౌళి యాక్టర్‌గా కూడా స్క్రీన్‌పై కనిపించింది. అయితే సినిమాలో కాదు ఓ సీరియల్‌లో నటించింది. నటిగా రమ రాజమౌళి చేసిన ఒకే ఒక సీరియల్ ఇదే కావడం గమనార్హం.
అమృతం సీరియల్‌లో...
2000 దశకంలో బుల్లితెర అభిమానులను మెప్పించిన అమృతం సీరియల్‌లో రమ రాజమౌళి కొన్ని ఎపిసోడ్స్‌లో నటించింది. ఓ ఎపిసోడ్‌లో న్యూస్ రీడర్‌గా వార్తలు చదువుతూ కనిపించింది. మరో ఎపిసోడ్‌లో హౌజ్ వైఫ్‌గా గుండు హనుమంతరావుతో కలిసి నటించింది.
మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు...
అమృతం సీరియల్ ప్రొడ్యూసర్ కమ్ క్రియేటర్ గుణ్ణం గంగరాజు...రమ రాజమౌళికి బంధువు అవుతాడు. ఆ బంధుత్వంతోనే అమృతం సీరియల్‌లో రమ రాజమౌళి నటించింది. ఆ తర్వాత ఆమె మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు.
బాహుబలి సినిమాటోగ్రాఫర్...
రమ రాజమౌళితో పాటు అమృతం సీరియల్‌లో నటించిన పలువురు యాక్టర్స్, పనిచేసిన టెక్నీషియన్లు ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉండటం గమనార్హం. అమృతం సీరియల్‌కు సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్‌కుమార్ పనిచేశాడు. ఈ సీరియల్‌తోనే కెమెరామెన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన సెంథిల్ కుమార్...మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌కు సినిమాటోగ్రఫీ అందించాడు.
అమృతం సీరియల్‌లోని కొన్ని ఎపిసోడ్స్ టాలీవుడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు.
కమెడియన్ సత్య...
ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా కొనసాగుతోన్న సత్య అమృతం సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం గమనార్హం. ఓ ఎపిసోడ్‌లో ఆర్టిస్ట్‌గా కూడా సత్యం కనిపించాడు. శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరు కమెడియన్లు ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించారు.
టాపిక్